హ్యాండ్‌బాల్ పోటీల్లో మూడోస్థానం
Published Mon, Jul 25 2016 9:50 PM | Last Updated on Fri, Jul 12 2019 3:37 PM
కె.గంగవరం :
కర్నూలులో ఈనెల 22 నుంచి 24 వరకూ జరిగిన ఏపీ స్టేట్ సబ్ జూనియర్ హ్యాండ్ బాల్ చాంపియన్ షిప్ పోటీల్లో జిల్లా బాలుర జట్టు తృతీయస్థానంలో నిలిచిందని దంగేరు హైస్కూల్ పీడీ ఎస్‌ఆర్‌కేవీ స్వామి సోమవారం స్థానిక విలేకరులకు తెలిపారు. జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఎన్.నరసింహమూర్తి నేతృత్వంలో పాల్గొన్న జిల్లాజట్టుకు కోచ్, మేనేజర్లుగా తాను ఎం.వెంకటేశ్వరరావు, ఆర్.వీరబాబు, కె.డి.స్వామిశేఖర్ అయ్యప్ప వ్యవహరించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చిన జిల్లా బాలుర జట్టులో ఎ.బాబ్జి శ్రీనివాస్, పి.అనిల్ కుమార్‌లను, బాలికల జట్టులో జి.రాజేశ్వరిని జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్టు చెప్పారు. వారు ఆగస్టులో చెన్నైలో జరిగే జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.కృష్ణారెడ్డి, ఇతర సంఘం సభ్యులు, క్రీడాకారులను అభినందించారు.
Advertisement
Advertisement