
దేశవ్యాప్తంగా బిగ్‌బాస్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే హిందీతో పాటు ఇతర భాషల్లోనూ ఆ షో విజయవంతంగా నడుస్తోంది. మరోవైపు కేవలం ఓటీటీ వేదికగా టెలికాస్ట్ అవుతున్న కరణ్ జోహార్ బిగ్‌బాస్ ఓటీటీ తొలి సీజన్ కూడా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తాజాగా బిగ్‌బాస్ ఓటీటీ కంటెస్టెంట్స్‌లో ఒకరైన షమితా శెట్టి మొదటి సారి తన వ్యక్తిగత విషయాలను మరో కంటెస్టెంట్‌తో పంచుకొని ఎమోషనల్ అయ్యింది. ఇక ఈ బ్యూటీ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి సోదరి అనే విషయం తెలిసిందే.
నా మొదటి ప్రేమ అలా..
తన తోటి కంటెస్టెంట్ నేహాతో జరిగిన సంభాషణలో.. తన మొదటి బాయ్‌ఫ్రెండ్ కారు ప్రమాదంలో మరణించాడని తెలిపింది. ఆ సమయంలో అతనితో తన అనుబంధాన్ని, అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనైంది. అయితే వ్యక్తిగత విషయాల్లో ఎంతో గోప్యంగా ఉండే ఆమె ఇలాంటి విషయాలు పంచుకోవడం విశేషం. అనంతరం షమితా రాకేష్ బాపత్‌తో మాట్లాడుతూ.. ‘ఆమె ఒంటరిగా ఉన్నా ఎంతో స్ట్రాంగ్‌గా ఉండేదని, కానీ కోవిడ్ వల్ల విధించిన లాక్‌డౌన్ సమయంలో మాత్రం ఒంటరితనంగా ఫీల్ అయినట్లు’ తెలిపింది. అలాగే తన తండ్రి మరణానంతరం తన భుజాలపై పడిన బాధ్యతల గురించి కూడా ఆ బ్యూటీ వివరించింది.
ఇంకా శిల్పా సోదరిగానే..
‘నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు పైనే గడిచిపోయాయి. ఇప్పటి వరకు అందరూ నన్ను శిల్పాశెట్టి సోదరిగానే గుర్తిస్తున్నారు. ఆమె నాకు నీడలా ఉంది. అది నాకు సంతోషంగానే ఉన్నప్పటికి నా గురించి నిజం జనాలకు తెలీదు’ అని షోలో షమితా శెట్టి తెలిపింది. ఆ నీడ నుంచి బయటపడి తను ప్రత్యేక గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. కాగా షో చూసిన వారికి ఎవరికైనా షమితా శెట్టి, రాకేష్ బాపత్‌కి మధ్య మంచి బంధం ఉందనే విషయం అర్థమవుతుంది. రాకేష్ అంటే తనకి ఇష్టమని, కానీ అవసరమైన సమయంలో తనని డిఫెండ్ చేసేవాడు తనకి కావాలని ఆమె షోలో చెప్పిన విషయం తెలిసిందే.
చదవండి: Bigg Boss 5 Telugu: మా అమ్మతో రవికి గట్టిగానే ఉంటుంది: మానస్
Comments
Please login to add a commentAdd a comment