ఎక్స్‌లెన్సీ అవార్డు అందుకున్న ప్రసాద్‌ | exlency award prasad | Sakshi
Sakshi News home page

ఎక్స్‌లెన్సీ అవార్డు అందుకున్న ప్రసాద్‌

Published Thu, Jun 22 2017 11:59 PM | Last Updated on Tue, Sep 5 2017 2:14 PM

exlency award prasad

సామర్లకోట : 
విశాఖలో ఈ నెల 20న లలితా కన్వెన్షన్‌ హాల్‌లో జరిగిన ఇండియన్‌ క్లాసికల్‌ డ్యాన్స్‌ ఫెస్టివల్‌లో వియత్నాం ఇంటర్నేషన్‌ డ్యాన్స్‌ ఎక్స్‌లెన్సీ అవార్డును అలమండ ప్రసాద్‌ అందుకున్నారు. ఆ విషయాలను గురువారం ఆయన విలేకర్లకు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిద్ధేంద్రయోగి కూచిపూడి కళాపీఠం ప్రిన్సిపాల్‌ వేదాంతం రామలింగశాస్ర్తి పాల్గొని కూచిపూడి నాట్యం శాస్త్రీయమైనదని,
ఈ నాట్య కళను విశ్వ వ్యాప్తంగా చేయడానికి అందరూ అంకితభావంతో కృషి చేయాలని కోరినట్టు అలమండ ప్రసాద్‌ తెలిపారు. అవార్డు అందుకుని సామర్లకోట వచ్చిన ప్రసాద్‌ను పలువురు అభినందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement