
ఇండోర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) వరల్డ్ టూర్ – డబ్ల్యూ35 టోర్నీ డబుల్స్ విభాగంలో భారత జోడి శ్రీవల్లి రష్మిక భమిడిపాటి – వైదేహి చౌదరి విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో రష్మిక – వైదేహి జంట 6–3, 7–5 స్కోరుతో నాలుగో సీడ్ య సువాన్ లీ (చైనీస్ తైపీ) – సొహ్‌యున్ పార్క్ (కొరియా)ని ఓడించింది.
మరో వైపు సింగిల్స్ విభాగంలో కూడా రష్మిక ఫైనల్‌కు చేరుకుంది. సెమీ ఫైనల్లో రష్మిక 6–3, 6–4తో ఏడో సీడ్ పొలినా లాట్‌సెంకో (రష్యా)పై గెలుపొందింది. ఫైనల్లో రెండో సీడ్ దలిలా జకుపొవిక్ (స్లొవేకియా)తో రష్మిక తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment