చౌక్‌బాల్‌ జిల్లా జట్ల ఎంపిక | District choukoball team sellection | Sakshi
Sakshi News home page

చౌక్‌బాల్‌ జిల్లా జట్ల ఎంపిక

Published Fri, Sep 30 2016 9:24 PM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM

చౌక్‌బాల్‌ జిల్లా జట్ల ఎంపిక

   గణపవరం (గుంటూరు జిల్లా) గణపవరం చుండి రంగనాయకులు పాలిటెక్నిక్‌ కళాశాలలో శుక్రవారం జిల్లా స్ధాయి చౌక్‌బాల్‌ అండర్‌ 19 జట్టు ఎంపిక పోటీలు జరిగాయి. ఈ పోటీలకు జిల్లాలోని వివిధ కళాశాలల నుంచి వంద మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర చౌక్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దామచర్ల శ్రీనివాసరావు, కార్యదర్శి ఎస్‌ సుధాకరరావు, ఉపాధ్యక్షుడు మువ్వా వేణు, జిల్లా చౌక్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, సిఆర్‌ కళాశాల అధ్యక్షుడు చుండి విజయసారధి, కార్యదర్శి ఫిలిప్‌రాజు, ట్రెజరర్‌ ఊసా సుబ్బారావులు హాజరయ్యారు. బాయ్స్‌ విభాగంలో 12 మంది జట్టును ఎంపిక చేశారు. వీరితో పాటూ అదనంగా మరో ముగ్గురు క్రీడాకారులను ఎంపికచేశారు. ఎంపికైన ఈ రెండు జట్లు ఈ నెల 3, 4, 5 తేదీల్లో కడప జిల్లా, ప్రొద్దుటూరులో జరిగే రాష్ట్ర స్థాయి అండర్‌ 19 జిల్లా జట్టు తరపున స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో పోటీల్లో పాల్గొననున్నారు. ఈ టీములకు కోచ్‌లుగా మనోహర్, అమీర్, మేనేజర్లుగా ఫిలిప్‌రాజు, వెంకటరమణ వ్యవహరించనున్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ పి లక్ష్మీరాజ్యం, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎం శ్రీనివాసరావు, ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ యాదూసింగ్‌ఠాకూర్, అధ్యాపకులు పి శ్రీనివాసరావు ఉన్నారు.
ఎంపికైన వారి వివరాలు. డి సుమంత్, గోపీకష్ణ (చైతన్య కళాశాల, చిలకలూరిపేట), ఐ వంశీకష్ణ, కె బాబు, ఎస్‌కే సమీర్‌ (మోడరన్‌ కళాశాల, చిలకలూరిపేట) బి నవీన్, (నారాయణ కళాశాల, చిలకలూరిపేట) ఎ భావనసాయి (భాష్యం, గుంటూరు), వి మణి (సిఆర్‌ కళాశాల గణపవరం) కె విద్యాసాగర్‌ (జెడ్పీ హెచ్‌ఎస్, పసుమర్రు), ఐ మణికంఠ (వేద, చిలకలూరిపేట), ఎం సిసింద్రీ (జెడ్పిహెచ్‌ఎస్, మురికిపూడి) పి గోపీపూర్ణచందు (జెడ్పిహెచ్‌ఎస్, బొప్పూడి) అదనంగా కె కిరీటి (భాష్యం, గుంటూరు) పవన్‌కళ్యాణ్‌ (నారాయణ, చిలకలూరిపేట) కె జాన్‌ (జెడ్పీహెచ్‌ఎస్, పసుమర్తి) ఎస్‌కే జానీ (మోడరన్, చిలకలూరిపేట)
బాలికల విభాగంలో ఎంపికైన వారి వివరాలు.... ఎస్‌ సువర్ణ (సెయింట్‌ ఛార్లెస్, చిలకలూరిపేట) కె రేణుక (ఏఎంజీ, చిలకలూరిపేట), ఎస్‌కే మునీరా, ఎస్‌కే ఆసిఫా, ఎస్‌కే ఆరిఫా (జెడ్పిహెచ్‌ఎస్, పసుమర్తి), బి శిల్ప (జెడ్పీహెచ్‌ఎస్‌; బొప్పూడి) పి శిరీష, పి భార్గవి, ఎన్‌ కవిత, అనూష (వేద,  చిలకలూరిపేట), అలేఖ్య, పావని (మోడరన్, చిలకలూరిపేట), అదనంగా కె జ్యోతి, సిహెచ్‌ జయరాణి, భవానిలను ఎంపికచేశారు.
 
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement