రాష్ట్రస్థాయి క్రికెట్‌ పోటీలు ప్రారంభం | state leval cricet compitation start | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి క్రికెట్‌ పోటీలు ప్రారంభం

Published Tue, Aug 9 2016 10:44 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

రాష్ట్రస్థాయి క్రికెట్‌ పోటీలు ప్రారంభం

రాష్ట్రస్థాయి క్రికెట్‌ పోటీలు ప్రారంభం

కరీంనగర్‌ స్పోర్ట్స్‌ : సర్దార్‌ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకొని సర్దార్‌ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి క్రికెట్‌ పోటీలు మంగళవారం స్థానిక జ్యోతి బాపూలే మైదానంలో ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్‌ హాజరయ్యారు. బ్యాటింగ్‌ చేసి కరీంనగర్‌–సుల్తానాబాద్‌ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీత కార్మికులు సర్వాయిపాపన్నను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా 32 జట్లు హాజరయ్యాయని, మంగళవారం నుంచి ఈ నెల 17 వరకు పోటీలు జరుగుతాయని నిర్వాహకులు, సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గణగాని సత్యనారాయణగౌడ్‌ తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్‌ రవీందర్‌ సింగ్, అర్జున అవార్డు గ్రహీత మాదాసు శ్రీనివాసరావు, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌ రెడ్డి, సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు మల్లేశంగౌడ్, పల్లె నారాయణగౌడ్, పర్శురాంగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement