ఆసియాక్రీడలు-2023లో భారత పురుషల క్రికెట్ జట్టు బంగారు పతకానికి అడుగు దూరంలో నిలిచింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి టీమిండియా ఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం జరగనున్న తుది పోరులో ఆఫ్గానిస్తాన్‌తో భారత జట్టు తలపడనుంది.
కాగా బంగ్లాదేశ్‌తో సెమీఫైనల్లో టీమిండియా యువ సంచలనం, హైదరాబాదీ తిలక్ వర్మ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. తొలుత బౌలింగ్‌లో ఒక వికెట్ పడగొట్టిన తిలక్.. అనంతరం బ్యాటింగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
కేవలం 26 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 55 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో సిక్స్‌తో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్న తిలక్ వర్మ స్పెషల్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. 50 పరుగులు పూర్తి చేసిన తర్వాత తిలక్ వర్మ.. టీషర్ట్ పైకెత్తి తన ఒంటిపై ఉన్న పచ్చబొట్టును డగౌట్ వైపు చూపిస్తూ సంబరాలు జరుపుకున్నాడు.
కాగా ఆ పచ్చబొట్టు తన తల్లిదండ్రులది కావడం గమానార్హం. ఇందుకు సంబంధించిన వీడియో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ సెలబ్రేషన్స్ గల కారణాన్ని మ్యాచ్ అనంతరం తిలక్ వెల్లడించాడు.
"ఈ సెలబ్రేషన్స్ మా అమ్మ కోసం. నేను గత కొన్ని మ్యాచ్‌ల్లో బాగా రాణించలేకపోయా. నేను కొంచెం బాధపడ్డాను. కానీ మా అమ్మ మాత్రం నాకు ఎల్లప్పడూ సపోర్ట్‌గా ఉంటుంది. తిరిగి నా రిథమ్‌ను పొందతానని మాటిచ్చా. అందుకే ఇలా చేశా. అదే విధంగా అమ్మతో పాటు నా బెస్ట్ ఫ్రెండ్ 'సమైరా'కు ఈ హాఫ్ సెంచరీ అంకితమని" పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్ ప్రేజేంటేషన్‌లో తిలక్ వర్మ పేర్కొన్నాడు.
కాగా అంతకుముందు వెస్టిండీస్‌పై చేసిన తన తొలి టీ20 అర్ధ సెంచరీని కూడా సమైరాకు వర్మ అంకితమిచ్చాడు. సమైరా ఎవరో కాదు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గారాల పట్టి. కాగా 5 ఏళ్ల సామీతో తిలక్ చాలా క్లోజ్‌గా ఉంటాడు.
చదవండి: ODI WC 2023: పాక్ స్టార్ బౌలర్‌ను కొట్టిన బాబర్ ఆజం.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment