ఆసియాక్రీడలు-2023 పురుషల క్రికెట్ తొలి క్వార్టర్ ఫైనల్లో భారత్-నేపాల్ జట్లు తలపడుతున్నాయి. హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.
కేవలం 47 బంతుల్లోనే జైశ్వాల్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్ధి జట్టు బౌలర్లపై బౌండరీల వర్షం కురిపించాడు. ఓవరాల్‌గా 48 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్ 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 100 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు.
ఇది అతడికి తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీ కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో జైశ్వాల్‌తో పాటు రింకూ సింగ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 15 బంతులు ఎదుర్కొన్న రింకూ రెండు ఫోర్లు, 4 సిక్స్‌లతో 37 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
చదవండి: World cup 2023: 'పాక్, దక్షిణాఫ్రికా కాదు.. వరల్డ్‌కప్ సెమీఫైనల్‌కు చేరే జట్లు ఇవే'
Indian left-handed batters to score a T20I century:
— Kausthub Gudipati (@kaustats) October 3, 2023
Suresh Raina v SA, 2010
Yashasvi Jaiswal v NEP, today#INDvNEP #AsianGamespic.twitter.com/IKDDDPamHP
Comments
Please login to add a commentAdd a comment