సూ..పర్‌ సేల్‌ : రూ.500కే టికెట్‌ | AirAsia India offers tickets as low as Rs 500 from today | Sakshi
Sakshi News home page

సూ..పర్‌ సేల్‌ : రూ.500కే టికెట్‌

Published Mon, Sep 17 2018 5:51 PM | Last Updated on Tue, Sep 18 2018 1:53 AM

AirAsia India offers tickets as low as Rs 500 from today - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులకు శుభవార్త. ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ఇండియా సరికొత్త ఆఫర్  అందుబాటులో తీసుకొచ్చింది.  దేశీయ మార్గంలో రూ.500 లకే విమాన టికెట్లను ఆఫర్‌ చేస్తోంది. ఇవాల్టి(సోమవారం) నుంచి  ఈ ఆకర్షణీయమైన ఆఫర్‌ను  అమలు చేయనున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
 
దేశీయంగా 21మార్గాల్లో ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోది.  రూ.500, వెయ్యి,  పదిహేనువందల  రూపాయల మధ్య ఈ వన్‌ వే టికెట్లను డిస్కౌంట్‌ రేట్లలో అందిస్తోంది. ఈ సూపర్‌ సేల్‌ ద్వారా టికెట్లనుబుక్‌ చేసుకునే చివరి తేదీ సెప్టెంబర్ 23.  ఇలాబుక్‌ చేసుకున్న టికెట్ల ద్వారా సెప్టెంబర్ 17 - మార్చి, 31, 2019 వరకు ప్రయాణం చేసే అవకాశం ఉందని ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది.    ఎయిర్‌ ఏషియా. కాం, ఎయిర్‌ఏషియా మొబైల్‌ యాప్‌ ద్వారా మాత్రమే ఈ సూపర్‌ సేల్‌ ఆఫర్‌లో విమాన టికెట్లను బుక్‌ చేసుకునే అవకాశం.

కాగా  హైదరాబాద్, విశాఖపట్నంతోపాటు  అమృత్‌సర్‌,  బాగ్డోగ్ర, బెంగళూరు, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, ఇంఫాల్, ఇండోర్, జైపూర్, కోల్‌కతా, కొచ్చి, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పనాజీ, పూణే, రాంచీ , శ్రీనగర్, సూరత్‌ నగరాలల  సర్వీసులను అందిస్తోంది ఎయిర్‌ ఏషియా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement