
నాగ్‌పూర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి శ్రీవల్లి రష్మిక డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్ చేరింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో రష్మిక–వైదేహి (భారత్) ద్వయం 6–2, 6–1తో సౌజన్య బవిశెట్టి (భారత్)–మె హసెగావా (జపాన్) జంటను ఓడించింది. సింగిల్స్ విభాగంలో హైదరాబాద్‌కే చెందిన సౌజన్య బవిశెట్టి, హుమేరా బహార్మస్ తొలి రౌండ్‌లోనే ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment