టాప్‌ సీడ్‌ జోడీకి రష్మిక ద్వయం షాక్‌  | Rashmika duo is a shock for the top seeded pair | Sakshi
Sakshi News home page

టాప్‌ సీడ్‌ జోడీకి రష్మిక ద్వయం షాక్‌ 

Published Wed, Dec 27 2023 4:03 AM | Last Updated on Wed, Dec 27 2023 4:03 AM

Rashmika duo is a shock for the top seeded pair - Sakshi

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టో ర్నీలో హైదరాబాద్‌ ప్లేయర్‌ శ్రీవల్లి రష్మిక డబుల్స్‌  విభాగంలో క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. నవీ ముంబైలో జరుగుతున్న ఈ టోర్నీలో మంగళవారం జరిగిన డబుల్స్‌ తొలి రౌండ్‌లో రష్మిక  –వైదేహి (భారత్‌) ద్వయం 7–6 (7/5), 6–2తో టాప్‌ సీడ్‌ జిబెక్‌ కులమ్‌బయేవా (కజకిస్తాన్‌)–జస్టినా మికుల్‌స్కయిట్‌ (లిథువేనియా) జోడీని బోల్తా కొట్టించింది.

మరో తొలి రౌండ్‌ మ్యాచ్‌లో సహజ యామలపల్లి–వైష్ణవి (భారత్‌) జంట 1–6, 6–2, 12–14తో అకీకో ఒమాయి (జపాన్‌)–బీట్రయిస్‌ గుమల్యా (ఇండోనేసియా) ద్వయం చేతిలో పోరాడి ఓడిపోయింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement