Tennis competitions
-
ఒలింపిక్స్ టెన్నిస్ అర్హత తేదీల ప్రకటన
లండన్: వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ టెన్నిస్ ఈవెంట్ అర్హత వివరాలను అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ప్రకటించింది. జూన్ 7, 2021 అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ), మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ర్యాంకింగ్స్ ఆధారంగా ఎంట్రీలను ఖరారు చేస్తామని ఐటీఎఫ్ తెలిపింది. 64 మందితో కూడిన పురుషుల, మహిళల సింగిల్స్ ‘డ్రా’లో టాప్–56 ర్యాంకింగ్స్ క్రీడాకారులు నేరుగా అర్హత సాధిస్తారు. మిగతా ఎనిమిది బెర్త్‌లలో ఆరు కాంటినెంటల్ క్వాలిఫయింగ్స్ ద్వారా భర్తీ చేస్తారు. మిగతా రెండు బెర్త్‌లు రిజర్వ్‌లో ఉంటాయి. డబుల్స్‌లో 32 జోడీలకు అవకాశం ఇస్తారు. టాప్–10 జోడీలకు నేరుగా ఎంట్రీ ఉంటుంది. మిక్స్డ్ డబుల్స్‌లో 16 జోడీలు బరిలోకి దిగుతాయి. సింగిల్స్, డబుల్స్‌లలో అర్హత పొందిన ఆటగాళ్లతో మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లను నిర్వహిస్తారు. ప్రతి దేశం నుంచి గరిష్టంగా నలుగురు మాత్రమే పోటీపడే వీలుంది. టోక్యో ఒలింపిక్స్ క్రీడలు వచ్చే ఏడాది జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరుగుతాయి. -
రాష్ట్రస్థాయి టెన్నిస్ పోటీలకు ఎంపిక
గుంటూరు స్పోర్ట్స్: 62వ రాష్ట్ర స్కూల్ గేమ్స్ టెన్నిస్ పోటీలకు ఎన్టీఆర్ స్టేడియం క్రీడాకారులు షేక్ ఫరాజ్, మహితారెడ్డి, శ్రేష్టా, అపురూప్, ఆకాష్, హేమ సింధూర ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరిని శనివారం స్టేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు తదితరులు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి పోటీలకు ఎంపికవ్వాలని క్రీడాకారులకు సూచించారు. కార్యక్రమంలో స్టేడియం ఈసీ సభ్యుడు కోటిలింగా రెడ్డి, టెన్నిస్ కోచ్ జీవీఎస్ ప్రసాద్ క్రీడాకారులు పాల్గొన్నారు. కాగా, స్థానిక బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ స్టేడియం టెన్నిస్ కోర్టులలో సోమవారం నుంచి 9వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ టెన్నిస్ పోటీలు జరగనున్నాయి. -
పట్టుదలతోనే పతకాల సాధన
గుంటూరు స్పోర్ట్స్: పట్టుదల, క్రమశిక్షణతో రాణిస్తే విజయాలు సొంతం చేసుకోవచ్చని ఆర్వీఆర్ కాలేజీ ఆధ్యాపకులు కొల్లా శ్రీనివాసరావు అన్నారు. స్థానిక ఏసీ కళాశాల ఎదురు గల ఉల్ఫ్ హాలులోని ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల చిన్నారులకు టెన్నిస్ సెంటర్లో శనివారం టాలెంట్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించారు. ముఖ్యఅతిధిగా హాజరైన శ్రీనివాసరావు విజేతలకు పతకాలు బహూకరించారు. అనంతరం మాట్లాడుతూ టోర్నమెంట్లు క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు దోహదపడుతాయన్నారు. టెన్నిస్ సెంటర్ కోచ్ ఎం.ఇజ్రాయిల్ మాట్లాడుతూ క్రీడలపై చిన్నారుల్లో ఆసక్తి కల్గించేందుకు టోర్నమెంట్లు నిర్వహించి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వై.షేక్, సీనియర్ క్రీడాకారుడు జోయల్, అస్టింట్ కోచ్‌లు జయకర్, గోపి, సురేంద్ర, క్రీడాకారులు మనోహర్, చేతన్, రామ్‌చరణ్, చేతన్ ప్రాఖ్యత్ రెడ్డి, షేక్ చిష్టి, కొల్లా గోష్ప«ద్నాథ్, విహర్, జితేంద్ర నాగసాయి, తదితరులు పాల్గొన్నారు.