రేపటి నుంచి జట్ల ఎంపిక
ఉయ్యూరు :
కృష్ణాజిల్లా స్కూల్ గేమ్స్ జట్ల ఎంపిక ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్నామని గేమ్స్ నిర్వహణా కమిటీ ప్రతినిధి బాలు తెలిపారు. స్థానిక విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 8న షటిల్, బ్యాడ్‌మింటన్, 9న అథ్లెటిక్స్ జట్ల ఎంపిక చేస్తామన్నారు. ఏజీఅండ్‌ఎస్‌జీ సిద్ధార్థ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించే ఈ ఎంపికకు ధృవపత్రాలతో విద్యార్థులు హాజరుకావాలని కోరారు.