పెప్సీ ఎగ్జిక్యూటివ్ను ఓలా తీసేసుకుంది! | Ola appoints former PepsiCo exec Vishal Kaul as COO | Sakshi
Sakshi News home page

పెప్సీ ఎగ్జిక్యూటివ్ను ఓలా తీసేసుకుంది!

Published Mon, Jan 23 2017 6:52 PM | Last Updated on Tue, Sep 5 2017 1:55 AM

పెప్సీ ఎగ్జిక్యూటివ్ను ఓలా తీసేసుకుంది!

పెప్సీ ఎగ్జిక్యూటివ్ను ఓలా తీసేసుకుంది!

న్యూఢిల్లీ : కూల్డ్రింకుల ఫేమస్ కంపెనీ పెప్సీ మాజీ ఎగ్జిక్యూటివ్ను  ట్రాన్స్పోర్టేషన్ పాపులర్ యాప్ ఓలా తన కంపెనీలోకి తీసేసుకుంది. పెప్సీ ఎగ్జిక్యూటివ్గా పనిచేసిన విశాల్ కౌల్ను తన కొత్త చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ)గా నియమించుకున్నట్టు ఓలా సోమవారం ప్రకటించింది. ఇక నుంచి సీఓఓగా ఓలా ఆపరేషన్స్కు కౌల్ హెడ్గా పనిచేయనున్నారు. దూసుకొస్తున్న ఉబర్కు పోటీగా, మార్కెట్ లీడర్షిప్ను మరింత బలపరచడానికి కౌల్ కృషిచేయనున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 1999లో పెప్సీ కంపెనీలో కౌల్ తన కెరీర్ను ప్రారంభించారు. కౌల్ ఎక్కువగా థాయ్లాండ్, మయన్మార్, లావోస్లలో పెప్సీ ఫుడ్స్కు జనరల్ మేనేజర్గా బాధ్యతలు నిర్వర్తించారు.
 
తమ ఆపరేషన్స్లో విశాల్ కౌల్ జాయిన్ అవడం తాను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానని ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈవో భవీశ్ అగర్వాల్ తెలిపారు. విశాల్ ఎంత ఉత్సాహవంతుడో మాటల్లో చెప్పలేమని, తనతో సంభాషణ జరిపిన ప్రతిసారి నిజంగా తాను చాలా సంతోషంగా భావిస్తానని అగర్వాల్ చెప్పారు. లాభాలు, వృద్ధి బాటలో వ్యాపారాలు నడిపించడంలో కౌలుకి బిజినెస్ లీడర్గా మంచి అనుభవం ఉన్నట్టు అగర్వాల్ తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement