
ఆసియాక్రీడలు-2023 పురుషల క్రికెట్ తొలి క్వార్టర్ ఫైనల్లో నేపాల్‌పై భారత జట్టు అదరగొట్టింది. హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 48 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్ 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 100 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు.
ఇక ఆఖరిలో రింకూ సింగ్ మెరుపులు మెరిపించాడు. కేవలం 15 బంతులు ఎదుర్కొన్న రింకూ రెండు ఫోర్లు, 4 సిక్స్‌లతో 37 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా కెప్టెన్ రుత్‌రాజ్ గైక్వాడ్ తన స్ధాయికి తగ్గట్టు రాణించలేకపోయయాడు.
23 బంతులు ఎదుర్కొన్న రుత్‌రాజ్ 25 పరుగులు చేసి ఔటయ్యాడు. అదే విధంగా తిలక్ వర్మ(2), అరంగేట్ర ఆటగాడు జితేష్ శర్మ(5) తీవ్ర నిరాశపరిచాడు. ఇక నేపాల్ బౌలర్లలో దిపేంద్ర సింగ్ రెండు వికెట్లు పడగొట్టగా.. లమిచానే,కామి ఒక్క వికెట్ పడగొట్టారు.
చదవండి: World cup 2023: 'పాక్, దక్షిణాఫ్రికా కాదు.. వరల్డ్‌కప్ సెమీఫైనల్‌కు చేరే జట్లు ఇవే'
Comments
Please login to add a commentAdd a comment