మణిపాల్‌ చేతికి ‘ఫోర్టిస్‌’ హాస్పిటల్‌ వ్యాపారం | Fortis board clears sale of hospital business to Manipal | Sakshi
Sakshi News home page

మణిపాల్‌ చేతికి ‘ఫోర్టిస్‌’ హాస్పిటల్‌ వ్యాపారం

Published Thu, Mar 29 2018 1:50 AM | Last Updated on Thu, Mar 29 2018 1:50 AM

Fortis board clears sale of hospital business to Manipal - Sakshi

న్యూఢిల్లీ: ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ కంపెనీ హాస్పిటల్‌ వ్యాపారాన్ని మణిపాల్‌ హాస్పిటల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కొనుగోలు చేయనుంది. ఫలితంగా ఏర్పడే సంస్థ విలువ రూ.15,000 కోట్లుగా ఉంటుందని ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ సీఈఓ భవదీప్‌ సింగ్‌ తెలిపారు. ఈ విలీన ప్రక్రియ 10–12 నెలల్లో పూర్తవుతుందని పేర్కొన్నారు.కంపెనీ ప్రమోటర్లు సింగ్‌ సోదరుల ద్వయం నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అంశంపై సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌(ఎస్‌ఎఫ్‌ఐఓ) దర్యాప్తునకు సహకరిస్తున్నామని తెలిపారు. ఈ దర్యాప్తునకు, ఈ డీల్‌కు ఎలాంటి సంబంధం లేదని వివరించారు.

ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ కంపెనీకి చెందిన హాస్పిటల్‌ వ్యాపారాన్ని డీమెర్జ్‌ చేయడానికి ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ హాస్పిటల్‌ వ్యాపారంతో పాటు డయాగ్నస్టిక్స్‌ చెయిన్‌ ఎస్‌ఆర్‌ఎల్‌లో 20 శాతం వాటాను కూడా మణిపాల్‌ హాస్పిటల్స్, టీపీజీ క్యాపిటల్‌లు కొనుగోలు చేస్తాయి. ఈ విక్రయ వార్తలతో ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ షేర్‌ భారీగా నష్టపోయింది. ఇంట్రాడేలో 15 శాతం పతనమైన ఈ షేర్‌ చివరకు 13 శాతం నష్టంతో రూ.123 వద్ద ముగిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement