
బిగ్‌బాస్ రియాలిటీ షోతో ఒక్కటైన వారిలో షిమితా శెట్టి, రాకేశ్ బాపత్ జంట ఒకటి. హిందీ బిగ్‌బాస్ ఓటీటీకి కంటెస్టెంట్ వెళ్లిన వీరిద్దరు జంటగా బయటకు వచ్చారు. హౌజ్‌లో ప్రేమలో పడ్డ షమితా-రాకేశ్ మధ్య కెమిస్ట్రి చూసి వారి ప్యాన్స్ తెగ ముచ్చటపడ్డారు. హౌజ్‌ను నుంచి బయటకు వచ్చిన అనంతరం కూడా వీరు వారి రిలేషన్ కొనసాగించారు. జంటగ పార్టీలకు, డిన్నర్లకు వెళ్లెవారు. అయితే ఏమైందో ఏమో కానీ కొద్ది రోజులుగా వీరిద్దరు విడిపోయారంటూ వార్తలు వస్తున్నాయి. కలిసిన ఏడాదికే ఈ జంట బ్రేకప్ చెప్పుకుందంటూ బాలీవుడ్ మీడియాల్లో జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై వారెప్పుడు స్పందించలేదు.
చదవండి: మరి మహిళల నగ్న చిత్రాల సంగతేంటి?: ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్
దీంతో ఇవి వట్టి పుకార్లనేనని ఈ జంట ఫ్యాన్స్ అభిప్రాయం పడ్డారు. తాజాగా ఇదే వార్తలను నిజం చేస్తూ ఫ్యాన్స్‌కి షాకిచ్చారు ఈ లవ్‌బర్డ్స్. ఇకపై తమ దారులు వేరంటూ బ్రేకప్‌పై అధికారిక ప్రకటన ఇచ్చారు. ఈ మేరకు షమితా-రాకేశ్ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ‘ఇది మీతో క్లియర్ చేసుకోవడగం ముఖ్యం అనుకుంటున్నాను. నేను రాకేశ్ కొంతకాలంగా కలిసి ఉండటం లేదు. ఇకపై కూడా ఉండబోం. మా దారులు వేరు. మాపై చూపించిన మీ ప్రేమ, అభిమానానికి కృతజ్ఞురాలిని. ఇకపై కూడా ఇలాగే వేరువేరుగా మాపై ప్రేమ చూపిస్తారని ఆశిస్తున్నా’ అంటూ షమితా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో నోట్ షేర్ చేసింది. అలాగే రాకేశ్ బాపత్ సైతం పోస్ట్ చేస్తూ ఇకపై తమ దారులు వేరంటూ బ్రేకప్‌పై ప్రకటన ఇచ్చాడు. కాగా నటి శిల్పాశెట్టి సోదరి అయిన షమితా శెట్టి ‘పిలిస్తే పలుకుతా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
చదవండి: ధనుష్‌తో గొడవలు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment