ఏపీ మహిళా హాకీ టోర్నీ ప్రారంభం | ap hockey tournament starts | Sakshi
Sakshi News home page

ఏపీ మహిళా హాకీ టోర్నీ ప్రారంభం

Published Fri, Nov 18 2016 10:42 PM | Last Updated on Mon, Sep 4 2017 8:27 PM

ఏపీ మహిళా హాకీ టోర్నీ ప్రారంభం

ఏపీ మహిళా హాకీ టోర్నీ ప్రారంభం

నంద్యాల: స్థానిక ఎస్పీజీ మైదానంలో ఏపీ మహిళా హాకీ టోర్నీ శుక్రవారం​ప్రారంభమైంది. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ రవికృష్ణ, ఏపీ హాకీ అసోసియేషన్‌ కార్యదర్శి నిరంజన్‌రెడ్డి పాల్గొని టోర్నీని ప్రారంభించారు. ఎమ్మెల్యే భూమా క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు, ఓటములు సాధారణమని, ఓడిన వారు మళ్లీ గెలవడానికి కృషి చేయాలన్నారు. రాష్ట్రంలోని విజయనగరం మినహా మిగతా జిల్లాల నుంచి 250మంది క్రీడాకారులు, 50మంది కోచ్‌లు, మేనేజర్లు టోర్నీకి హాజరయ్యారు. తొలిరోజు పశ్చిమగోదావరి జిల్లాపై నెల్లూరు 5–0స్కోరుతో ప్రకాశంపై గుంటూరు 4–0 స్కోరుతో విజయం సాధించగా కృష్ణ–చిత్తూరు జిల్లాల మ్యాచ్‌ టైగా ముగిసింది. ఆదివారం ఫైనల్స్‌ జరగనున్నాయి. కార్యక్రమంలో కర్నూలు హాకీ అసోసియేషన్‌ అధ్యక్షుడు చాణిక్యరాజు, కార్యదర్శి సుధీర్, కర్నూలు విండోస్‌ స్కూల్‌  మేనేజర్‌ అగస్టీన్‌ పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement