incresed
-
సౌర గ్రామాలు పెరిగేనా?
దేశంలోనే తొలిసారిగా సంపూర్ణమైన సోలార్ గ్రామంగా గుజరాత్‌లోని మొడేరా గ్రామాన్ని తీర్చిదిద్దడానికి పోయిన ఏడాది కార్యాచరణ మొదలైంది. అభివృద్ధి, పరిణామాలపై సమీక్ష జరగాల్సివుంది. గత అసెంబ్లీ ఎన్నికల వేళ, సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ బృహత్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 24×7 అన్నట్లుగా అన్నివేళలా అంతటా సౌరశక్తి వెలుగాలన్నది లక్ష్యం. ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న కాలుష్యం, భయానకంగా మారుతున్న పర్యావరణం, ప్రబలుతున్న వింత వింత వ్యాధులు, అంతకంతకు పెరుగుతున్న విద్యుత్ ధరలు, తరిగిపోతున్న సహజవనరుల నడుమ సౌరశక్తిని సద్వినియోగం చేసుకొనే దిశగా వేసే ప్రతి అడుగూ ప్రశంసాపాత్రమే. దేశంలో సూర్యదేవాలయాలున్న అతి కొద్ది గ్రామాల్లో మొడేరా ఒకటి. సౌర దీప్తులు దేశంలోని ప్రతి గ్రామంలో విరగబూసినప్పుడే జాతి జ్యోతి మరింతగా వెలుగుతుంది. గుజరాత్ అభివృద్ధి నమూనాను అన్ని రాష్ట్రాలలో ప్రతిస్పందించేలా కేంద్రం కార్యాచరణ చేపట్టాలి. ప్రధాని సొంత రాష్ట్రంలోనే కాదు, అన్ని రాష్ట్రాలలోనూ సౌర గ్రామాల సంఖ్య పెరగాలి. 2014లో మోదీని దేశ ప్రజలు ప్రధానమంత్రిగా ఎన్నుకున్న కారణాలలో గుజరాత్ అభివృద్ధి కూడా ఒక ముఖ్యమైన అంశం. 2014, 2019లో వరుసగా రెండు సార్లు ప్రధానిగా ఆయనకు ప్రజలు పట్టం కట్టారంటే ఆయనపై పెట్టుకున్న విశ్వాసం మరో ముఖ్య కారణం. దానిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆయనపై నేడు మరింతగా వుంది. మరి కొన్ని నెలలోనే సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈలోపు అనుకున్న అభివృద్ధిని సాధించి, ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజల్లో భరోసా నింపడం కీలకం. ఈ తొమ్మిదేళ్లలో దేశంలోని అనేక రాష్ట్రాలు కూడా బిజెపి వశమయ్యాయి. దానికి కారణాలు అనేకం ఉండవచ్చు, తమకు గెలుపునిచ్చిన ప్రజలు కూడా జీవితంలో గెలిచేట్లు, జీవనాలు వెలిగేట్లు చూడడం ఏలికల ముఖ్య బాధ్యత. చాలా వరకూ సహజవనరులను మనిషి తన ఆర్ధిక స్వార్థంతో మట్టుపెట్టాడు. అయినా ఇంకా ఎంతో అమూల్యమైన సహజ సంపద మన చుట్టూ వుంది. ప్రణాళికా బద్ధంగా దానిని సద్వినియోగం చేస్తే జాతి ప్రగతి వేగం ఎన్నోరెట్లు ఊపందుకుంటుంది. సహజ వనరులను సద్వినియోగం చేసుకొని పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడం అత్యంత ముఖ్యం. ఇప్పటికీ విద్యుత్ సమస్యలు తీరడం లేదు. ముఖ్యంగా ఎండాకాలం వచ్చినా, వర్షాలు పెరిగినా పల్లెలు చీకట్లోనే మగ్గుతున్నాయి. విద్యుత్ సంస్కరణలు జరగాలని నిపుణులు మొరపెట్టుకుంటున్నా అది అరణ్యరోదనగానే మిగులుతోంది. ఈ క్రమంలో సౌరశక్తిని సద్వినియోగం చేసుకుంటూ సౌరవిద్యుత్ వాడకం పెరిగితే ఖర్చులు కూడా అదుపులోకి వస్తాయి. వృధా డబ్బు ఆదా అవుతుంది. సౌర శక్తి వాడకంపై ఇంకా చాలినంత అవగాహన ప్రజల్లో రాలేదు. సూర్యరశ్మి నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్‌ను సౌరవిద్యుత్ అంటారు. 1980దశకం నుంచే సౌర విద్యుత్ వినియోగంపై అడుగులు పడడం మొదలయ్యాయి. ఉత్పత్తి చేసే ప్లాంట్ల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయి.ఇందులో కర్ణాటకలోని పావగడ ప్రాంతం తలమానికంగా నిలుస్తోంది. మనిషి మొదలు అనేక జీవరాసులకు అందే శక్తిలో ఎక్కువ భాగం సూర్యుడిదే.ఈ శక్తి అపారమైంది. దీనిని ఇంకా ఎన్నో రెట్లు వాడుకోవాల్సివుంది. సౌరశక్తిని సద్వినియోగం చేసుకోవడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక ప్రయోజనాలు దక్కుతాయి. కాలుష్యం తగ్గిపోతుంది. పర్యావరణం పచ్చగా ఉంటుంది. ఈ ప్రపంచంలో మనం ఒక సంవత్సరం పాటు ఉపయోగించే శక్తి కంటే ఒక గంటలో వెలువడే సౌరశక్తి ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. సోలార్ వస్తువుల ధరలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఉత్పత్తుల వినియోగం పట్ల ఎక్కువమంది శ్రద్ధ చూపించడం లేదని పరిశీలకులు అంటున్నారు. దీనిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. సోలార్ కార్లు, బైకులు పెరగాలని నిపుణులు సూచిస్తున్నారు. సౌరశక్తిని నిల్వవుంచే వ్యవస్థలు పెరగాలి. పారిశ్రామికవేత్తలను, శాస్త్రవేత్తలను, రాష్ట్ర ప్రభుత్వాలను, ప్రజలను సౌరశక్తి వినియోగం దిశగా అనుసంధానం చేయడంలో కేంద్రం మరింతగా కదలాలి. ఉత్పాదకతకు ప్రోత్సాహకాలను పెంచాలి. గుజరాత్ లోని మొడేరా తరహా గ్రామాలను దేశంలో పెద్ద స్థాయిలో తయారు చెయ్యాలి.ముఖ్యంగా కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు మరింత ఆరోగ్యకరంగా సాగాలి. ప్రత్యక్ష నారాయణుడి ప్రభ దేశంలో ప్రకాశమాన మయ్యేలా గట్టి అడుగులు పడాలి -మా శర్మ, సీనియర్ జర్నలిస్టు -
భారీగా పెరిగిన వెహికల్ సేల్స్ - గత నెలలో అమ్మకాలు ఇలా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా అన్ని వాహన విభాగాల్లో కలిపి 2023 మే నెలలో 20,19,414 యూనిట్లు రోడ్డెక్కాయి. 2022 మే నెలతో పోలిస్తే ఇది 10 శాతం అధికం. ప్యాసింజర్ వాహనాలు, టూ వీలర్లు, ట్రాక్టర్లకు విపరీత డిమాండ్ ఉండడం ఈ స్థాయి వృద్ధికి కారణమని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. ‘గత నెలలో ద్విచక్ర వాహన విక్రయాలు 9 శాతం పెరిగి 14,93,234 యూనిట్లకు చేరుకున్నాయి. వాణిజ్య వాహనాల అమ్మకాలు 7 శాతం అధికమై 77,135 యూనిట్లుగా ఉన్నాయి. త్రిచక్ర వాహనాలు 79 శాతం ఎగసి 79,433 యూనిట్లు, ట్రాక్టర్లు 10 శాతం దూసుకెళ్లి 70,739 యూనిట్లను తాకాయి’ అని ఫెడరేషన్ వివరించింది. -
ఎస్బీఐ షాకింగ్ నిర్ణయం..వారిపై తీవ్ర ప్రభావం..!
ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గట్టి షాక్‌ను ఇచ్చింది. మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేట్(ఎంసీఎల్ఆర్)ను పెంచుతూ ఎస్బీఐ నిర్ణయం తీసుకుంది. ఎంసీఎల్ఆర్ రేటును 10 బేసిస్ పాయింట్లను పెంచుతున్నట్లు ఎస్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. సవరించిన ఎంసీఎల్ఆర్ రేటు ఏప్రిల్ 15, 2022 నుంచి అమలులోకి రానుంది. ఎస్బీఐ అందించే లోన్ల వడ్డీ రేటు మరో 0.10 శాతం పెరగనుంది. ఈ పెంపు అన్ని రకాల టెన్యూర్స్‌కు వర్తించనుంది. ఎస్బీఐ తీసుకున్న నిర్ణయంతో లోన్లను తీసుకునే వారిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపనుంది. ఇక గృహ రుణాలు, వాహన రుణాలు, ఇతరత్ర రుణాలు చెల్లించేవారిపై ఈఎంఐ భారం మరింత పెరిగే అవకాశం ఉంది. ఎస్బీఐ సవరించిన ఎంసీఎల్ఆర్ వడ్డీరేట్లు ఇలా ఉన్నాయి.. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 6.65 శాతం నుంచి 6.75 శాతం. ఒక నెల కాల వ్యవధిపై ఎంసీఎల్ఆర్ 6.65 నుంచి 6.75 శాతం. 3 నెలల కాల వ్యవధిపై ఎంసీఎల్ఆర్ 6.65 శాతం నుంచి 6.75 శాతం. 6 నెలల కాల వ్యవధిపై ఎంసీఎల్ఆర్ 6.95 శాతం నుంచి 7.05 శాతం. ఒక ఏడాది కాలానికి ఎంసీఎల్ఆర్ 7 శాతం నుంచి 7.10 శాతం. రెండేళ్ల కాల పరిమితికి ఎంసీఎల్ఆర్ 7.2 శాతం నుంచి 7.3 శాతం. మూడేళ్ల కాల పరిమితిపై ఎంసీఎల్ఆర్ 7.3 శాతం నుంచి 7.4 శాతం. ఎంసీఎల్ఆర్ పెంపు...ఎస్బీఐ రుణ గ్రహీతలపై ప్రభావం..! సాధారణంగా బ్యాంకులు ఎంసీఎల్ఆర్ ఆధారంగానే సదరు లోన్లపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. ఎంసీఎల్ఆర్ లేదా మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు అనేది బెంచ్‌మార్క్ వడ్డీ రేటు. దీనిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)2016లో ప్రవేశపెట్టింది. ఎంసీఎల్ఆర్ పెరుగుదలతో...ఎస్బీఐ గృహ, ఇతర రుణగ్రహీతలు సంతోషంగా ఉండకపోవచ్చు, ఎందుకంటే వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ సవరణ ప్రస్తుత, భవిష్యత్తు రుణగ్రహీతలకు వర్తిస్తుంది. చదవండి: జీఎస్టీ శ్లాబులో మార్పులు, చేర్పులు... దానిని తొలగించే అవకాశం...! -
భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
భద్రాచలం/బూర్గంపాడు: భద్రాచలం వద్ద గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తోంది. శనివారం ఉదయం 8 గంటలకు 43.10 అడుగుల నీటిమట్టం నమోదు కాగా, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆ తర్వాత క్రమేపీ పెరుగుతూ రాత్రి 11.00 గంటల సమయంలో 48.50 అడు గులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. దీంతో దేవస్థానం వైపు కరకట్ట దిగువ భాగాన ఉన్న స్నానఘాట్లు పూర్తిగా మునిగిపోగా, కల్యాణ కట్టపైకి వరద చేరింది. కరకట్టల వద్ద స్లూయిస్‌లను మూసివేయటంతో భద్రాచలంలో వరద నీరు ఆగిపోయింది. ఆలయం పడమర మెట్ల వద్దకు చేరిన వరద నీరు దీంతో రామాలయ నిత్యాన్నదాన సత్రం వద్దకు వరద నీరు చేరుకుంది. భద్రాచలంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు లోతట్టు కాలనీల ప్రజలను తరలించారు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు వద్ద మధ్యాహ్నం 12 గేట్ల ద్వారా 13,888 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. చర్ల, వెంకటాపురం మండలాల నడుమ ప్రధాన రహదారిపై నీరు చేరటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పర్ణశాలకు పూర్తిగా వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ భద్రాచలంలో బస చేసి అధికారులను అప్రమత్తం చేస్తూ, పునరావాస చర్యలను సమీక్షిస్తున్నారు. వరద ఉధృతితో కల్యాణ కట్టలోకి చేరిన నీరు -
గోల్డ్ రష్: మళ్లీ కొండెక్కిన బంగారం
ముంబై : కరోనా మహమ్మారితో స్టాక్‌మార్కెట్లు కుప్పకూలుతుండటంతో బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో మదుపుదారులు షేర్లను అమ్మి బంగారంలో పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. సంక్షోభ సమయంలో సురక్షిత సాధనంగా పసిడి వైపు ఇన్వెస్టర్లు పరుగులు పెడుతుండటంతో యల్లో మెటల్ మరింత ప్రియమైంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో శుక్రవారం పదిగ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ 530 భారమై రూ 43,770కి చేరింది. ఇక రూ 1348 పెరిగిన వెండి కిలో ధర ఏకంగా రూ 41, 222కి ఎగబాకింది. ఇక రాబోయే రోజుల్లో బంగారం ధర మరింతగా పెరిగి రూ 45,000కు చేరువ కావచ్చని బులియన్ ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. చదవండి: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం -
ప్లాట్‌ఫామ్ టిక్కెట్ ధర పెంచిన రైల్వే శాఖ
సాక్షి, విజయవాడ : దసరా పండుగ రానున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఆదాయార్జనపై దృష్టి పెట్టింది. ప్రయాణీకుల రద్దీ భారీగా ఉండే అవకాశముండడంతో ప్లాట్‌ఫామ్ టిక్కెట్ల ధరను రెండు రెట్లు పెంచింది. ఇప్పటి వరకు ప్లాట్‌ఫామ్ టికెట్ ధర రూ. 10 గా ఉండగా దానిని రూ. 30 కి పెంచింది. ఈ పెంపు శనివారం నుంచే అమల్లోకి వస్తోంది. అక్టోబరు 10 వరకు ఈ రేట్లు అమల్లో ఉంటాయి. విజయవాడ, నెల్లూరు, రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్లలో ఈ పెంపు ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
ట్రంప్ నిషేధంతో లాభాలే లాభాలు
కొన్ని గల్ఫ్ దేశాల నుంచి హ్యాండ్ లగేజిగా ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకెళ్లడంపై అమెరికా నిషేధం విధించిన విషయం తెలిసిందే. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భారత ప్రభుత్వ రంగ సంస్ధ ఎయిర్ఇండియాను లాభాల బాటలో నడిపిస్తోంది. అమెరికా వెళ్లే ఎయిర్ఇండియా టికెట్లు దాదాపు వంద శాతం అధికంగా అమ్ముడవుతున్నాయి. న్యూఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌ల నుంచి న్యూయార్క్, న్యూఆర్క్, చికాగో, శాన్ఫ్రాన్సిస్కోలకు నాలుగు ఎయిర్ఇండియా విమానాలు నడుస్తున్నాయి. గతేడాది ఇదే సమయంలో ఒక్కో సర్వీసుకు 150 టికెట్లు అమ్ముడుపోగా.. ప్రస్తుతం 300 టికెట్లు అమ్ముడుపోతున్నట్లు ఎయిర్ఇండియా అధికారి ఒకరు తెలిపారు. డిమాండ్ పెరగడంతో భారత్ నుంచి అమెరికాకు వెళ్లే విమాన టికెట్ ధర రూ.10 వేలు పెరిగిందని.. అదే అమెరికా నుంచి ఇండియా వచ్చే విమాన టికెట్ ధర రూ.15 వేల వరకూ సంస్ధ పెంచిందని చెప్పారు. అయితే, అమెరికా నుంచి భారత్‌కు వచ్చే టికెట్ల అమ్మకాల్లో పెద్ద పెరుగుదల కనిపించలేదని వివరించారు. -
కేరళలో రికార్డు స్థాయిలో టూరిస్ట్ ఆదాయం
-
పెరిగిన ప్రాజెక్టుల అంచనా వ్యయాలు
-
పెరిగిన వేతనాలను వెంటనే చెల్లించాలి
నల్లగొండ టౌన్: ఆదర్శపాఠశాలల్లో పనిచేస్తున్న పొరుగుసేవల సిబ్బందికి పెంచిన వేతనాలను వెంటనే చెల్లించాలని ఆదర్శ పాఠశాలల పొరుగుసేవల సిబ్బంది సంఘం అధ్యక్షుడు ఎ.రాములు డిమాండ్ చేశారు. సోమవారం స్థానికంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విడుదల చేసిన జీఓ 19 ప్రకారం వేతనాలను ప్రతి నెల చెల్లించాలన్నారు. ఆదర్శ పాఠశాలలో ఆట స్థలం, పరికరాలు లేకపోవడం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి అనురాధ, కోశాధికారి రవీందర్‌రెడ్డి, ఉపాధ్యక్షురాలు కె.రమాదేవి, నగేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
‘మిషన్’తో పెరిగిన భూగర్భ జలాలు
రఘునాథపల్లి : మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చేపట్టిన చెరువుల పూడికతీత ద్వారా భూగర్భ జలాలు కొంత మేర పెరిగాయని భూగర్భ జలవనరుల శాఖ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ కె.ధనుంజయ అన్నారు. భూగ ర్భ జలాలపై అధ్యయనం చేసేందుకు రఘునాథపల్లి, నర్మెట మండలాలను శాఖ అధికారులు ఐదేళ్ల పాటు బేసిన్గా ఎంపిక చేశారు. ఈ మేరకు రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ ధనుంజయ్, డిప్యూటీ డైరెక్టర్ కె.కుమారస్వామి సో మవారం మేకలగట్టు, కన్నాయపల్లి చెరువుల కింది భా గం, పైభాగాన భూగర్భ జలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ధనుంజయ్ మాట్లాడుతూ కన్నాయపల్లి చెరువు వర్షపు నీటితో నిండి ఉండగా గత ఏడాది కన్నా 4 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయన్నారు. మేకలగట్టు చెరువులో నీరు లేకపోవడంతో మూడు మీటర్లు మాత్రమే పెరిగాయన్నారు. జూన్, జూలై నెలలో సాధారణ వర్షపాతం కన్నా 33 శాతం అధికంగా వర్షాలు కురవగా, ఆగస్టు నెలలో మాత్రం 66 శాతం తక్కువగా నమోదైందని చెప్పారు. ఇక మిషన్ కాకతీయ పనులు జరిగిన ప్రదేశంలో గత ఏడాది కన్నా భూగర్భ జలాలు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. ఆయన వెంట డిప్యూటీ డైరెక్టర్ ఆనంద్‌కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ శైలజశ్రీ, శ్యాం ప్రసాద్, చేరాలు, బిక్షపతి ఉన్నారు. -
జనసంద్రంగా కృష్ణమ్మ
-
దుర్గమ్మకు చేరువగా కృష్ణమ్మ
విజయవాడ(ఇంద్రకీలాద్రి) : దుర్గమ్మకు కృష్ణమ్మ మరింత చేరువైంది. నిన్నటి వరకు నీటి జాడలేని దుర్గాఘాట్‌లో గురువారం సాయంత్రానికి మూడు అడుగుల మేర నీరు చేరింది. దుర్గాఘాట్‌లో నీటిమట్టం పెరగడంతో అమ్మవారి భక్తులతోపాటు సందర్శకుల తాకిడి పెరిగింది. అమ్మవారి దర్శనానికి వచ్చిన పలువురు భక్తులు దుర్గాఘాట్‌లోనే పుణ్యస్నానాలు ఆచరించారు. యాత్రకుల రద్దీ ప్రారంభం శుక్రవారం ఉదయం నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం నుంచే యాత్రకుల రద్దీ ప్రారంభమైంది. బస్సు, రైళ్ల ద్వారా నగరానికి చేరుకున్న భక్తులు స్నానఘాట్లకు వస్తున్నారు. పుష్కర యాత్రికులతోపాటు నగరానికి చెందినవారు ఘాట్లలో ఏర్పాట్లను తిలకించేందుకు వస్తుండడంతో సదండి వాతావరణం నెలకొంది. -
భద్రాచలం వద్ద పెరిగిన గోదావరి నీటిమట్టం
-
భద్రాచలం వద్ద పెరిగిన గోదావరి నీటిమట్టం
► భారీగా వస్తున్న వరదనీరు భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ఎగువన ఉన్న ప్రాణహిత, ఇంద్రావతి నదుల నుంచి భారీ ఎత్తున వరదనీరు వచ్చి చేరుతుండడంతో సోమవారం ఉదయానికి నీటిమట్టం 43 అడుగులకు చేరింది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేశారు. రామన్నగూడెం పుష్కరఘాట్‌లో గోదావరి నీటిమట్టం 9.7 మీటర్లకు చేరింది. దాంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు. నీటి ఉధృతిని అధికారులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. -
రికార్డు స్థాయిలో పెరిగిన వాహన అమ్మకాలు
-
రాజమండ్రికి పోటెత్తిన భక్తులు