బాల్‌బాడ్మింటన్ జిల్లా జట్ల ఎంపిక
బాల్‌బాడ్మింటన్ జిల్లా జట్ల ఎంపిక
Published Fri, Nov 11 2016 8:50 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM
లింగారావుపాలెం(యడ్లపాడు): స్కూల్æగేమ్స్ జిల్లా బాల్ బాడ్మింటన్ జట్ల ఎంపిక ప్రక్రియ మండలంలోని లింగారావుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మొదలైంది. స్కూల్‌గేమ్స్ కమిటీ జిల్లా కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు చేసిన సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నైపుణ్యం గల క్రీడాకారులను ఎంపిక చేస్తారు. అండర్–14, అండర్–17 విభాగాల్లో బాలికలు, బాలురకు వేర్వేరుగా ఎంపిక చేస్తున్నట్లు కమిటీ తెలిపింది. ఉదయం పది గంటలకు ఈ ఎంపిక ప్రక్రియను వ్యాయామోపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.కరిముల్లారావుచౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు విద్య ఒక్కటే ముఖ్యం కాదని, క్రీడల్లో పాల్గొనడం ద్వారా వారిలోని మానసిక ఒత్తిడి పోయి, ఎంతో చురుగ్గా, శారీరక ధృఢత్వాన్ని కలిగి ఉంటారన్నారు. ఫలితంగా విద్యలోనూ రాణించగలరన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, మున్సిపల్ పాఠశాలల నుంచి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు టి.రవీంద్రబాబు, పీఈటీ షేక్ ఖాదర్‌మస్తాన్, పీఈటీలు పాల్‌సుధాకర్, ఇస్మాయిల్, సీనియర్ పీఈటీ అమ్మయ్య తదితరులు ప్రతిభా పోటీలను పర్యవేక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అండర్ 14, అండర్–17 బాలురు, బాలికలకు వేర్వేరుగా పోటీలను నిర్వహించారు.
Advertisement
Advertisement