రాష్ట్రస్థాయి టెన్నిస్ పోటీలకు ఎంపిక
రాష్ట్రస్థాయి టెన్నిస్ పోటీలకు ఎంపిక
Published Sat, Nov 5 2016 8:58 PM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM
గుంటూరు స్పోర్ట్స్: 62వ రాష్ట్ర స్కూల్ గేమ్స్ టెన్నిస్ పోటీలకు ఎన్టీఆర్ స్టేడియం క్రీడాకారులు షేక్ ఫరాజ్, మహితారెడ్డి, శ్రేష్టా, అపురూప్, ఆకాష్, హేమ సింధూర ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరిని శనివారం స్టేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు తదితరులు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి పోటీలకు ఎంపికవ్వాలని క్రీడాకారులకు సూచించారు. కార్యక్రమంలో స్టేడియం ఈసీ సభ్యుడు కోటిలింగా రెడ్డి, టెన్నిస్ కోచ్ జీవీఎస్ ప్రసాద్ క్రీడాకారులు పాల్గొన్నారు. కాగా, స్థానిక బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ స్టేడియం టెన్నిస్ కోర్టులలో సోమవారం నుంచి 9వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ టెన్నిస్ పోటీలు జరగనున్నాయి.
Advertisement
Advertisement