గొడ్డు మాంసానికీ, గొర్రె మాంసానికీ తేడా ఏమీ లేదని ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్, న్యాయనిపుణుడు మార్కండేయ కట్జు చెప్పడం విచారకరం. ఆవును హిందువులు చూసే పద్ధతి వేరు. ఆ జీవి వారికి పవిత్రమైనది. దేవునితో సమంగా కొలుస్తారు. ఆవు పేడ, మూత్రం, పాలు అన్నీ ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తా యని శాస్త్రీయంగా రుజువైంది. ఇప్పుడు ఆవు మాంసం వివా దం దేశాన్ని కుదిపివేస్తున్నది. అయితే ఈ పేరుతో భౌతిక దాడులు సరైనవి కావు. ఈ వాస్తవాన్ని అంగీకరిస్తూనే, హిందు వుల మనోభావాలను కించపరిచే విధంగా ఆవు మాంసం గురించి వ్యాఖ్యలు చేసే వారిపట్ల సుప్రీంకోర్టు కొరడా ఝళి పించవలసి ఉంది.
గోవు మాంసం తినడం వ్యక్తిగతమే. కానీ ఆవు మాంసానికీ, మేక మాంసానికీ తేడా లేదని చెప్పడం మూర్ఖత్వమే. అదే సమయంలో ఆవు మాంసం వివాదం నేప థ్యంలో హిందూ మనోభావాలను అవమానిస్తూ, హిందూ దేవుళ్లను అవమానించడం సరికాదని గుర్తించాలి. భారతదేశం లో ముస్లింలకు సామాజికంగా ఉన్నత స్థానం ఇస్తున్నారు. ఇక్కడ హిందువులదే ఎక్కువ సంఖ్య అయినప్పటికీ ఆ విధ మైన సమరసత కనిపిస్తుంది. కాబట్టి ఆవు విషయంలో మైనారి టీలు కొంత ఉదారంగా వ్యవహరించాలని కోరుతున్నాను.
కోలిపాక శ్రీనివాస్ బెల్లంపల్లి, ఆదిలాబాద్ జిల్లా