సాక్షి, న్యూఢిల్లీ: రెలిగేర్ మాజీ ప్రమోటర్, ర్యాన్‌బాక్సీ మాజీ ఛైర్మన్, సింగ్ సోదరుల్లో ఒకరైన్ మల్విందర్ మోహన్ సింగ్ కూడా అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే లుక్ అవుట్ నోటీస్ జారీ చేయగా, ఢిల్లీకి చెందిన ఆర్థిక నేరాల విభాగం అధికారులు లుధియానాలో గురువారం రాత్రి ఆయనను అరెస్ట్ చేశారు. ట్రాన్సిట్ రిమాండ్‌పై మల్విందర్‌ను ఢిల్లీకి తరలించనున్నారు.
రెలిగేర్ ఫిన్‌వెస్ట్ (ఆర్‌ఎఫ్‌ఎల్)కి చెందిన రూ. 2,397 కోట్ల మేర నిధులను దుర్వినియోగం చేసిన ఆరోపణలపై ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్, మల్విందర్ తమ్ముడు, శివీందర్ సింగ్‌తో పాటు మరో ముగ్గురిని ఢిల్లీ పోలీసులు గురువారం సాయంత్రం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రెలిగేర్ ఫిన్‌వెస్ట్‌కు చెందిన మన్‌ప్రీత్ సింగ్ సూరి దాఖలు చేసిన ఫండ్ డైవర్షన్ ఫిర్యాదు నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అరెస్టయిన వారిలో రెలిగేర్(ఆర్‌ఈఎల్) మాజీ చైర్మన్ సునీల్ గోధ్వానీ (58), ఆర్‌ఈఎల్, ఆర్‌ఎఫ్‌ఎల్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన కవి అరోరా, అనిల్ సక్సేనా ఉన్నారు. నిధులను మళ్లించి ఇతర సంస్థల్లో ఇన్వెస్ట్ చేశారన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీస్ ఆర్థిక నేరాల విభాగం వీరిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు నిందితులందరినీ ఈ సాయంత్రం ఢిల్లీలోని సాకేత్ కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత వారిని ప్రశ్నించడం కోసం అదుపులోకి తీసుకుంటారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ విషయంలో కేసు నమోదు చేసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment