
ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ తొలి సీజన్‌లో మహారాష్ట్ర ఐరన్‌మెన్ జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జైపూర్‌లో జరిగిన ఫైనల్లో మహారాష్ట్ర ఐరన్‌మెన్ జట్టు 38–24 తేడాతో గోల్డెన్ ఈగల్స్ ఉత్తరప్రదేశ్ జట్టుపై విజయం సాధించింది.
102 గోల్స్ చేసిన గోల్డెన్ ఈగల్స్ ఉత్తరప్రదేశ్ ఆటగాడు సుఖ్‌వీర్ సింగ్ బ్రార్ గోల్డెన్ బాల్‌ను గెలుచుకోగా.. లీగ్‌లో అత్యధికంగా 184 సేవ్స్ చేసినందుకు తెలుగు టాలన్స్‌కు చెందిన రాహుల్ టీకే గోల్డెన్ గ్లోవ్‌ను దక్కించుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బ్రార్‌కు మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ అవార్డు కూడా లభించింది.