విమానం టిక్కెట్టు.. కిలోమీటరుకు రూపాయే! | air asia introduces rs 1 a kilometer offer in certain routes | Sakshi
Sakshi News home page

విమానం టిక్కెట్టు.. కిలోమీటరుకు రూపాయే!

Published Thu, Jun 4 2015 6:54 PM | Last Updated on Sun, Sep 3 2017 3:13 AM

విమానం టిక్కెట్టు.. కిలోమీటరుకు రూపాయే!

విమానం టిక్కెట్టు.. కిలోమీటరుకు రూపాయే!

క్యాబ్లో వెళ్లాలన్నా అత్యంత చవగ్గా అంటే కిలోమీటరుకు రూ. 7 నుంచి రూ. 15 వరకు పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో.. విమానం టికెట్లను మాత్రం కిలోమీటరుకు రూపాయికే ఇస్తామని చవక విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ఇండియా ప్రకటించింది. కొన్ని మార్గాలను కొత్తగా ప్రవేశపెట్టిన ఎయిర్ ఏషియా.. అక్కడే ఈ ఆఫర్ ఉంటుందని చెబుతోంది. గువాహటి నుంచి ఇంఫాల్కు ఈ సంస్థ కొత్త విమానాలు ఎగురుతాయి. ఈనెల 7వ తేదీలోగా టికెట్లు బుక్ చేసుకోవాలి.

ఈ కొత్త మార్గంలో అన్ని పన్నులూ కలుపుకొని రూ. 900కే టికెట్లు ఇవ్వనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ ఆఫర్లో జూన్ 25 నుంచి మే 31లోగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. గత నెలలో బెంగళూరు - విశాఖ మార్గంలో ఓ విమానాన్ని ప్రవేశపెట్టారు. ఢిల్లీ నుంచి కూడా కొత్తగా విమానాలను నడుపుతున్న ఎయిర్ ఏషియా.. అక్కడే కిలోమీటరుకు రూపాయి ఆఫర్ పెట్టింది. బెంగళూరు- విశాఖ మార్గానికీ ఈ ఆఫర్ ఉంది. న్యూఢిల్లీ-గువాహటి మార్గంలో పన్నులన్నీ కలిపి రూ. 1500, న్యూఢిల్లీ- గోవా, న్యూఢిల్లీ - బెంగళూరు మార్గాల్లో పన్నులతో కలిపి రూ. 1700 టికెట్లు పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement