న్యూఢిల్లీ: రెలిగేర్ ఫిన్‌వెస్ట్ (ఆర్‌ఎఫ్‌ఎల్)ను రూ. 2,397 కోట్ల మేర మోసం చేసిన కేసులో ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్లయిన మల్వీందర్ సింగ్, ఆయన సోదరుడు శివీందర్ సింగ్‌తో పాటు మరో ముగ్గురిని నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీకి పంపిస్తూ ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు శుక్రవారం ఆదేశాలిచ్చింది. ‘ఈ కేసులో పెద్ద ఎత్తున నగదును పక్కదోవ పట్టింది. స్వభావరీత్యా ఈ నేరం చాలా తీవ్రమైనది’ అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పక్కదోవ పట్టిన నిధుల ఆచూకీ తెలుసుకోవడానికి, ఈ కుట్రలో కీలక పాత్ర పోషించిన వారిని పట్టుకోవడానికి నిందితుల పోలీసు కస్టడీ అవసరమని చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దీపక్ షెరావత్ పేర్కొన్నారు. మరోవైపు, తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ శివీందర్ సింగ్ ఢిల్లీ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే దీనిపై పోలీసులు, కేంద్రానికి నోటీసులు ఇచ్చే విషయంపై ఉత్తర్వులను కోర్టు రిజర్వ్‌లో ఉంచింది.
Comments
Please login to add a commentAdd a comment