
క్విక్ కామర్స్ సంస్థ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు కొత్త చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నియమితులయ్యారు. తమసీనియర్ వైస్ ప్రెసిడెంట్, అలాగే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా సాయిరామ్ కృష్ణమూర్తిని నియమించినట్లు కంపెనీ తెలిపింది.
కృష్ణమూర్తి స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఆపరేటింగ్ యూనిట్లను పర్యవేక్షిస్తారని, ఇందులో డార్క్ స్టోర్ కార్యకలాపాలు, మౌలిక సదుపాయాల కార్యకలాపాలు, నగర వృద్ధి, విస్తరణ వంటివి ఉన్నాయని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎఫ్‌ఎంసీజీ, కన్స్యూమర్ టెక్, రిటైల్‌లో సాయిరామ్ కృష్ణమూర్తికి 18 సంవత్సరాల నాయకత్వ అనుభవం ఉంది.
సాయిరామ్ కృష్ణమూర్తి గతంలో మోర్ రిటైల్‌లో సూపర్ మార్కెట్ బిజినెస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేశారు. అక్కడే చీఫ్ మర్చండైజింగ్ ఆఫీసర్‌గానూ వ్యవహరించారు. ఓలా మొబిలిటీలో ఇండియా సప్లై హెడ్‌గా, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్‌లో 14 ఏళ్లు సేల్స్, మార్కెటింగ్, ఇన్నోవేషన్‌లలో పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment