Singh brothers
-
కుప్పకూలిన ఫోర్టిస్ హెల్త్ కేర్ షేర్లు
సాక్షి, ముంబై: సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఫోర్టిస్ హెల్త్‌కేర్ షేర్లు భారీగా కుప్పకూలాయి. జపాన్‌కు చెందిన ఔషధ తయారీ సంస్థ దైచీ శాంకో దాఖలు చేసిన కేసులొ రాన్‌బ్యాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్, శివిందర్ సింగ్‌లు తమ ఆదేశాన్ని ఉల్లంఘించి కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు సుప్రీం స్పష్టం చేసింది. ఇందుకు సోదరులిద్దరూ తలా 1,175 కోట్ల రూపాయలు జమ చేయాలని కోర్టు తెలిపింది. అలాగే ఫోర్టిస్ ఐహెచ్‌హెచ్ ఓపెన్ ఆఫర్‌పై స్టే ఎత్తివేయడానికి నిరాకరించింది. దీంతోపాటు ఫోర్టిస్‌కు వ్యతిరేకంగా సుమో మోటో ధిక్కార చర్యల్ని ప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది. తదుపరి విచారణలో ఓపెన్ ఆఫర్‌పై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. దీంతో శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ఫోర్టిస్ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయి 161 రూపాయలను తాకిన తరువాత 17 శాతం పతనమయ్యాయి. అయితే ఫోర్టిస్ అనుబంధ సంస్థ ఎస్కార్ట్ హార్ట్ ఇన్సిస్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్ లిమిటెడ్ (ఇహెచ్ఆర్సిఎల్)కు అనుకూలంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చి స్వల్ప ఊరటనిచ్చింది. ఢిల్లీలోని ఓఖ్లాలోనుంచి సంస్థను తొలగించే చర్యలను కోర్టు రద్దు చేసిందని కంపెనీ ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో తెలిపింది. కాగా 2005లో ఇహెచ్ఆర్సిఎల్ ఆసుపత్రి లీజును ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డిడిఎ) రద్దు చేయడంతో సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ రిట్ పిటిషన్‌ను 2006లో సింగిల్ జడ్జి బెంచ్ కొట్టివేసింది. ఆ తరువాత మరోసారి సంస్థ దాఖలు చేసుకున్నస్పెషల్ లీవ్ పిటీషన్‌ను కూడా ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం తిరస్కరించింది. -
సింగ్ బ్రదర్స్‌కు సుప్రీంకోర్టు మరో షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఔషధ తయారీ సంస్థ రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ మోహన్ సింగ్, శివీందర్ సింగ్‌లకు సుప్రీంకోర్టు మరోసారి భారీ షాక్ ఇచ్చింది. జపాన్ ఫార్మా దిగ్గజం దైచీ శాంకో దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటీషన్‌ను సమర్ధించింది. ఈ విషయంలో ఇప్పటికే సోదరులిద్దరికీ చివాట్లు పెట్టిన అత్యున్నత ధర్మాసనం తాజాగా సీరియస్‌గా స్పందించింది. సింగ్ సోదరులు తమ ఆదేశాన్ని ఉల్లంఘించి కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు సుప్రీం స్పష్టం చేసింది. ఇందుకు సోదరులిద్దరూ ఒక్కొక్కరూ రూ. 1175 కోట్ల రూపాయలు జమ చేయాలని ఆదేశించింది. అలాగే ఫోర్టిస్ ఐహెచ్‌హెచ్ ఓపెన్ ఆఫర్‌పై స్టే ఎత్తివేయడానికి నిరాకరించింది. ఫోర్టిస్‌కు వ్యతిరేకంగా సుమోటో ధిక్కారాన్ని ప్రారంభించింది. తదుపరి విచారణలో ఓపెన్ ఆఫర్‌పై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. కాగా 2008లో రాన్‌బాక్సీని దైచీ కొనుగోలు చేసింది. అయితే కంపెనీపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు చేపడుతోందన్న నిజాన్ని దాచిపెట్టి రాన్‌బాక్సీ షేర్లను సింగ్ సోదరులు విక్రయించారంటూ దైచీ సంస్థ సింగపూర్ ఆర్బిట్రేషన్ ట్రైబ్యూనల్‌ను ఆశ్రయించింది. దీనిపై విచారణ అనంతరం సింగ్ సోదరులు దైచీ సంస్థకు రూ .3500 కోట్ల చెల్లించాలని 2016లో ఆదేశించింది. అయితే ఆమొత్తాన్ని చెల్లించక పోవడంతో దైచీ భారత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన సుప్రీం సింగ్ సోదరులు దైచీకి డబ్బులు చెల్లించాల్సిందేనని 2019 మార్చి 14న స్పష్టం చేసింది. అనంతరం సింగ్ బ్రదర్స్ సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీం..కోర్టు దిక్కరణకు పాల్పడినట్లయితే జైలుకు పంపిస్తామని హెచ్చరిస్తూ, 2019, ఏప్రిల్‌లో తీర్పును రిజర్వులో ఉంచింది. ఇది ఇలా వుంటే వేలకోట్ల నిధుల మళ్లింపు ఆరోపణలతో గత నెలలో సింగ్ బ్రదర్స్‌ను ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. -
సింగ్ బ్రదర్స్ వివాదం న్యూ ట్విస్ట్
సాక్షి, ముంబై: వ్యాపారాన్ని భారీ నష్టాన్ని కలిగిస్తున్నారంటూ సోదరుడిపై ఎన్సీఎల్టీకి ఫిర్యాదు చేసిన శివిందర్ సింగ్ యూ టర్న్ తీసుకున్నారు. సోదరుడు మల్వీందర్ సింగ్‌పై తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు. కుటుంబ పెద్దలు, ఇతర సభ్యుల జోక్యంతో తన సోదరుడు మల్వీందర్‌పై దాఖలు చేసిన కేసుని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు గురువారం కోర్టును ఆశ్రయించారు. శుక్రవారం నాడు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) న్యూఢిల్లీ బెంచ్ ముందుకు ఈ కేసు శుక్రవారం విచారణకు రానున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. అన్నపై కేసును వెనక్కి తీసుకుంటున్నట్టు శివిందర్ ప్రకటించారు. అంతేకాదు ఒకవేళ కుటుంబ సభ్యుల మధ్యవర్తిత్వం విఫలమైతే తిరిగి కోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కల్పించాల్సిందిగా శివిందర్, అతని భార్య అదితి ఎస్.సింగ్ న్యాయస్థానాన్ని కోరారు. ముఖ్యంగా సింగ్ బ్రదర్స్ తల్లి నిమ్మీ సింగ్ గత కొన్ని రోజులుగా నిద్రాహారాలు మాని, కొడుకులిద్దరితోనూ, వరుసగా సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. కాగా ఔషధసంస్థ ర్యాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లయిన సింగ్ సోదరుల మధ్య విభేదాలు ఇటీవల భగ్గుమన్నాయి. కుటుంబ వ్యాపారాల్లో అవకతవకలకు పాల్పడు తున్నారంటూ అన్న మల్వీందర్ సింగ్‌పై సోదరుడు శివీందర్ సింగ్ కోర్టుకెళ్లారు. ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్, రెలిగేర్, ఫోర్టిస్ సంస్థల నిర్వహణలో అవకతవకలు, అణిచివేత ధోరణులపై మల్వీందర్‌తో పాటు రెలిగేర్ మాజీ చీఫ్ సునీల్ గోద్వానీలపై శివీందర్ సెప్టెంబర్ 4న ఎన్సీఎల్టీలో కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
విదేశాలకు పారిపోం: సింగ్ సోదరులు
న్యూఢిల్లీ: బిలియనీర్ సింగ్ సోదరులు– మల్వీందర్ సింగ్, శివిందర్ సింగ్‌లు విదేశాలకు పారిపోబోమని ఉద్ఘాటించారు. ఈ సింగ్ సోదరులిరువురు ఇటీవలనే ఫోర్టిస్, రెలిగేర్ కంపెనీల బోర్డుల నుంచి వైదొలిగారు. ఫోర్టిస్ హెల్త్‌కేర్, రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్‌ల్లో ఆర్థిక పరమైన అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు, దైచీ శాంక్యో కంపెనీకి రూ.3,500 కోట్ల మేర ఆర్బిట్రేషన్ చెల్లింపుల వివాదం తదితర సమస్యలను వీరు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల నుంచి గట్టెక్కడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నామని, తమ బాధ్యతలను విస్మరించబోమని పేర్కొన్నారు. నిజాయితీగా ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని, ఎక్కడకీ పారిపోబోమని భరోసానిచ్చారు. సత్యం వెలుగులోకి వచ్చేదాకా సహకరిస్తామని పేర్కొన్నారు. రూ.11,400 కోట్ల పీఎన్బీ కుంభకోణంలో కీలకమైన నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు దేశం విడిచి పారిపోయిన నేపథ్యంలో సింగ్ సోదరులు సంయుక్తంగా ఈ ప్రకటన విడుదల చేశారు. -
సింగ్ బ్రదర్స్ రూ.500 కోట్లు కాజేశారా?
సాక్షి, న్యూఢిల్లీ: దైచీ శాంక్యో పీటిషన్‌పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ర్యాన్‌బ్యాక్సీ మాజీ ప్రమోటర్లు సింగ్ బ్రదర్స్ ఫోర్టిస్ హెల్త్‌కేర్ బోర్డ్‌కు రాజీనామా చేశారు. ఇటీవల ఢిల్లీ హైకోర్టు నేపథ్యంలో తమ ప్రమోటర్లు మల్వీందర్ సింగ్, శివేందర్ సింగ్ డైరెక్టర్ల బోర్డును వీడారని ఫోర్టిస్ హెల్త్‌కేర్ తాజాగా వెల్లడించింది. ఈ అంశంపై చర్చించేందుకు ఈ నెల 13న బోర్డు సమావేశంకానున్నట్లు ఫోర్టిస్ పేర్కొంది. మల్వీందర్ సింగ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవికి, శివేందర్ సింగ్ వైస్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారని తెలిపింది. అయితే తాజా పరిణామాలపై మార్కెట్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫోర్టిస్ సంస్థనుంచి భారీ ఎత్తున నిధుల చెల్లింపు జరిగిందనే అంచనాలు నెలకొన్నాయి. ఒక సంవత్సరం క్రితం బోర్డు ఆమోదం లేకుండా కనీసం రూ .500 కోట్లు (78 మిలియన్ డాలర్లు) సింగ్ బ్రదర్స్ తీసుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫోర్టిస్ హెల్త్‌కేర్ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్లో ఈ ఈ ఫండ్స్ తరలింపును నివేదించారనీ, కాని ఆ డబ్బు ఆ సమయంలో సింగ్ బ్రదర్స్ నియంత్రణలో ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఆ నిధులను తిరిగి సంస్థకు చేరేదాకా, లెక్క తేలేదాకా సంస్థ రెండవ-త్రైమాసిక ఫలితాలపై సంతకం చేయడానికి ఫోర్టిస్ ఆడిటర్, డెలాయిట్ హస్కిన్స్ & సెల్స్ నిరాకరించారట. ఈ అంచనాలపై ఇరువర్గాలు ఇంకా స్పందించాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే.. సింగ్ బ్రదర్స్ రాజీనామా అనంతరం ఫోర్టిస్ హెల్త్‌కేర్ కౌంటర్‌కు ఉన్నట్టుండి భారీ డిమాండ్ ఏర్పడింది. దాదాపు 18 శాతం దూసుకెళ్లింది. ఒక దశలో రూ. 157వరకూ జంప్చేసియడం గమనార్హం. మరోవైపు హైకోర్టుతీర్పుపై సింగ్ బ్రదర్స్‌ను సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా జపనీస్ దిగ్జం దైచీ శాంక్యో సింగ్బ్రదర్స్పై దాఖలు చేసిన 3500 కోట్ల రూపాయల దావాను గెలిచింది. సింగపూర్ ఆర్బిట్రేషన్ తీర్పును సమర్ధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. -
సింగ్ బ్రదర్స్‌కు షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ఔషధ సంస్థ దైచీ శాంక్యో , సింగ్ బ్రదర్స్ వివాదంలో సింగ్ బ్రదర్స్‌కు భారీ షాక్ తగిలింది. ఈ కేసులో 3500 కోట్ల రూపాయల దావాను దైచీ శాంక్యో గెలిచింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు సింగపూర్ ఆర్బిట్రేషన్ తీర్పును సమర్ధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. జపనీస్ దిగ్గజం దైచీ శాంక్యో దాఖలు చేసిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కేసులో రాన్‌బాక్సీ మాజీ అధిపతులు సింగ్ బ్రదర్స్‌నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేసుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ తీర్పును అమలు చేయాలంటూ మే, 2016 లో ఢిల్లీ హైకోర్టును దైచీ ఆశ్రయించింది. అయితే, ఈ అవార్డును అమలు చేయడానికి భారత మధ్యవర్తిత్వ చట్టం ప్రకారం సబ్‌స్టాంటివ్ అభ్యంతరాలున్నాయంటూ సింగ్ బ్రదర్స్ దీన్ని సవాల్ చేశారు. దీనిపై కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. కాగా ఔషధ సంస్థ దైచీ శాంక్యో నుంచి వాస్తవాలు దాచి, తప్పుడు నివేదికలు అందించిన కేసులో అప్పటి ర్యాన్‌బ్యాక్సీ ప్రమోటర్లు మల్వీందర్ సింగ్, శివీందర్ సింగ్ భారీ నష్టపరిహార కేసును ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంలో దైచీ శాంక్యో 2013లో సింగపూర్ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించగా రూ .2,562 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని 2016లో కోర్టు ఆదేశించింది. వడ్డీతో సహా మొత్తం ఇది రూ .3,500 కోట్లకు చేరిన సంగతి తెలిసిందే. -
సింగ్ బ్రదర్స్‌కు సుప్రీం మరో షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ఫోర్టిస్ ఆస్తులను విక్రయించే విషయంలో సింగ్ బ్రదర్స్‌కు సుప్రీంకోర్టు మరోసారి షాకిచ్చింది. ఈ విషయంలో స్టేటస్ కో స్థితిని కొనసాగించాలని గురువారం సుప్రీం పునరుద్ఘాటించింది. ప్రమోటర్లు మల్వీందర్ సింగ్, శివీందర్ సింగ్.. బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల వద్ద తనఖాకు ఉంచిన షేర్లను విక్రయించేందుకు జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం అనుమతి నిరాకరించింది. అంతేకాకుండా తనఖాలో ఉన్న షేర్లను అమ్మివేసేందుకు బ్యాంకులకు (ఎస్ బ్యాంకు, యాక్సిస్బ్యాంకు) సైతం కోర్టు అనుమతి నిరాకరించింది. వీటితోపాటు నాన్ఎన్కంబర్డ్ షేర్ల విక్రయంపైనా కోర్టు నిషేధాజ్ఞలను కొనసాగాతాయని స్పష్టం చేసింది. అక్టోబర్ 31 న కేసు తుది విచారణ వరకు వారి ఆస్తులను ఏమాత్రం తొలగించకుండా ఉండాలని సుప్రీం ఆదేశించింది. ఆస్తుల విక్రయానికి సంబంధించి సుప్రీం కోర్టులో ప్రమోటర్లు సింగ్ బ్రదర్స్‌కు చుక్కెదురు కావడంతో ఫోర్టిస్ హెల్త్‌కేర్ కౌంటర్లో అమ్మకాలకు తెరలేచింది. ఈ షేరు దాదాపు6.6 శాతం పతనాన్ని నమోదు చేసింది. కాగా ఔషధ సంస్థ డైచీ శాంక్యో నుంచి వాస్తవాలు దాచి, తప్పడు నివేదికలు అందించిన కేసులో ర్యాన్‌బ్యాక్సీ ప్రమోటర్లు భారీ నష్టపరిహారాన్ని ఎదుర్కొంటున్నారు. రూ .2,562 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని 2016లో సింగపూర్ ఆర్బిట్రేషన్ కోర్టు ఆదేశించింది. వడ్డీతో సహా మొత్తం ఇది రూ .3,500 కోట్లకు చేరింది. అలాగే డైచీ శాంక్యో పిటీషన్ మేరకు ఆగస్టు 11 ఫోర్టిస్ ఆస్తులను, షేర్లను అమ్మడానికి వీల్లేదని సుప్రీం ఆదేశించింది. ఫోర్టిస్‌లో వాటాలను విక్రయించడానికి అనుమతి కోసం ఆగస్టు 23న సింగ్ సోదరులు సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.