hand ball
-
ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ తొలి సీజన్ విజేత మహారాష్ట్ర ఐరన్‌మెన్
ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ తొలి సీజన్లో మహారాష్ట్ర ఐరన్‌మెన్ జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జైపూర్‌లో జరిగిన ఫైనల్లో మహారాష్ట్ర ఐరన్‌మెన్ జట్టు 38–24 తేడాతో గోల్డెన్ ఈగల్స్ ఉత్తరప్రదేశ్ జట్టుపై విజయం సాధించింది. 102 గోల్స్ చేసిన గోల్డెన్ ఈగల్స్ ఉత్తరప్రదేశ్ ఆటగాడు సుఖ్వీర్ సింగ్ బ్రార్ గోల్డెన్ బాల్‌ను గెలుచుకోగా.. లీగ్‌లో అత్యధికంగా 184 సేవ్స్ చేసినందుకు తెలుగు టాలన్స్‌కు చెందిన రాహుల్ టీకే గోల్డెన్ గ్లోవ్‌ను దక్కించుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బ్రార్‌కు మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ అవార్డు కూడా లభించింది. -
హైదరాబాద్‌కు టైటిల్
సాక్షి, హైదరాబాద్: అంతర్ జిల్లా జూనియర్ బాలుర హ్యాండ్‌బాల్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు టైటిల్‌ను కై వసం చేసుకుంది. సరూర్‌నగర్‌లోని డీఎస్ఏ గ్రౌండ్సలో గురువారం జరిగిన ఫైనల్లో హైదరాబాద్ జట్టు 14-10తో నిజామాబాద్ జట్టుపై గెలుపొంది విజేతగా నిలిచింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో వరంగల్ జట్టు 10-9తో కరీంనగర్‌పై ఆధిక్యం సాధించింది. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో శాట్స్ డిప్యూటీ డెరైక్టర్ చంద్రారెడ్డి, తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీ పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
హ్యాండ్‌బాల్ జిల్లా జట్టు ఎంపిక
ఫిరంగిపురం: పట్టుదలతో ఆడి జిల్లా కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపచేయాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్వో) శ్రీనివాసరావు సూచించారు. ఫిరంగిపురంలోని సెయింట్ ఆన్స్ బాలికల హైస్కూల్లో బుధవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్ జిల్లా జట్టు ఎంపిక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని భట్టిప్రోలు, కొల్లూరు, ఫిరంగిపురం మండలాలకు చెందిన విద్యార్థినులను పోటీలకు ఎంపిక చేశారు. వీరంతా ఈ నెల 5,6 తేదీల్లో వైజాగ్‌లో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీడీ వెంగళరెడ్డి, పీఈటీ నిర్మల తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: అంతర్ జిల్లా సీనియర్ పురుషుల హ్యాండ్‌బాల్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది. వరంగల్‌లో జరిగిన ఈ టోర్నమెంట్ ఫైనల్లో హైదరాబాద్ జట్టు 9-7తో వరంగల్ జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో హైదరబాద్ తరఫున నరేశ్ 3, వాసు 2, వంశీ 2 గోల్స్చేయగా.. శ్రీధర్, శక్తి ప్రసాద్ చెరో గోల్ సాధించారు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో హైదరాబాద్ 16-9తో కరీంనగర్ జట్టును చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో వాసు, శక్తి ప్రసాద్, శ్రీధర్, వంశీ తలా మూడు గోల్స్‌తో రాణించారు. -
హైదరాబాద్ జట్టుకు టైటిల్
అంతర్ జిల్లా హ్యాండ్‌బాల్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: అంతర్ జిల్లా సీనియర్ మహిళల హ్యాండ్‌బాల్ ట్రోఫీని హైదరాబాద్ జట్టు కైవసం చేసుకుంది. వరంగల్‌లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో హైదరాబాద్ జట్టు 16-9తో రంగారెడ్డి జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ తరఫున దుర్గ 5, రాణి, 5, రమ్యకృష్ణ 5 గోల్స్‌తో రాణించారు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో హైదరాబాద్ జట్టు 10-1తో వరంగల్ జట్టును ఓడించింది. ఈ మ్యాచ్‌లోనూ దుర్గ 3, రమ్యకృష్ణ 4, రాణి 3 గోల్స్‌తో ఆకట్టకున్నారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం (హెచ్‌డీహెచ్‌ఏ) అధ్యక్షుడు బి. విజయ్ భాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రఫీఖ్ పాషా, కార్యదర్శి సీహెచ్. ఫ్రాంక్లిన్, సంయుక్త కార్యదర్శి బాలకృష్ణ పాల్గొన్నారు. -
నేటి నుంచి హ్యాండ్ బాల్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: అంతర్ జిల్లా హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ నేటి నుంచి వరంగల్‌లో జరుగనుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో తెలంగాణకు చెందిన పది జిల్లాల మహిళల, పురుషుల జట్లు తలపడతారుు. ఈమేరకు హైదరాబాద్ పురుషుల జట్టుకు శక్తి ప్రసాద్, మహిళల జట్టుకు దుర్గ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. హైదరాబాద్ పురుషుల జట్టు: శక్తి ప్రసాద్, వంశీ కిరణ్, కిరణ్ కుమార్, వాసు, శ్రీధర్, భరణి కశ్యప్, శ్రీకాంత్, చరణ్ కుమార్, ఇస్మారుుల్ పాషా, భగత్ లాల్, రవీందర్, సంతోష్, భాను చందర్, నరేశ్, ఉదయ్ కుమార్, మొరుునుద్దీన్, దీపక్ ప్రసాద్. మహిళల జట్టు: దుర్గ, శరణ్య, బిందుప్రియ, రమ్యశ్రీ, రిషిక, కృషిక, రమ్యకృష్ణ, రాణి, సాగరిక, నవ్య, సుమన, నందిత, వినీష, స్వాతి, ప్రియదర్శిని. -
హ్యాండ్ బాల్ పోస్టర్ విడుదల
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరుగనున్న సీనియర్ నేషనల్ హ్యాండ్ బాల్ చాంపియన్‌షిప్‌కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. బుధవారం బేగంపేట్‌లోని టూరిజం ప్లాజాలో ఈ క్రీడలకు సంబంధించి పోస్టర్‌ను టాలీవుడ్ హీరోయిన్లు రాశీ ఖన్నా, చార్మి, సంగీత దర్శకుడు రవివర్మతో కలసి ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి హ్యాండ్‌బాల్ సంఘం సెక్రటరీలు, కోచ్‌లు, సీనియర్ ఆటగాళ్లు, పాల్గొన్నారు. రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని పెంపొందించి, హ్యాండ్‌బాల్ గేమ్ అభివృద్ధికి కృషిచేస్తామని రామ్మోహన్ పేర్కొన్నారు. -
ప్రారంభమైన హ్యాండ్‌బాల్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్ : తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరుగనున్న అంతర్‌జిల్లాల సబ్‌జూనియర్స్ బాలికల హ్యాండ్‌బాల్ పోటీలు శనివారం అట్టహాసంగా ప్రా రంభమయ్యాయి. హన్మకొండలోని జవహర్లాల్ ఇండోర్ స్టేడియంలో అసోసియేషన్ రాష్ట్ర కా ర్యదర్శి శ్యామల పవన్‌కుమార్ అధ్యక్షతన జరి గింది. ఈ సభకు జిల్లా క్రీడాభివృద్ధి అధికారిణి ఇందిర హాజరై క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం సభకు హాజరైన అతిథులను శాలువా, మెమోంటో తో సత్కరించారు. కార్యక్రమంలో సీని యర్ కాంగ్రెస్ నాయకుడు బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి,వావిలాల సారంగపాణి, రాజలింగం, తోట శ్యాంప్రసాద్, చాగంటి శ్రీనివాస్, మేడిశెట్టి సుధాకర్, గమ్మళ్ళ సురేందర్, సురేష్, ఇంద్రసేనారెడ్డి, ప్రవీణ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. -
హ్యాండ్‌బాల్ పోటీల్లో మూడోస్థానం
కె.గంగవరం : కర్నూలులో ఈనెల 22 నుంచి 24 వరకూ జరిగిన ఏపీ స్టేట్ సబ్ జూనియర్ హ్యాండ్ బాల్ చాంపియన్ షిప్ పోటీల్లో జిల్లా బాలుర జట్టు తృతీయస్థానంలో నిలిచిందని దంగేరు హైస్కూల్ పీడీ ఎస్‌ఆర్‌కేవీ స్వామి సోమవారం స్థానిక విలేకరులకు తెలిపారు. జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఎన్.నరసింహమూర్తి నేతృత్వంలో పాల్గొన్న జిల్లాజట్టుకు కోచ్, మేనేజర్లుగా తాను ఎం.వెంకటేశ్వరరావు, ఆర్.వీరబాబు, కె.డి.స్వామిశేఖర్ అయ్యప్ప వ్యవహరించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చిన జిల్లా బాలుర జట్టులో ఎ.బాబ్జి శ్రీనివాస్, పి.అనిల్ కుమార్‌లను, బాలికల జట్టులో జి.రాజేశ్వరిని జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్టు చెప్పారు. వారు ఆగస్టులో చెన్నైలో జరిగే జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.కృష్ణారెడ్డి, ఇతర సంఘం సభ్యులు, క్రీడాకారులను అభినందించారు. -
హ్యాండ్‌బాల్ పోటీల్లో జిల్లా బాలుర జట్టుకు మూడోస్థానం
కె.గంగవరం : కర్నూలులో ఈనెల 22 నుంచి 24 వరకూ జరిగిన ఏపీ స్టేట్ సబ్ జూనియర్ హ్యాండ్ బాల్ చాంపియన్ షిప్ పోటీల్లో జిల్లా బాలుర జట్టు తృతీయస్థానంలో నిలిచిందని దంగేరు హైస్కూల్ పీడీ ఎస్‌ఆర్‌కేవీ స్వామి సోమవారం స్థానిక విలేకరులకు తెలిపారు. జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఎన్.నరసింహమూర్తి నేతృత్వంలో పాల్గొన్న జిల్లాజట్టుకు కోచ్, మేనేజర్లుగా తాను ఎం.వెంకటేశ్వరరావు, ఆర్.వీరబాబు, కె.డి.స్వామిశేఖర్ అయ్యప్ప వ్యవహరించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చిన జిల్లా బాలుర జట్టులో ఎ.బాబ్జి శ్రీనివాస్, పి.అనిల్ కుమార్‌లను, బాలికల జట్టులో జి.రాజేశ్వరిని జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్టు చెప్పారు. వారు ఆగస్టులో చెన్నైలో జరిగే జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.కృష్ణారెడ్డి, ఇతర సంఘం సభ్యులు, క్రీడాకారులను అభినందించారు. -
హ్యాండ్‌బాల్ ఛాంపియన్‌గా కడప మహిళల జట్టు
కడప స్పోర్ట్స్: ఏపీ హ్యాండ్‌బాల్ మహిళా ఛాంపియన్‌గా కడప జట్టు నిలిచింది. కర్నూలు నగరంలోని సిల్వర్‌జూబ్లీ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో కడప జట్టు సత్తాచాటింది. ఫైనల్ మ్యాచ్‌లో ప్రకాశం జట్టుతో తలపడి 13–4 పాయింట్ల తేడాతో విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. అదే విధంగా శనివారం నిర్వహించిన క్వార్టర్ ఫైనల్లో తూర్పుగోదావరిపై, సెమీఫైనల్లో శ్రీకాకుళం జట్టుపై విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించిన జిల్లా మహిళల జట్టు ఫైనల్లో సైతం అదే జోరు కొనసాగించి విజేతగా నిలిచింది. నిర్వాహకులు విన్నర్స్ ట్రోఫీని అందజేసి అభినందనలు తెలిపారు. జిల్లా క్రీడాకారిణుల ప్రతిభ పట్ల జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి వి.లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. -
21న హ్యాండ్‌బాల్ జిల్లాజట్టు ఎంపికలు
కడప స్పోర్ట్స్ : హ్యాండ్‌బాల్ జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు ఈనెల 21వ తేదీన కడప నగరంలోని రైల్వేస్టేషన్ వద్ద హాజరుకావాలని జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి వి. లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 17న నిర్వహించిన ఎంపికల్లో జిల్లాజట్టుకు ఎంపికైన క్రీడాకారులకు కర్నూలులో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఎంపికైన క్రీడాకారులు అర్హత పత్రాలు, ఆధార్‌కార్డ్, 4 పాస్‌పోర్టు సైజు ఫొటోలు వెంట తీసుకురావాలని సూచించారు. పూర్తి వివరాలకు 93474 21927 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలు ప్రారంభం