బాలికల కబడ్డీ జట్టుకు శిక్షణ శిబిరం
మంత్రిపాలెం(నగరం) : క్రీడాకారులు శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని విజయాన్ని సొంతం చేసుకోవాలని ప్రధానోపాధ్యాయుడు పద్మారావు చెప్పారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఖేలో ఇండియా జిల్లా బాలికల కబడ్డీ జట్టుకు శిక్షణ శిబిరాన్ని శుక్రవారం పద్మారావు ప్రారంభించి మాట్లాడారు. ఖేలో ఇండియా క్రీడలలో భాగంగా కబడ్డీలో అండర్–14.17 విభాగాలలో ఎంపికైన బాలికల కబడ్డీ జట్టుకు తమ పాఠశాలలో శిక్షణ శిబిరం ఏర్పాటుచేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మూడు రోజుల పాటు శిక్షణ శిబిరం కొనసాగుతుందన్నారు. పీఈటీలు జీ సుధీర్‌కుమార్, జీ కుటుంబరావు, కె సత్యనారయణ, సుబ్బారావులు కబడ్డీ జట్టుకు శిక్షణనిచ్చారు.