త్వరలో జరుగనున్న సీనియర్ నేషనల్ హ్యాండ్ బాల్ చాంపియన్‌షిప్‌కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరుగనున్న సీనియర్ నేషనల్ హ్యాండ్ బాల్ చాంపియన్‌షిప్‌కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. బుధవారం బేగంపేట్‌లోని టూరిజం ప్లాజాలో ఈ క్రీడలకు సంబంధించి పోస్టర్‌ను టాలీవుడ్ హీరోయిన్లు రాశీ ఖన్నా, చార్మి, సంగీత దర్శకుడు రవివర్మతో కలసి ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి హ్యాండ్‌బాల్ సంఘం సెక్రటరీలు, కోచ్‌లు, సీనియర్ ఆటగాళ్లు, పాల్గొన్నారు. రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని పెంపొందించి, హ్యాండ్‌బాల్ గేమ్ అభివృద్ధికి కృషిచేస్తామని రామ్మోహన్ పేర్కొన్నారు.