ప్రముఖ ఎయిర్‌లైన్ సంస్థ ఆకాసా ఎయిర్‌లో ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, క్లేపాండ్ క్యాపిటల్ వాటాను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు కథనాలు వెలువడ్డాయి. రెండు సంస్థలు కలిపి రూ.1,049 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.
భారత్‌లో విమానయాన ప్రయాణికులు పెరుగుతున్నారు. దాంతో చాలా కంపెనీలు దేశీయ రూట్లలో విమానాల సంఖ్యను పెంచుతున్నాయి. రానున్న రోజుల్లో టైర్1, 2, 3 సిటీల్లోని ప్రజలు విమానాల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతారని అంచనా వేస్తున్నాయి. దాంతో ఆయా ప్రాంతాల్లో ప్రయాణాలకు అనువైన మౌలికవసతులను అభివృద్ధి చేస్తున్నాయి. దీన్ని గమనించిన కొన్ని సంస్థలు విమానయాన కంపెనీల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో భాగంగానే రూ.2,938 కోట్లు విలువైన ఆకాసా ఎయిర్‌లో తాజాగా అజీమ్ ప్రేమ్‌జీ కుటుంబం కన్సార్టియంగా ఉన్న ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, మణిపాల్ గ్రూప్‌కు చెందిన రంజన్‌పాయ్ ఆధ్వర్యంలోని క్లేపాండ్ క్యాపిటల్ పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నాయి. ఫలితంగా ఆకాసా ఎయిర్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.
ఇదీ చదవండి: ప్రైవేట్ బ్యాంకుల్లో తగ్గుతున్న ‘అట్రిషన్’
ఇదిలాఉండగా, ఇప్పటికే ఆ కంపెనీలో రాకేష్‌జున్‌జున్‌వాలా కుటుంబానికి గరిష్ఠంగా రూ.293 కోట్ల వాటా ఉంది. ఇప్పుడు ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, క్లేపాండ్ క్యాపిటల్ కలిపి దాదాపు రూ.1,049 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు చర్చలు జరుపుతున్నారు. ఇదే జరిగితే ఆకాసాలో మేజర్ వాటాదారులుగా ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, క్లేపాండ్ క్యాపిటల్ వ్యవహరిస్తాయి. ఆకాసాలో ప్రస్తుతం 24 ఎయిర్‌క్రాఫ్ట్‌లున్నాయి. 202 విమానాలను ఆర్డర్ చేశారు. 27 నగరాలకు ప్రయాణికులను చేరవేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment