అతడిని భారత క్రికెటర్‌గా చూడటం చాలా సంతోషంగా ఉంది: దినేష్‌ కార్తీక్‌ | Dinesh Karthik Congratulate R Sai Kishore After Making India T20I Debut | Sakshi
Sakshi News home page

అతడిని భారత క్రికెటర్‌గా చూడటం చాలా సంతోషంగా ఉంది: దినేష్‌ కార్తీక్‌

Published Tue, Oct 3 2023 1:22 PM | Last Updated on Tue, Oct 3 2023 2:22 PM

Dinesh Karthik took to social media platform X to congratulate Sai Kishore - Sakshi

తమిళనాడు యువ ఆల్‌రౌండర్‌ సాయి కిషోర్‌ నేపాల్‌పై  టీమిండియా తరుపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆసియాక్రీడలు-2023లో భాగంగా నేపాల్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌తో సాయి కిషోర్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా సాయి కిషోర్‌కు తన సహచర ఆటగాడు, వెటరన్‌ వికెట్‌ కీపర్‌ దినేష్‌ కార్తీక్‌ అభినందనలు తెలిపాడు.

"కష్టపడి పనిచేసే వ్యక్తులకు ఆ దేవుడు ఖచ్చితంగా అన్ని తిరిగి ఇస్తాడు. తెల్ల బంతితో దేశవాళీ క్రికెట్‌లో అద్బుతాలు చేసిన ఈ ఆటగాడు.. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఉదయం లేచి ప్లేయింగ్‌ ఎలెవన్‌లో అతడి పేరు చూడగానే  భావోద్వేగానికి లోనయ్యాను. మీరు అతడు బాగా రాణించాలని కోరుకుంటున్నారు.

కానీ అతడు ఎప్పుడూ నా దృష్టిలో నెంబర్‌1గానే ఉంటాడు. సాయి కిషోర్‌కు బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేయగల సత్తా ఉంది. అతడు తన బ్యాటింగ్‌ను కూడా బాగా మెరుగుపరుచుకున్నాడు. అతడు కేవలం టీ20 క్రికెట్‌కు మాత్రమే కాదు అన్ని ఫార్మాట్‌లకు సరిపోయే ఆటగాడు. అతడిని ఇండియన్‌ క్రికెటర్‌గా చూడటం చాలా సంతోషంగా ఉంది. నీవు మరిన్ని అద్బుతాలు సృష్టించు సాయి" అంటూ ఎక్స్‌(ట్విటర్‌)లో దినేష్‌ కార్తీక్‌ రాసుకొచ్చాడు.

కాగా ఈ మ్యాచ్‌ జాతీయ గీతాలాపన సమయంలో సాయి కిషోర్‌ తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు. తొలి మ్యాచ్‌లో సాయి కిషోర్‌ పర్వాలేదనపించాడు.  4 ఓవర్లు బౌలింగ్‌ చేసిన సాయి కిషోర్‌ 25 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ పడగొట్టాడు.
చదవండి: వంట గదిలో నిద్రపోయేవాళ్లం.. మార్కెట్‌లో  స్నాక్స్ అమ్మేవాడిని: పాక్‌ స్టార్‌ ఆటగాడు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement