న్యూఢిల్లీ: బిలియనీర్ సింగ్ సోదరులు– మల్వీందర్ సింగ్, శివిందర్ సింగ్‌లు విదేశాలకు పారిపోబోమని ఉద్ఘాటించారు. ఈ సింగ్ సోదరులిరువురు ఇటీవలనే ఫోర్టిస్, రెలిగేర్ కంపెనీల బోర్డుల నుంచి వైదొలిగారు. ఫోర్టిస్ హెల్త్‌కేర్, రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్‌ల్లో ఆర్థిక పరమైన అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు, దైచీ శాంక్యో కంపెనీకి రూ.3,500 కోట్ల మేర ఆర్బిట్రేషన్ చెల్లింపుల వివాదం తదితర సమస్యలను వీరు ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యల నుంచి గట్టెక్కడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నామని, తమ బాధ్యతలను విస్మరించబోమని పేర్కొన్నారు. నిజాయితీగా ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని, ఎక్కడకీ పారిపోబోమని భరోసానిచ్చారు. సత్యం వెలుగులోకి వచ్చేదాకా సహకరిస్తామని పేర్కొన్నారు. రూ.11,400 కోట్ల పీఎన్‌బీ కుంభకోణంలో కీలకమైన నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు దేశం విడిచి పారిపోయిన నేపథ్యంలో సింగ్ సోదరులు సంయుక్తంగా ఈ ప్రకటన విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment