సాక్షి, ముంబై : ఎయిర్ ఏసియా ఇండియా కీలక ఎగ్జిక్యూటివ్ నియామకాన్ని చేపట్టింది. ఇండిగో మాజీ ఎగ్జిక్యూటివ్ సంజయ్ కుమార్‌ను తన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)గా నియమించింది. డిసెంబర్ 3 నుంచి సంజయ్ కుమార్ బాధ్యతలను స్వీకరించనున్నారని ఎయిర్ ఏసియా ఒక ప్రకటనలో తెలిపింది.
తమ టీంలో సంజయ్‌కుమార్ చేరడం చాలా సంతోషంగా ఉందంటూ ఎయిర్ ఏసియా ఇండియా ఛైర్మన్ రామదొరై ఆయనకు స్వాగతం పలికారు. సంస్థ వృద్ధి పుంజుకుంటున్న, అంతర్జాతీయ కార్యకలాపాలకు విస్తరించాలన్న ఉద్దేశ్యంలో సమయంలో ఆయన తమతో జత కలిసారని తన ప్రకటనలో పేర్కొన్నారు.
టాటా సన్స్ లిమిటెడ్ (49 శాతం), ఎయిర్ ఏసియా ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్ (49 శాతం), ఎయిర్ ఏసియా డైరెక్టర్ ఆర్ వెంకట్రామన్‌కు 1.5శాతం, రామదొరైకి 0.5శాతం వాటాతో జాయింట్ వెంచర్‌గా ఏర్పడిన విమానయాన సంస్థ ఎయిర్ ఏసియా ఇండియా. సెప్టెంబర్ నాటికి దేశీయంగా 4.4 శాతం మార్కెట్ వాటా ఉన్న ఎయిర్ ఏసియా ఆర్థిక అక్రమ ఆరోపణలు, చట్టవిరుద్ధ లాబీయింగ్ ఆరోపణలపై సీబీఐ కేసులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా అంతర్జాతీయ విమానయాన సేవలకు సంబంధించిన లైసెన్సులు పొందేందుకు అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ.
కాగా ఇండిగోలో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా పనిచేసిన సంజయ్ కుమార్‌కు వైమానిక పరిశ్రమలో 25 సంవత్సరాల అనుభవం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment