సాక్షి, హైదరాబాద్: అంతర్ జిల్లా సీనియర్ పురుషుల హ్యాండ్‌బాల్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది. వరంగల్‌లో జరిగిన ఈ టోర్నమెంట్ ఫైనల్లో హైదరాబాద్ జట్టు 9-7తో వరంగల్ జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో హైదరబాద్ తరఫున నరేశ్ 3, వాసు 2, వంశీ 2 గోల్స్‌చేయగా.. శ్రీధర్, శక్తి ప్రసాద్ చెరో గోల్ సాధించారు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో హైదరాబాద్ 16-9తో కరీంనగర్ జట్టును చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో వాసు, శక్తి ప్రసాద్, శ్రీధర్, వంశీ తలా మూడు గోల్స్‌తో రాణించారు.
హైదరాబాద్ జట్టుకు టైటిల్
Published Thu, Sep 29 2016 10:52 AM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM
Advertisement
Advertisement