చెస్ విజేతలు మౌనిక, స్నేహిల్
Published Sun, Aug 7 2016 8:24 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
గుంటూరు స్పోర్ట్స్ : జిల్లా చెస్ అసోసియేషన్ అధ్వర్యంలో ఆదివారం స్థానిక చంద్రమౌళి నగర్‌లోని అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన అండర్–19 జిల్లా స్థాయి పోటీలలో బాలుర విభాగంలో కె.స్నేహిల్, బాలికల విభాగంలో బి.మౌనిక అక్షయ విజేతలుగా నిలిచారు. జిల్లా స్థాయి బాలబాలికల పోటీలలో 30 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. బాలుర విభాగంలో కె.తనిష్క్ రెండవ, డి.హేమంత్ మూడవ, జి.హరిసూర్య భరద్వాజ్ నాల్గవ స్థానాలు సాధించారు. బాలికల విభాగంలో సి.హెచ్ వైష్ణవి రెండవ, సి.హెచ్.నీహారిక మూడవ, జి.రుత్విక నాల్గవ స్థానాలు సాధించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతి«థిగా హాజరైన చెస్ అసోసియేషన్ కార్యదర్శి చల్లా రవీంద్రరాజు విజేతలకు ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా రవీంద్రరాజు మాట్లాడుతూ విజేతలుగా నిలిచిన క్రీడాకారులను ఈనెల 12 నుంచి 14 వరకు విజయనగరంలో జరిగే రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు పంపుతామని చెప్పారు. కార్యక్రమంలో క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement