జిల్లా వాలీబాల్ జట్ల ఎంపిక
జిల్లా వాలీబాల్ జట్ల ఎంపిక
Published Sun, Sep 25 2016 8:37 PM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM
జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన క్రీడాకారులు
6 నుంచి గూడూరులో రాష్ట్రస్థాయి పోటీలు
తెనాలి: రాష్ట్ర అంతర జిల్లాల సీనియర్ వాలీబాల్ పోటీల్లో పాల్గొననున్న వాలీబాల్ పురుషుల, మహిళల జిల్లా జట్లను ఆదివారం ఇక్కడ ఎంపిక చేశారు. జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక వీఎస్‌ఆర్ అండ్ ఎన్‌వీఆర్ కాలేజీ మైదానానికి జిల్లావ్యాప్తంగా వచ్చిన క్రీడాకారుల నుంచి ఎంపిక నిర్వహించారు. అక్టోబరు 6– 9 తేదీల్లో నెల్లూరు జిల్లా గూడూరులో జరిగే అంతరజిల్లాల వాలీబాల్ పోటీల్లో ఈ జట్లు పాల్గొంటాయని అసోసియేషన్ అధ్యక్షుడు జి.గోపీచంద్ చెప్పారు. సెలక్షన్ కమిటీ సభ్యులుగా ఆయనతోపాటు ఎస్.నిరంజనరావు, జె.సింగారావు, జీకేవీఎస్ విజయ్‌చంద్, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి జి.బుల్లిప్రసాద్, రిటైర్డ్ జిల్లా క్రీడాభివద్ధి అధికారి ఆర్.సత్యనారాయణ పాల్గొన్నారు.
పురుషుల జట్టు ఇదీ..
షేక్ బాజీ (కొలనుకొండ), వి.సాయినితిన్, కె.ఉదయ్‌కుమార్, టి.తరుణ్ చమన్య (వడ్డేశ్వరం), కె.మధుసూదనరావు, టి.రవి (మంగళగిరి), కె.జెస్సిబాబు (మాచవరం), డి.సాయికృష్ణ, ఇ.రవీంద్ర (తెనాలి), షేక్ షమ్మీ సోహిల్, డి.సాయితేజ (వెదుళ్లపల్లి), ఎం.రాహుల్ (గుంటూరు), జి.కోదండరామయ్య (గంగవరం), జి.నవీన్ (వేమూరు), టి.నాగరాజు (ఈమని).
ఇది మహిళల జట్టు..
వీఎస్‌ఎల్‌కే దుర్గ, ఎ.నందిని (నంబూరు), డి.నారూష, పి.మాధురి, సీహెచ్.జెష్మ (గుంటూరు), వి.ద్రాక్షాయని, బీఎల్ కాంతమ్మ, వి.శిరీష, డి.వాణి, ఎ.రమ్య (తెనాలి), బి.మదర్‌థెరిస్సా (భట్టిప్రోలు), ఎ.కావ్య (అమతలూరు), బి.పరిమళ, బి.వైష్ణవి (వడ్లమూడి).
Advertisement
Advertisement