రాష్ట్రస్థాయి కబడ్డీలో రన్నరప్ ‘తూర్పు’
-విజేత ప్రకాశం జిల్లాజట్టు
సఖినేటిపల్లి : స్థానిక కుసుమ చిన సుందరరావు క్రీడా ప్రాంగణంలో 17వ వార్షిక కాంతారావు మెమోరియల్ రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్‌లో భాగంగా బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ప్రకాశం జిల్లా జట్టు విజేతగా, తూర్పుగోదావరి జట్టు రన్నరప్‌గా నిలిచాయి. ఈ నెల ఒకటిన మొదలయిన టోర్నీలో ప్రకాశం, తూర్పుగోదావరి జట్లు ఫైనల్స్‌కు చేరుకున్నాయి. విజేత ప్రకాశం జట్టుకు ప్రథమ బహుమతి కింద రూ.35 వేల నగదు, షీల్డ్‌ను, రన్నరప్ తూర్పు గోదావరి జట్టుకు ద్వితీయ బహుమతి కింద రూ.25 వేల నగదు, షీల్డ్‌ను అందజేశారు. తృతీయ బహుమతి కింద గుంటూరు జట్టుకు రూ.20 వేల నగదు, షీల్డ్‌ను, చతుర్థ బహుమతి కింద విశాఖపట్నం జట్టుకు రూ.10 వేల నగదు, షీల్డ్‌ను అందజేశారు. అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్, రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, రిటైర్డ్ ఎస్పీ వి.ప్రేమ్‌కుమార్, స్పాన్సర్స్ గొల్లమందల శరత్‌బాబు, ఇందుకూరి సుబ్బరాజు, నల్లి నాగేశ్వరరావు, ఇంజేటి సుధాకర్, రాష్ట్ర ఫెన్సింగ్ అసొసియేషన్ అధ్యక్షుడు ఎం.అక్కిరాజు విజేతలకు బహుమతులను అందజేశారు. సఖినేటిపల్లి మాజీ సర్పంచ్ జంపన రామకృష్ణంరాజు, టీచర్ నల్లి విశ్వనాథం షీల్డ్‌లను అందజేశారు. నాయకులు గెడ్డం తులసీభాస్కర్, గెడ్డం పేర్రాజు, అల్లూరు మధురాజు, చింతా రాజబాబు, టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ తోటె ప్రతాప్‌కుమార్, అధ్యక్షుడు గొల్లమందల చిట్టిబాబు, కార్యదర్శి నల్లి బన్ను పాల్గొన్నారు.