భద్రాచలం వద్ద పెరిగిన గోదావరి నీటిమట్టం
► భారీగా వస్తున్న వరదనీరు
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ఎగువన ఉన్న ప్రాణహిత, ఇంద్రావతి నదుల నుంచి భారీ ఎత్తున వరదనీరు వచ్చి చేరుతుండడంతో సోమవారం ఉదయానికి నీటిమట్టం 43 అడుగులకు చేరింది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేశారు. రామన్నగూడెం పుష్కరఘాట్‌లో గోదావరి నీటిమట్టం 9.7 మీటర్లకు చేరింది. దాంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు. నీటి ఉధృతిని అధికారులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.