
ఆసియాక్రీడలు-2023 పురుషల క్రికెట్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో సెమీఫైనల్లో భారత బౌలర్లు అదరగొట్టారు. పింగ్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. స్పిన్నర్ల ధాటికి బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 96 పరుగులకే పరిమితమైంది.
భారత బౌలర్లలో సాయికిషోర్ మూడు వికెట్లు పడగొట్టగా.. తిలక్ వర్మ, రవిబిష్ణోయ్, అర్ష్‌దీప్, షాబాజ్ అహ్మద్ తలా వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో జాకీర్ అలీ(24 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
చదవండి: World Cup 2023: ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్.. టీమిండియాకు భారీ షాక్!
Comments
Please login to add a commentAdd a comment