ఫోర్టిస్‌కు మరింత మెరుగైన మణిపాల్‌ ఆఫర్‌ | Manipal further sweetens offer for Fortis Healthcare | Sakshi
Sakshi News home page

ఫోర్టిస్‌కు మరింత మెరుగైన మణిపాల్‌ ఆఫర్‌

Published Mon, May 14 2018 11:43 PM | Last Updated on Tue, May 15 2018 12:13 AM

Manipal further sweetens offer for Fortis Healthcare - Sakshi

న్యూఢిల్లీ: ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ కొనుగోలు ప్రక్రియలో తాజాగా మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. మణిపాల్‌–టీపీజీ కన్సార్షియమ్‌ మరింత ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఒక్కో షేర్‌ను రూ.180కి కొనుగోలు చేస్తామని ఈ కన్సార్షియమ్‌ ముందుకు వచ్చిందని ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ స్టాక్‌ ఎక్సే్చంజ్‌లకు నివేదించింది. ముంజాల్‌–బర్మన్‌ల ఆఫర్‌కు ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ డైరెక్టర్ల బోర్డ్‌ గత వారం ఆమోదం పొందిన విషయం తెలిసిందే.

స్వతంత్ర మదింపు సంస్థ ఒకటి ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ విలువను రూ.6,070 కోట్లుగా అంచనా వేసిందని, కానీ తాము ఒక్కో షేర్‌కు రూ.180 ఆఫర్‌ చేస్తున్నామని, ఈ ధర ప్రకారం ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ విలువ రూ.9,403 కోట్లవుతుందని మణిపాల్‌–టీపీజీ కన్సార్షియమ్‌ ఫోర్టిస్‌ డైరెక్టర్ల బోర్డ్‌కు రాసిన ఒక లేఖలో పేర్కొంది. ఈ నేపథ్యంలో బీఎస్‌ఈలో ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ షేర్‌ 0.2 శాతం లాభంతో రూ. 149 వద్ద ముగిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement