హ్యాండ్‌బాల్ జిల్లా జట్టు ఎంపిక
ఫిరంగిపురం: పట్టుదలతో ఆడి జిల్లా కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపచేయాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్వో) శ్రీనివాసరావు సూచించారు. ఫిరంగిపురంలోని సెయింట్ ఆన్స్ బాలికల హైస్కూల్‌లో బుధవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్ జిల్లా జట్టు ఎంపిక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని భట్టిప్రోలు, కొల్లూరు, ఫిరంగిపురం మండలాలకు చెందిన విద్యార్థినులను పోటీలకు ఎంపిక చేశారు. వీరంతా ఈ నెల 5,6 తేదీల్లో వైజాగ్‌లో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీడీ వెంగళరెడ్డి, పీఈటీ నిర్మల తదితరులు పాల్గొన్నారు.