ట్రంప్ నిషేధంతో లాభాలే లాభాలు
ట్రంప్ నిషేధంతో లాభాలే లాభాలు
Published Wed, Apr 5 2017 10:02 PM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM
కొన్ని గల్ఫ్ దేశాల నుంచి హ్యాండ్ లగేజిగా ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకెళ్లడంపై అమెరికా నిషేధం విధించిన విషయం తెలిసిందే. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భారత ప్రభుత్వ రంగ సంస్ధ ఎయిర్‌ఇండియాను లాభాల బాటలో నడిపిస్తోంది. అమెరికా వెళ్లే ఎయిర్‌ఇండియా టికెట్లు దాదాపు వంద శాతం అధికంగా అమ్ముడవుతున్నాయి. న్యూఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌ల నుంచి న్యూయార్క్, న్యూఆర్క్, చికాగో, శాన్‌ఫ్రాన్సిస్కోలకు నాలుగు ఎయిర్‌ఇండియా విమానాలు నడుస్తున్నాయి.
గతేడాది ఇదే సమయంలో ఒక్కో సర్వీసుకు 150 టికెట్లు అమ్ముడుపోగా.. ప్రస్తుతం 300 టికెట్లు అమ్ముడుపోతున్నట్లు ఎయిర్‌ఇండియా అధికారి ఒకరు తెలిపారు. డిమాండ్ పెరగడంతో భారత్ నుంచి అమెరికాకు వెళ్లే విమాన టికెట్ ధర రూ.10 వేలు పెరిగిందని.. అదే అమెరికా నుంచి ఇండియా వచ్చే విమాన టికెట్ ధర రూ.15 వేల వరకూ సంస్ధ పెంచిందని చెప్పారు. అయితే, అమెరికా నుంచి భారత్‌కు వచ్చే టికెట్ల అమ్మకాల్లో పెద్ద పెరుగుదల కనిపించలేదని వివరించారు.
Advertisement