TCS will hire 40,000 freshers ఐటీ దిగ్గజ సంస్థలు క్యాంపస్‌రిక్రూమెంట్లు దాదాపు లేనట్టే నని తేల్చి చెప్పిన నేపథ్యంలో దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ మాత్రం శుభవార్త అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీగా క్యాంపస్ రిక్రూట్‌మెంట్లను చేపట్టనుంది. దాదాపు 40 వేల మంది ఫ్రెషర్ల నియామకాలకు సిద్దమవుతున్నట్టు ప్రకటించింది. తద్వారా ఫ్రెషర్ల నియామకాల్లో మరో ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ సరసన టీసీఎస్ కూడా నిలిచింది.
సాధారణంగా ప్రతీ ఏఏటా 35 నుంచి 40వేల మంది దాకా కొత్తవారిని తీసుకుంటుందనీ ఈ క్రమంలోనే 2024 ఆర్థిక సంవత్సరంలో కూడా 40 వేల ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తున్నట్టు టీసీఎస్ సీవోవో గణపతి సుబ్రమణియన్ తెలిపారు. అంతేకాదు ఇకపై ఎలాంటి కోతలు ఉండవని కూడా స్పష్టం చేశారు. డిమాండ్‌లో ఎలాంటి హెచ్చుతగ్గులనైనా ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధంగా ఉందన్నారు. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను ఇటీవల ప్రకటించి టీసీఎస్ తాజాగా టెకీలకు ఈ తీపి కబురు చెప్పడం విశేషం.
అక్టోబర్ 11న కంపెనీ ప్రకటించిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభం దాదాపు 9శాతం పెరిగి రూ.11,342 కోట్లకు చేరుకుంది. ఏకీకృత ఆదాయం రూ.59,692 కోట్లుగా ఉందని సీఈవో కె కృతివాసన్ తెలిపారు. అలాగే ఒక్కో షేరుకు రూ.9 మధ్యంతర డివిడెండ్ కూడా కంపెనీ ప్రకటించింది. కాగా దేశీయ రెండో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫ్రెషర్ల నియమాకలపై చాలామందిని నిరాశపర్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment