ఫీజుల పథకంతో ఎంబీఏ చదివా..
పేదరికం కారణంగా పెద్ద చదువులకు దూరం కావొద్దన్న ఆశయంతోనే వైఎస్ తెచ్చిన ఫీజుల పథకం ఎందరికో ఉన్నత విద్యను అందించింది.ఎందరో మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వారిలో జగిత్యాలకు చెందిన సాయికిశోర్ ఒకరు.
‘‘మాది జగిత్యాల జిల్లా విద్యానగర్. జగిత్యాలలో ఇంటర్ వరకు చదివా. తర్వాత ఎంబీఏలో సీటు వచ్చినా ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. అప్పుడే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఎంతగానో ఉపయోగపడింది. ఆ పథకం సాయంతో కరీంనగర్‌లోని వివేకానంద పీజీ కాలేజీలో ఎంబీఏ పూర్తిచేశాను. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ కంపెనీలో హెచ్‌ఆర్‌గా చేస్తున్నాను’’ అని ఆయన చెప్పారు.