coo
-
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సీవోవోగా సాయిరామ్ కృష్ణమూర్తి
క్విక్ కామర్స్ సంస్థ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు కొత్త చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నియమితులయ్యారు. తమసీనియర్ వైస్ ప్రెసిడెంట్, అలాగే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా సాయిరామ్ కృష్ణమూర్తిని నియమించినట్లు కంపెనీ తెలిపింది.కృష్ణమూర్తి స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఆపరేటింగ్ యూనిట్లను పర్యవేక్షిస్తారని, ఇందులో డార్క్ స్టోర్ కార్యకలాపాలు, మౌలిక సదుపాయాల కార్యకలాపాలు, నగర వృద్ధి, విస్తరణ వంటివి ఉన్నాయని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎఫ్ఎంసీజీ, కన్స్యూమర్ టెక్, రిటైల్‌లో సాయిరామ్ కృష్ణమూర్తికి 18 సంవత్సరాల నాయకత్వ అనుభవం ఉంది.సాయిరామ్ కృష్ణమూర్తి గతంలో మోర్ రిటైల్‌లో సూపర్ మార్కెట్ బిజినెస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేశారు. అక్కడే చీఫ్ మర్చండైజింగ్ ఆఫీసర్‌గానూ వ్యవహరించారు. ఓలా మొబిలిటీలో ఇండియా సప్లై హెడ్‌గా, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్‌లో 14 ఏళ్లు సేల్స్, మార్కెటింగ్, ఇన్నోవేషన్లలో పనిచేశారు. -
గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్: టెకీలకు భారీ ఊరట
TCS will hire 40,000 freshers ఐటీ దిగ్గజ సంస్థలు క్యాంపస్రిక్రూమెంట్లు దాదాపు లేనట్టే నని తేల్చి చెప్పిన నేపథ్యంలో దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ మాత్రం శుభవార్త అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీగా క్యాంపస్ రిక్రూట్మెంట్లను చేపట్టనుంది. దాదాపు 40 వేల మంది ఫ్రెషర్ల నియామకాలకు సిద్దమవుతున్నట్టు ప్రకటించింది. తద్వారా ఫ్రెషర్ల నియామకాల్లో మరో ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ సరసన టీసీఎస్ కూడా నిలిచింది. సాధారణంగా ప్రతీ ఏఏటా 35 నుంచి 40వేల మంది దాకా కొత్తవారిని తీసుకుంటుందనీ ఈ క్రమంలోనే 2024 ఆర్థిక సంవత్సరంలో కూడా 40 వేల ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తున్నట్టు టీసీఎస్ సీవోవో గణపతి సుబ్రమణియన్ తెలిపారు. అంతేకాదు ఇకపై ఎలాంటి కోతలు ఉండవని కూడా స్పష్టం చేశారు. డిమాండ్‌లో ఎలాంటి హెచ్చుతగ్గులనైనా ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధంగా ఉందన్నారు. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను ఇటీవల ప్రకటించి టీసీఎస్ తాజాగా టెకీలకు ఈ తీపి కబురు చెప్పడం విశేషం. అక్టోబర్ 11న కంపెనీ ప్రకటించిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభం దాదాపు 9శాతం పెరిగి రూ.11,342 కోట్లకు చేరుకుంది. ఏకీకృత ఆదాయం రూ.59,692 కోట్లుగా ఉందని సీఈవో కె కృతివాసన్ తెలిపారు. అలాగే ఒక్కో షేరుకు రూ.9 మధ్యంతర డివిడెండ్ కూడా కంపెనీ ప్రకటించింది. కాగా దేశీయ రెండో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫ్రెషర్ల నియమాకలపై చాలామందిని నిరాశపర్చిన సంగతి తెలిసిందే. -
ప్రముఖ వైన్ కంపెనీ సీవోవో రాజీనామా
ప్రముఖ ప్రీమియం వైన్ తయారీ కంపెనీ సులా వైన్యార్డ్స్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ చైతన్య రాఠీ రాజీనామా చేశారు. ఈ మేరకు కంపెనీ ప్రకటించింది. చైతన్య స్థానంలో కంపెనీ చీఫ్ వైన్ తయారీదారు కరణ్ వాసనిని నియమించనున్నారు. కరణ్ వాసని కంపెనీ నాయకత్వ బృందంలో కీలక సభ్యుడిగా ఉన్నారు. వైన్ తయారీ, వైనరీ కార్యకలాపాలు, వైటికల్చర్తో సహా కంపెనీ కీలక కార్యకలాపాలను చూస్తారు. సులాలో చేరడానికి ముందు ఆయన ఆర్థిక సేవల సంస్థ క్రిసిల్‌లో అనలిస్ట్‌గా పని చేశారు. చైతన్య రాఠి తమ నాయకత్వ బృందంలో కీలకంగా పనిచేశారని, కంపెనీ వృద్ధికి, విజయానికి కృషి చేశారని, చాలా సంవత్సరాలుగా తనతో సన్నిహితంగా పనిచేశారని సుల వైన్యార్డ్స్ రాజీవ్ సుమంత్ పేర్కొన్నారు. కాగా చైతన్య రాఠి 2023 సెప్టెంబర్ చివరి వరకు కంపెనీలో ఉంటారు. -
పోలీసుల విచారణకు రిపబ్లిక్ టీవీ సీఈఓ, సీఓఓ
ముంబై: టీఆర్పీ స్కామ్‌కు సంబంధించి ‘రిపబ్లిక్ టీవీ’ సీఈఓ వికాస్ ఖాన్‌చందానీ, సీఓఓ హర్‡్ష భండారి ఆదివారం ముంబై పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. వారిలో సీఈఓ వికాస్‌ను 9 గంటల పాటు, హర్‡్షను 5 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. పత్రికా స్వేచ్ఛను అడ్డుకునే ఏ విధమైన ఒత్తిడికైనా తలొగ్గబోమని ఈ సందర్బంగా రిపబ్లిక్ టీవీ ప్రకటించింది. ‘ఈ రోజు మా సీఈఓ, సీఓఓ, డిస్ట్రిబ్యూషన్ టీమ్ సీనియర్ సభ్యుడిని పోలీసులు సుమారు 20 గంటల పాటు ప్రశ్నించారు. ఈ స్కామ్‌కు సంబంధించి హంస ఏజెన్సీ ఇచ్చిన ఫిర్యాదు కాపీని రిపబ్లిక్ టీవీ ఎప్పుడు, ఎలా, ఎవరి నుంచి సంపాదించిందనే ప్రశ్ననే వారు అడిగారు’ అని పేర్కొంది. అది ఎడిటోరియల్ విషయమని వారికి సీఈఓ జవాబిచ్చారని తెలిపింది. ‘హంస ఏజెన్సీ ఇచ్చిన ఫిర్యాదులో తమపై ఎలాంటి ఆరోపణ లేదు. ఇండియా టుడే చానెల్ పేరునే ఆ ఫిర్యాదులో హంస ఏజెన్సీ ప్రస్తావించింది. ఫిర్యాదు కాపీ లో ఉన్న విషయాన్ని అక్టోబర్ 10 వ తేదీననే రిపబ్లిక్ టీవీ బయటపెట్టింది’ అని వివరించింది. -
ఎయిర్ ఏసియా ఇండియా సీఓఓగా ఇండిగో మాజీ
సాక్షి, ముంబై : ఎయిర్ ఏసియా ఇండియా కీలక ఎగ్జిక్యూటివ్ నియామకాన్ని చేపట్టింది. ఇండిగో మాజీ ఎగ్జిక్యూటివ్ సంజయ్ కుమార్‌ను తన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)గా నియమించింది. డిసెంబర్ 3 నుంచి సంజయ్ కుమార్ బాధ్యతలను స్వీకరించనున్నారని ఎయిర్ ఏసియా ఒక ప్రకటనలో తెలిపింది. తమ టీంలో సంజయ్‌కుమార్ చేరడం చాలా సంతోషంగా ఉందంటూ ఎయిర్ ఏసియా ఇండియా ఛైర్మన్ రామదొరై ఆయనకు స్వాగతం పలికారు. సంస్థ వృద్ధి పుంజుకుంటున్న, అంతర్జాతీయ కార్యకలాపాలకు విస్తరించాలన్న ఉద్దేశ్యంలో సమయంలో ఆయన తమతో జత కలిసారని తన ప్రకటనలో పేర్కొన్నారు. టాటా సన్స్ లిమిటెడ్ (49 శాతం), ఎయిర్ ఏసియా ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ (49 శాతం), ఎయిర్ ఏసియా డైరెక్టర్ ఆర్ వెంకట్రామన్కు 1.5శాతం, రామదొరైకి 0.5శాతం వాటాతో జాయింట్ వెంచర్‌గా ఏర్పడిన విమానయాన సంస్థ ఎయిర్ ఏసియా ఇండియా. సెప్టెంబర్ నాటికి దేశీయంగా 4.4 శాతం మార్కెట్ వాటా ఉన్న ఎయిర్ ఏసియా ఆర్థిక అక్రమ ఆరోపణలు, చట్టవిరుద్ధ లాబీయింగ్ ఆరోపణలపై సీబీఐ కేసులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా అంతర్జాతీయ విమానయాన సేవలకు సంబంధించిన లైసెన్సులు పొందేందుకు అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. కాగా ఇండిగోలో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా పనిచేసిన సంజయ్ కుమార్‌కు వైమానిక పరిశ్రమలో 25 సంవత్సరాల అనుభవం ఉంది. -
మెట్రో రైలు-ఉబెర్ ఒప్పందానికి డ్రైవర్ల సెగ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ సంస్థ ఉబర్‌తో హైదరాబాద్ మెట్రోరైలు అవగాహన ఒప్పందానికి డ్రైవర్ షాక్ తగిలింది. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఉబెర్ డ్రైవర్లు ఆందోళనకు దిగడంతో గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా తమకు జీతాలు పెంచాలంటూ డ్రైవర్లు నినదించారు. అలవెన్సులు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని విమర్శించారు. సుమారు17మంది డ్రైవర్లు డ్యూటీలో ఉండగా ప్రాణాలు కోల్పోతే ఉబెర్ యాజమాన్యం పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో పరిస్తితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో సమావేశం మధ్యలోనుంచే ఉబెర్ సీవోవో బార్నీ హర్ఫర్డ్ నిష్క్రమించారు. మెట్రోరైలు ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా లాస్ట్‌మైల్ కనెక్టివిటీలో భాగంగా ఇప్పటికే ఓలా, తదితర కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న హెచ్‌ఎమ్మార్ గురువారం ఉబెర్‌తో కూడా ఎంఓయూ కుదుర్చుకునే కార్యక్రమాన్ని తలపెట్టింది. అయితే ఉబెర్ సీవోవో మధ్యలోనే లేచి వెళ్లిపోవడంతో దీనికి బ్రేక్ పడిందా లేక ఒప్పందం జరిగిందా అనేది క్లారిటీ రాలేదు. ఈ కార్యక్రమానికి రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి సహా, ఐటీ సెక్రెటరీ జయేశ్‌రంజన్, హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఉబెర్ ఇండియా, సౌత్ ఆఫ్రికా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మధుకన్నన్, ప్రెసిడెంట్ అమిత్‌జైన్ తదితరులు హాజరైనారు. -
టెకీలకు టీసీఎస్ గుడ్‌న్యూస్
దావోస్ : ఆటోమేషన్, కృత్రిమ మేథ (ఏఐ) వల్ల ఉద్యోగాలు కోల్పోతామనడం అవాస్తవమని టీసీఎస్ ఉన్నతాధికారి పేర్కొన్నారు. వ్యాపారాలు పెరిగేందుకు ఆటోమేషన్, ఏఐ ఉపకరిస్తాయని..వీటితో ఉద్యోగాలకు ప్రమాదం ఉండబోదని టీసీఎస్ సీఓఓ ఎన్ గణపతి సుబ్రమణియన్ చెప్పారు. నూతన టెక్నాలజీలతో భారీగా ఉద్యోగాలు నష్టపోతామనే భయాందోళనలు అసమంజసమని తోసిపుచ్చారు. అయితే మారతున్న టెక్నాలజీలకు దీటుగా సిబ్బంది నైపుణ్యాలకు పదును పెట్టడం మాత్రం ఆయా సంస్థల బాధ్యతని గుర్తుచేశారు. ఐటీ పరిశ్రమ ప్రతి ఐదేళ్లకూ మార్పులకు లోనవుతుందని..అందుకు అనుగుణంగా ఉద్యోగులు పనితీరును అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. సాంకేతిక విజ్ఞానాన్ని శిక్షణ ద్వారా అందిపుచ్చుకోవాలని సూచించారు. ఐటీ పరిశ్రమలో ఆటోమేషన్, ఏఐల రాకతో ఉద్యోగాల కోత ఉండే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ పోటీకి దీటుగా ఎదిగే యువతకు ఉద్యోగాల విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. సవాళ్లకు ఎదురీదే తత్వం భారత యువతకు పుష్కలంగా ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. -
టాటా మోటార్స్‌లో కీలక పరిణామాలు
ముంబై: ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ లో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. టాటా మోటార్స్ (సీవీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీనామా చేశారు. మరొకటి కంపెనీ చేపట్టిన కీలక నియామకం. సతీస్ బోర్వాంకర్కి సీవోవోగా పదోన్నతి కల్పిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఎగ్జిక్యూటివ్ఎడిటర్గా ఉన్న సతీష్ పదవీకాలాన్ని మరో రెండేళ్లపాటు పొడిగించాలని నిర్ణయించినట్టు టాటా మోటార్స్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని మార్కెట్ ఫైలింగ్ లో పేర్కొంది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (వాణిజ్య వాహనాలు) రవీంద్ర పిషారో వ్యక్తిగత కారణాల రీత్యా కంపెనీని వీడుతున్నట్టు ప్రకటించారు. డైరెక్టర్ పదవితోపాటు, దాని సంబంధిత సంస్థల డైరెక్టర్ల పదవులకు రాజీనామా చేశారు. రవీంద్ర రాజీనామాను స్వాగతించిన టాటా మోటార్స్ తదుపరి నోటీసు వచ్చే వరకు ఆయన పదవీకాలం కొనసాగుతుందని తెలిపింది. కమర్షియల్ వాహనాల వ్యాపార వృద్ధికి ఆయన చేసిన కృషికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తన భవిష్యత్ ప్రయత్నాల న్నిటికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని చెప్పింది. వెంటనే సంబంధిత నియమకాన్ని చేపడతామని తెలిపింది. టాటా మోటర్స్ 2007 లో కమర్షియల్ వాహనాలు (సేల్స్ అండ్ మార్కెటింగ్) వైస్ ప్రెసిడెంట్ గా కంపెనీలో జాయిన్అయిన రవీంద్ర 2012 జూన్ 21 నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాధ్యతల్లో ఉన్నారు. అంతకుముందు ఆయన కాస్ట్రోల్ లిమిటెడ్, ఫిలిప్స్ ఇండియాకు పనిచేశారు. కంపెనీ కమర్షియల్ వాహనాల విక్రయాలు 2016-17లో కేవలం 0.45 శాతం పెరిగి 3,05,620 యూనిట్లకు పెరిగ్గా, ఈ ఏడాది మే నెలలో కంపెనీ మొత్తం అమ్మకాలు 13శాతం తగ్గి 23,606 యూనిట్లుగా నమోదయ్యాయి. దేశీయ మార్కెట్లో టాటా మోటార్స్ తన వాణిజ్య వాహనాల అమ్మకాలు నెమ్మదించిన సందర్భంలో ఆయన రాజీనామా చేయడం గమనార్హం. -
సరైన సమయంలో బై బ్యాక్- ఇన్ఫీ
ముంబై: షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనను పరిశీలించేందుకు తాము వ్యతిరేకం కాదని దేశీయ అతిపెద్ద ఐటీ సర్వీసుల సంస్థ ఇన్ఫోసిస్ ప్రకటించింది. దీనికి సంబంధించిన అన్ని అంశాలను పరిశీలిస్తామని ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యూబీ ప్రవీణ్ రావు తెలిపారు. షేర్ల బై బ్యాక్, కేపిటల్ అలాకేషన్, తదితర అంశాలపై బోర్డు నిర్ణయిస్తుందన్నారు. ముఖ్యంగా బై బ్యాక్ నిర్ణయం "తగిన సమయం"లో తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో 2017 ఆర్థిక సంవత్సరం 2016 కంటే మెరుగ్గా ఉంటుందని చెప్పడం కష్టమని వ్యాఖ్యానించారు. కాగా కాగ్నిజెంట్ ఇటీవల ఒక 3.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసే పథకం ప్రకటించడగా, ఈ నెల 20న జరగనున్న బోర్డ్ మీటింగ్‌లో నిర్ణయించనున్నట్టు టీసీఎస్ కూడా ప్రకటించింది. అటు ఇన్ఫోసిస్ షేర్ల బై బ్యాక్ పై సంస్థ ఇద్దరు మాజీ సీఎఫ్‌వోలు ఇటీవల బాగా వత్తిడి చేస్తున్న సంగతి తెలిసిందే. షేర్ ధరపై మేనేజ్మెంట్ నిర్ణయానికి ఫౌండర్ గ్రూప్ సుముఖంగా లేదని తెలుస్తోంది. సంస్థాగత మద్దతుపై జేపీ మోర్గాన్ సలహాలనుకూడా తీసుకోనుందని సమాచారం. -
పెప్సీ ఎగ్జిక్యూటివ్‌ను ఓలా తీసేసుకుంది!
న్యూఢిల్లీ : కూల్‌డ్రింకుల ఫేమస్ కంపెనీ పెప్సీ మాజీ ఎగ్జిక్యూటివ్‌ను ట్రాన్స్‌పోర్టేషన్ పాపులర్ యాప్ ఓలా తన కంపెనీలోకి తీసేసుకుంది. పెప్సీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన విశాల్ కౌల్‌ను తన కొత్త చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ)గా నియమించుకున్నట్టు ఓలా సోమవారం ప్రకటించింది. ఇక నుంచి సీఓఓగా ఓలా ఆపరేషన్స్‌కు కౌల్ హెడ్‌గా పనిచేయనున్నారు. దూసుకొస్తున్న ఉబర్‌కు పోటీగా, మార్కెట్ లీడర్షిప్ను మరింత బలపరచడానికి కౌల్ కృషిచేయనున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 1999లో పెప్సీ కంపెనీలో కౌల్ తన కెరీర్‌ను ప్రారంభించారు. కౌల్ ఎక్కువగా థాయ్‌లాండ్, మయన్మార్, లావోస్‌లలో పెప్సీ ఫుడ్స్‌కు జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. తమ ఆపరేషన్స్‌లో విశాల్ కౌల్ జాయిన్ అవడం తాను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానని ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈవో భవీశ్ అగర్వాల్ తెలిపారు. విశాల్ ఎంత ఉత్సాహవంతుడో మాటల్లో చెప్పలేమని, తనతో సంభాషణ జరిపిన ప్రతిసారి నిజంగా తాను చాలా సంతోషంగా భావిస్తానని అగర్వాల్ చెప్పారు. లాభాలు, వృద్ధి బాటలో వ్యాపారాలు నడిపించడంలో కౌలుకి బిజినెస్ లీడర్‌గా మంచి అనుభవం ఉన్నట్టు అగర్వాల్ తెలిపారు. -
ఇక్కడ అన్న..అక్కడ తమ్ముడు
ముంబై: టాటా మిస్త్రీ బోర్డ్ వార్ లో టాటా గ్రూప్ లో కీలక నియామకాలు గురువారం చోటు చేసుకున్నాయి. టాటాసన్స్ కొత్త ఛైర్మన్ గా టీసీఎస్ ఎండీ ఎన్ చంద్రశేఖరన్ ఎంపికయ్యారు. గురువారం నిర్వహించిన టాటా సన్స బోర్డ్ సమావేశంలొ ఈ మేరకు నిర్ణయం జరిగింది. దీంతో ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంస్థ సీఈవో గా రాజేష్ గోపీనాథన్ ను టాటా గ్రూపు నియమించింది. అలాగే ఎన్ జీ సుబ్రమణియం కొత్త సీవోవోగా ఎంపికయ్యారు. అయితే ఎన్ జీ సుబ్రమణియం చంద్రశేఖరన్ కు సోదరుడు. టీసీఎస్ విజన్ రోడ్ మ్యాప్ లో ఎలాంటి మార్పులు ఉండవని టీసీఎస్ కొత్త బాస్ గోపీనాథన్ ప్రకటించారు. తన ఎంపికపై సంతోషాన్ని ప్రకటించిన టాటా సన్స్ కొత్త ఛైర్మన్ చంద్రశేఖరన్ టీసీఎస్ కు గోపీనాథన్ ఎంపికపై హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు మంచి వ్యాపార దక్షత ఉందని కొనియాడారు. టీసీఎస్ బిజినెస్ అండ్ ఫైనాన్స్ లో అపారమైన అనుభవం ఉందన్నారు. ఆయన నేతృత్వంలో టీసీఎస్ మరింత వ్యాపారంలో్ మరింత ఎత్తుకు ఎదగగలదనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు టాటాసన్స్ కొత్త చైర్మన్ గా చంద్రశేఖరన్ ఎంపిక పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ అరుంధతి భట్టాచార్య, నీతి ఆయోగ్ ఛైర్మన్ అమితాబ్ కాంత్ తదితర ప్రముఖులు చంద్రశేఖరన్ నియామకాన్ని స్వాగతించారు. -
ట్విట్టర్‌కు ఏమైంది?
శాన్ఫ్రాన్సిస్కో: ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న సంస్థకు మరో ముఖ్యమైన అధికారి రాజీనామా చేశారు. ఈ క్వార్టర్లో నిరాశాజనక ఫలితాలు, ఉద్యోగాల్లో కోతకు తోడు ముఖ్య అధికారుల వరుస రాజీనామాలు ట్విట్టర్‌ను వెంటాడుతున్నాయి. ట్విట్టర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ) ఆడమ్ బైన్ సంస్థ నుంచి వైదొలగుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. అలాగే ఆయన స్థానంలో 2014 జూలై లో ట్విట్టర్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్ఓ) నియమితుడైన ఆంటోనీ నోటో సీఓఓ బాధ్యతలు స్వీకరించనున్నట్లు కంపెనీ తెలిపింది. సీఎఫ్ఓ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించే దాకా నోటో కొనసాగుతారని వివరించింది. కొన్ని వారాలపాటు బైన్ నోటోకు సహాయంగా ఉంటారని తెలిపింది. 2010 లో ట్విట్టర్ లో చేరిన ఆడమ్ అద్భుతమైన టీం తయారుచేశారని, అంతర్జాతీయంగా వ్యాపారాన్ని విస్తరించారని ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాక్ డోర్సే ఒక ప్రకటనలో తెలిపారు. కాగా నష్టాల కారణంగా గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 9శాతం మందిని తొలగిస్తున్నట్లు గత నెలలోనే ట్విట్టర్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 3,860 ఉన్న ఉద్యోగుల్లో 350 మందిని తొలిగిస్తున్నట్టు వెల్లడించింది. ఎపుడూ లాభాలను నమోదు చేయని ట్విట్టర్ 2017 సం.రంలో తొలిసారిగా లాభాలను నమోదు చేసే దిశగా పయనిస్తోందని గత ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా డోర్సే విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే విశ్లేషకులు మాత్రం సంస్థ సామర్థ్యంపై ఆందోళనలు వ్యక్తంచేశారు మరోవైపు వినియోగదారుల పెరుగుదల కోసం కృషి చేస్తున్న సమయంలో అడ్వర్టైజింగ్ బిజినెస్ బాగా పెంచిన ఆడమ్ ట్విట్టర్‌ను వీడడం కంపెనీకి పెద్ద షాకేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల ట్విట్టర్ ఇండియా హెడ్, మేనేజింగ్ డైరెక్టర్లు కూడా సంస్థ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. -
ఐటీసీ కొత్త సీఓఓగా సంజీవ్ పురి
న్యూఢిల్లీ: ఐటీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ)గా సంజీవ్ పురి నియమితులయ్యారు. సోమవారం జరిగిన బోర్డ్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, సీఓఓగా, పూర్తికాల డెరైక్టర్‌గా ఆయన నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని కంపెనీ తెలిపింది. సంజివ్ పురిని డెరైక్టర్(ఎఫ్ఎంసీజీ బిజినెస్)గా పి.ధోబలే స్థానంలో గత ఏడాది డిసెంబర్ 6న కంపెనీ నియమించింది. -
ఐటీసీ సీవోవో గా సంజీవ్ పూరి
ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా సంజీవ్పూరిని నియమించింది. 1986లో పూరి ఐటీసీలో చేరిన పూరి ప్యాకేజింగ్, అండ్ ప్రింటింగ్ బిజినెస్ లో ముఖ్య బాధ్యతలు నిర్వహిస్తున్న సంజీవ్ పరి పూర్తి కాలపు డైరెక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా నియమిస్తూ బోర్డ్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని బీఎస్ఈ కి సంస్థ నివేదించింది. జులై 22న నిర్వహించిన బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే ఈయన నియామకం అమల్లోకి వస్తుందని సంస్థ తెలిపింది . ఈ మేరకు సమాచారాన్ని సంస్థ బీఎస్ఈకు తెలియజేసింది. 53 సంవత్సరాల పూరికి ఎఫ్ఎంసీజీ వ్యాపారంలో మంచి అనుభవం ఉంది. ఐటీసీ సంస్థలో ఆయన చాలా వేగంగా ఎదిగారు. మరోవైపు ఇటీవల ప్రకటించిన ఫలితాలో ఐటీసీ మెరుగైన ఫలితాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
పాలసీ పత్రాలు ఈ-రిపాజిటరీలో పదిలం
మూడేళ్లకోసారి రూ.75 వేల చొప్పున 15 ఏళ్లపాటు ఆదాయమొచ్చే ఇన్సూరెన్స్ పాలసీని మూర్తి గారు తీసుకున్నారు. తొలి విడత సొమ్ము మామూలుగానే చేతికి అందింది. పాలసీకి సంబంధించిన కీలక పత్రాలను పోగొట్టుకోవడంతో రెండో విడత డబ్బు తీసుకోవడం కష్టమైంది. అతికష్టమ్మీద, ఏడాది తర్వాత ఆ డబ్బు అందింది. దానికోసం ఆయన నానా కష్టాలు పడాల్సి వచ్చింది. క్లెయిమ్‌లను పరిష్కరించుకోవాలన్నా, చెల్లింపులు తీసుకోవాలన్నా పాలసీ డాక్యుమెంట్లన్నీ భద్రంగా ఉంచడం, బీమా కంపెనీలు కోరినపుడు వాటిని సమర్పించడం అత్యవసరం. వీటిలో ఏ డాక్యుమెంటు మిస్సయినా ఆ పెట్టుబడి అంతా నిష్ఫలంగా మారే అవకాశముంది. అదృష్టవశాత్తూ, ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా ఈ-రిపాజిటరీలను బీమా రెగ్యులేటర్ ఐఆర్డీఏ గతేడాది ప్రారంభించింది. ఈ-రిపాజిటరీ ఏమిటంటే... ఖాతాదారులు తమ పాలసీ వివరాలను డిజిటల్ ఫార్మాట్లో భద్రపర్చుకునే సౌకర్యమే ఇ-రిపాజిటరీ. వివిధ బీమా కంపెనీలకు చెందిన పాలసీ డాక్యుమెంట్లను ఒకే ఈ-అకౌంట్లో దాచుకోవచ్చు. అంటే, మీకు హెల్త్ పాలసీ ఒక కంపెనీది, జీవిత బీమా మరో కంపెనీది ఉన్నా ఒకే అకౌంట్లో ఆ వివరాలు భద్రపర్చవచ్చు. క్లెయిమ్ సమయంలో పాలసీదారుడైనా, కంపెనీ అయినా ఒకే క్లిక్‌తో పాలసీ వివరాలన్నీ తెలుసుకోవచ్చు. అంటే, క్లెయిమ్ సెటిల్మెంట్ చాలా త్వరగా పూర్తవుతుందన్నమాట. ఈ-కేవైసీ ద్వారా బీమా కంపెనీల సేవలు వేగవంతం కావడంతో పాటు డాక్యుమెంట్ ఫోర్జరీలను, పాలసీదారుల గుర్తింపులో మోసాలను నివారించవచ్చు. డాక్యుమెంట్ల కోసం పాలసీదారును అడగాల్సిన అవసరం లేకుండానే బీమా కంపెనీలు కేవైసీ తనిఖీల ద్వారా తమకు అవసరమైన సమాచారాన్ని పొందగలుగుతాయి. ఈ-రిపాజిటరీల ప్రక్రియ అంతా ఎలక్ట్రానిక్ పద్ధతిలో జరుగుతుంది కాబట్టి డాక్యుమెంట్లను దాచడానికి స్టోరేజీ అవసరం ఉండదు. అంతా ఉచితమే... బీమా కస్టమర్లందరికీ ఈ-రిపాజిటరీ సేవలను ఉచితంగా అందిస్తారు. యూఐఏడీఐలో నమోదు చేసుకుని, ఆధార్ కార్డు ఉన్న వారందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. బీమా కంపెనీలకు ఈ-రిపాజిటరీ ఏజెంట్లుగా వ్యవహరించడానికి ఐదు కంపెనీలను ఐఆర్డీఏ ఎంపిక చేసింది. ఖాతాదారులు తమకు నచ్చిన కంపెనీకి తమ పాలసీల వివరాలను అందిస్తే సరిపోతుంది. తర్వాత, వాస్తవ కాలానుగుణంగా ఈ డేటాను సదరు కంపెనీ అప్డేట్ చేస్తుంటుంది. ఒక్కో ఖాతాదారునికి ఒక్కో లింక్‌ను కంపెనీ ఇస్తుంది. ఈ లింక్‌ను క్లిక్ చేస్తే చాలు, తర్వాతి ప్రీమియం చెల్లించాల్సిన తేదీ, ఫండ్ విలువ, మెచ్యూరిటీ డేట్ మొదలైన వివరాలన్నీ కళ్లెదుట సాక్షాత్కరిస్తాయి. పాలసీదారులకు ఏవైనా సందేహాలుంటే బీమా సంస్థ, ఏజెన్సీ కంపెనీ సమాధానమిస్తాయి. పాలసీల డీమెటీరియలైజేషన్ పుణ్యమా అని బీమా కంపెనీల సేవా ప్రమాణాలు మెరుగవుతాయి. నిర్దిష్ట బీమా అవసరాలు కలిగిన ఖాతాదారులను గుర్తించడం బీమా కంపెనీలకు సులభమవుతుంది. స్నేహిల్ గంభీర్ సీఓఓ, అవీవా లైఫ్ ఇన్సూరెన్స్