
కరోనా కారణంగా రెండేళ్లు సినిమాలకు దూరమయ్యానని, ఈ గ్యాప్‌లో చాలా కథలు విన్నాను కానీ గోపిమోహన్ చెప్పిన స్టోరీ ఒకటే బాగా కనెక్ట్ అయిందని యంగ్ హీరో చేతన్ మద్దినేని అన్నారు. రోజులుమారాయి సినిమాతో టాలీవుడ్‌కి పరిచమైన చేతన్ మద్దినేని.. గల్ఫ్, ఫస్ట్ ర్యాంక్ రాజు చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. నేడు(జనవరి 29) ఆయన బర్త్‌డే. ఈ సందర్బంగా తన కొత్త చిత్రం గురించి చెబుతూ.. ‘సాయి కిషోర్ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చేస్తున్నాను. గోపిమోహన్ చెప్పిన కథ నచ్చి నేనే సొంతంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాను. యాభై శాతం పూర్తి అయిన ఈ సినిమాను పోలెండ్ లో షూట్ చేశాం.
రెడీ, డీ, చిరునవ్వుతో సినిమాల తరహాలో ఈ మూవీ ఉండబోతొంది. గోపిసుందర్ ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇదివరకే మూడు పాటలను చిత్రీకరించాము. హెబ్బ పటేల్ ఈ సినిమా కోసం మంచి మెకోవర్ అయ్యి బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. అలాగే మేజర్ యాక్టర్స్ ఈ మూవీలో నటించారు. త్వరలో ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేస్తాం’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment