బెజవాడ బాద్షాస్‌...కడప కింగ్స్‌! | Andhra Premier League has decided to hold the tournament | Sakshi
Sakshi News home page

బెజవాడ బాద్షాస్‌...కడప కింగ్స్‌!

Published Thu, Sep 7 2017 12:50 AM | Last Updated on Sat, Aug 18 2018 4:18 PM

బెజవాడ బాద్షాస్‌...కడప కింగ్స్‌! - Sakshi

బెజవాడ బాద్షాస్‌...కడప కింగ్స్‌!

సాక్షి, హైదరాబాద్‌: తమిళనాడు ప్రీమియర్‌ లీగ్, కర్ణాటక ప్రీమియర్‌ లీగ్‌లు విజయవంతం కావడంతో ఇప్పుడు వేర్వేరు రాష్ట్ర క్రికెట్‌ సంఘాలు సొంత లీగ్‌కు సై అంటున్నాయి. ఈ జాబితాలో తాజాగా ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ఏసీఏ) చేరింది. ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) పేరుతో ఏసీఏ టి20 టోర్నీ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ఏడాది డిసెంబర్, 2018 జనవరి మధ్యలో ఈ టోర్నమెంట్‌ జరుగుతుంది. జిల్లాల్లోని ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించే లక్ష్యంతో తీసుకొస్తున్న ఈ టి20 లీగ్‌కు ‘యువర్‌ టైమ్‌ ఈజ్‌ నౌ’ అనే ట్యాగ్‌లైన్‌ను జోడించారు.

ఏపీఎల్‌ నిర్వహణ, ఆదాయ మార్గాలు, ఇతర సాంకేతిక అంశాలకు సంబంధించి రెడ్‌మూన్‌ క్రియేటివ్‌ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. టోర్నీకి సంబంధించిన అన్ని అంశాలను రెడ్‌మూన్‌ సంస్థే పర్యవేక్షిస్తుంది. ఈ లీగ్‌లో ఆరు జట్లు బరిలోకి దిగుతాయి. బెజవాడ బాద్షాస్, గోదావరి జాగ్వార్స్, గుంటూరు మిర్చీస్, కడప కింగ్స్, నెల్లూరు లయన్స్, వైజాగ్స్‌ వేల్స్‌ అనే పేర్లతో ఈ జట్లు బరిలోకి దిగుతాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement