water flow
-
అసోం: ఇంకా బొగ్గు గనిలోనే కార్మికులు!
దిస్పూర్: అసోంలోని బొగ్గుగని ప్రమాదంలో రెండు రోజులు గడిచినా.. ఇంకా కార్మికుల జాడ కానరావడం లేదు. ఈ క్రమంలో ఈ ఉదయం గని నుంచి ఓ మృతదేహాన్ని గజ ఈతగాళ్లు బయటకు తెచ్చాయి. దీంతో.. మిగిలిన కార్మికుల ఆచూకీపై కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. అయితే అధికారులు మాత్రం గాలింపు చర్యలను ముమ్మరం చేయించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం (జనవరి 7) అసోం దిమాహసావో జిల్లాలోని ఓ బొగ్గుగనిలోకి సోమరాత్రి ఒక్కసారికి పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరింది. సుమారు 100 ఫీట్ల నీరు గనిలోపల ముంచెత్తింది. దీంతో గనిలో ఉన్న వారిలో ముగ్గురు జలసమాధై కనిపించారు. మరికొంత మంది లోపలే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.నేవీ, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్లు సహాయక చర్యల్లో(Rescue Operations) పాల్గొంటున్నాయి. మరోవైపు.. విశాఖపట్నం నుంచి వచ్చిన డైవర్స్ బృందం మైన్ వద్ద రెక్కీ నిర్వహించి, ఆపై రంగంలోకి దిగింది. అయితే గనిలో ప్రతికూల పరిస్థితులు ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఒకానొక టైంలో తొలుగు గుర్తించిన మూడు మృతదేహాలను బయటకు తీయడం కూడా కష్టమైంది. గని నుంచి నీటిని బయటకు పంపి.. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.అయితే ప్రమాద సమయంలో లోపల 15 మంది కార్మికులు ఉండొచ్చనే ప్రచారం నడుస్తోంది. అయితే అధికారులు మాత్రం తొమ్మిది మంది పేర్లను మాత్రమే ప్రకటించారు. వీళ్లులో ఒకరు ఈ ఉదయం మృతదేహాంగా బయటకు వచ్చారు. మిగిలినవాళ్ల ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ కార్మికులు అసోం, పశ్చిమ బెంగాల్, నేపాల్‌కు చెందిన వాళ్లుగా గుర్తించారు. గనిలో సుమారు 340 ఫీట్ల లోపల వాళ్లు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.సదరు గనికి అనుమతులు లేవని తెలుస్తోంది. ఈ విషయాన్ని సీఎం హిమంత బిస్వ శర్మ(Himanta Biswa sharma) స్వయంగా ప్రకటించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేయడంతో పాటు ఒకరిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారాయన. అలాగే రెస్క్యూ ఆపరేషన్‌లో కోల్‌మైన్ సహకారం కోసం కేంద్ర బొగ్గు గనుల శాఖా మంత్రి కిషన్‌రెడ్డి తోనూ మాట్లాడినట్లు తెలిపారాయన. ఇదీ చదవండి: ముగ్గురు పోరాడినా.. పోటీ ఇద్దరి మధ్యే! -
నదులు ఎండిపోతున్నాయ్!
నదులు మానవాళి పాలిట జీవనాడులు. నది లేకపోతే జీవమే లేదు. అలాంటి నదులు ప్రస్తుతం తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 లక్షల నదులు విపరీతమైన మార్పులకు లోనవుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ మార్పులు ఇలాగే కొనసాగితే తాగడానికి నీరు దొరకదని, మరోవైపు విపరీతమైన వరదలను ఎదుర్కోవాల్సి వస్తుందని అధ్యయనకారులు హెచ్చరిస్తున్నారు. ఇవీ ప్రమాదాలు...మరికొద్ది కాలంలో ప్రపంచంలోని అనేక నదుల్లో అతి స్వల్ప పరిమాణంలో నీరు అందుబాటులో ఉందని నివేదిక పేర్కొంది. → అవి నెమ్మదిగా దుమ్ము, చిన్న రాళ్ళతో కూడిన అవక్షేపంగా మారిపోతాయని హెచ్చరించింది. → ఫలితంగా దీంతో తాగడానికి, పంటలకు, పశువులను పోషించడానికి మంచి నీటి కొరత ఏర్పడుతుందని అధ్యయన సారథి, హైడ్రాలజీ ప్రొఫెసర్ డోంగ్మే ఫెంగ్ తెలిపారు. → నదులు భూమికి రక్తనాళాల వంటివని, అవి ప్రవహించే తీరులో మార్పులు మనపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఫెంగ్ హెచ్చరించారు.క్షీణిస్తున్న నదులు భూమిపై నదులు లోనవుతున్న మార్పులపై సిన్సినాటీ విశ్వవిద్యాలయం అధ్యయనం చేసింది. శాటిలైట్ డేటా, కంప్యూటర్ మోడలింగ్ పరిజ్ఞానంతో పలువురు శాస్త్రవేత్తలు 35 ఏళ్లుగా భూమిపై ప్రతి రోజూ ప్రతి నది నీటి ప్రవాహాన్ని మ్యాపింగ్ చేశారు. ఇందులో వెల్లడైన విషయాలు వారిని దిగ్భ్రాంతికి గురి చేశాయి. ప్రపంచంలోని అతి పెద్ద నదుల్లోని సగం నదుల్లో నీటి ప్రవాహం అతి వేగంగా తగ్గుముఖం పడుతోంది! ఈ తగ్గుదల వేగం కొన్నింట్లో ఏటా 5 శాతముంటే మరికొన్నింట్లో ఏకంగా 10 శాతం దాకా ఉన్నట్టు అధ్యయనం తేల్చింది. ఇది చాలా వేగవంతమైన మార్పని హెచ్చరించింది. ఆఫ్రికాలోని రెండో అతి పెద్ద నది కాంగో, చైనాలో ప్రముఖ నది యాంగ్జీ, దక్షిణ అమెరికాలోని ప్లాటా వంటి నదులైతే ఇప్పటికే గణనీయంగా క్షీణించిపోయాయి. ముంచుకొస్తున్న వరద ముప్పు ఇక పర్వత ప్రాంతాల్లోని పలు చిన్న నదుల పరిస్థితి భిన్నంగా ఉంది. వాటిలో ప్రవాహం 17 శాతం పెరిగింది. హిమాలయాల వంటి ప్రాంతాల్లో జలవిద్యుత్ ప్రణాళికలు ఊహించని ప్రమాదాలు తెచ్చి పెడుతున్నాయి. అవక్షేపం దిగువకు రవాణా అవుతోంది. ఇది వరదలను తీవ్రతరం చేస్తోంది. గత 35 ఏళ్ల కాలంలో ఎగువ ప్రాంతాల్లోని ఇలాంటి చిన్నాచితకా నదుల వల్ల భారీ వరదలు ఏకంగా 42 శాతం పెరిగాయని అధ్యయనంలో తేలింది. వాతావరణంలో అధిక మార్పులు, నదీ ప్రవాహాలకు మానవులు అంతరాయం కలిగించడం వంటివే ఇందుకు కారణమని సివిల్ అండ్ ఎని్వరాన్మెంటల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ కోలిన్ గ్లీసన్ చెప్పారు. ‘‘ఈ వాతావరణ మార్పులు ప్రధానంగా మానవ కార్యకలాపాలు, శిలాజ ఇంధనాల వల్ల ఏర్పడ్డ వాతావరణ సంక్షోభమే. వాటివల్ల వర్షపాత పరిస్థితులు మారుతున్నాయి. మంచు కరిగి రేటు వేగవంతం అవుతోంది. స్తోందని, ఫలితంగా వరదలు ముంచెత్తుతున్నాయి’’ అని ఆయన వివరించారు. ‘‘పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో దుర్భర కరువు, మరికొన్ని ప్రాంతాల్లో కనీవినీ ఎరగని వరదలు పరిపాటిగా మారే రోజు దూరంలో లేదు’’ అన్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
పెన్నాలో అన్ని నీళ్లా?
సాక్షి, అమరావతి: వర్షఛాయ (రెయిన్ షాడో) ప్రాంతంలో పురుడుపోసుకుని ప్రవహించే పెన్నానదిలో 75 శాతం లభ్యత ఆధారంగా ఏటా 210.12 టీఎంసీల నీటి ప్రవాహం ఉందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా తేల్చింది. 1985 నుంచి 2015 వరకు పెన్నానది పరీవాహక ప్రాంతం (బేసిన్)లో వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటిలభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది. ఏటా పెన్నా బేసిన్లో కురిసే వర్షపాతం పరిమాణం 1,412.58 టీఎంసీలని లెక్కగట్టింది.వరద జలాలతో కలుపుకొంటే ఏటా 389.16 టీఎంసీల ప్రవాహం ఉంటుందని తేల్చింది. కానీ.. పెన్నాలో ఆ స్థాయిలో నీటిలభ్యత లేదని సాగునీటి రంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. బేసిన్లో 30 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటిలభ్యతను లెక్కగట్టడం శాస్త్రీయం కాదంటున్నారు. వందేళ్లు లేదా కనీసం 50 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా చేసే అధ్యయనానికే శాస్త్రీయత ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ ఇదీ తేడా..పెన్నాలో నీటిలభ్యతపై 1993లో సీడబ్ల్యూసీ తొలిసారి అధ్యయనం చేసింది. 1944–45 సంవత్సరం నుంచి 1983–84 వరకు బేసిన్లో 40 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా అప్పట్లో నీటిలభ్యత లెక్కగట్టింది. వరద జలాలతో కలుపుకొంటే పెన్నాలో 223.18 టీఎంసీల లభ్యత ఉంటుందని తేల్చింది. పెన్నా బేసిన్ 55,213 చదరపు కిలోమీటర్లుగా పేర్కొంది. తాజాగా సీడబ్ల్యూసీ పెన్నా బేసిన్లో 1985–2015 మధ్య అంటే 30 ఏళ్లలో కురిసిన వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యత లెక్కగట్టింది. వరద జలాలతో కలిపితే 389.16 టీఎంసీల ప్రవాహం ఉంటుందని తేల్చింది.75 శాతం లభ్యత ఆధారంగా చూస్తే నదిలో 210.12 టీఎంసీలు ఉంటుందని పేర్కొంది. కానీ బేసిన్ మాత్రం 54,905 చదరపు కిలోమీటర్లకు తగ్గినట్లు గుర్తించింది. 1993తో పోలిస్తే బేసిన్ విస్తీర్ణం 308 చదరపు కిలోమీటర్లు తగ్గింది. పెన్నా బేసిన్లో 1944–84తో పోల్చితే 1985–2015 మధ్య వర్షపాతం అధికంగా ఉండటంవల్లే నీటిలభ్యత పెరిగిందని సీడబ్ల్యూసీ పేర్కొంది. దీన్ని సాగునీటిరంగ నిపుణులు కొట్టిపారేస్తున్నారు. కేవలం 30 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాలను ఆధారంగా తీసుకోవడాన్ని తప్పుపడుతున్నారు. అధ్యయనం పరిధిని తగ్గించుకోవడం వల్లే నీటిలభ్యత పెరిగిందని, ఇది అశాస్త్రీయమని స్పష్టం చేస్తున్నారు. పెన్నా బేసిన్ ఇదీ..కర్ణాటకలో వర్షఛాయ ప్రాంతమైన చిక్‌బళ్లాపూర్ జిల్లా నందికొండల్లోని చెన్నకేశవ పర్వతశ్రేణుల్లో పుట్టిన పెన్నానది.. రాష్ట్రంలో వర్షాభావ ప్రాంతాలైన శ్రీసత్యసాయి, అనంతపురం, వైఎస్సార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల మీదుగా 597 కిలోమీటర్లు ప్రవహించి ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఎడమవైపు నుంచి జయమంగళ, కుందేరు, కుడివైపు నుంచి సగిలేరు, చిత్రావతి, పాపాఘ్ని, చెయ్యేరు ఉపనదులు పెన్నాలో కలుస్తాయి. పెన్నా బేసిన్లో 400 నుంచి 800 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుంది. ఈ బేసిన్ విస్టీర్ణం 54,905 చదరపు కిలోమీటర్లని సీడబ్ల్యూసీ తాజాగా తేల్చింది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 1.67 శాతానికి సమానం. -
AP: ‘ప్రాజెక్ట్ జలధార’.. అద్భుత ఫలితాలు
సాక్షి, అనంతపురం : ఇటీవల నీటి నిర్వహణ ప్రాజెక్టులకు సంబంధించి భారత ప్రభుత్వ జల శక్తి మంత్రిత్వ శాఖ కోకా–కోలా ఇండియా ఫౌండేషన్ ను జాతీయ అవార్డుతో సత్కరించింది. అనంతపురంలో సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ప్రాజెక్ట్ జలధార ద్వారా కరువు ప్రాంతాలలో అభివృద్ధికి దోహదపడినందుకు ఈ అవార్డు వరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సహకారంతో ’ప్రాజెక్ట్ జలధార’ ద్వారా ...ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలోసాధించిన ఫలితాలను గురించి ఆనందన –కోకా–కోలా ఇండియా ఫౌండేషన్, ఎస్ ఎం సెహగల్ ఫౌండేషన్ ప్రతినిధులు వివరించారు. ఈ ప్రాజెక్ట్ భూగర్భ జలాలను పెంపొందించటంలో ఎన్నదగిన ఫలితాలను సాధించిందన్నారు. వివరాల్లోకి వెళితే... పెరిగిన భూగర్భజలసిరి... గ్రామీణాభివృద్ధి ఎన్జిఓ ఎస్ఎం సెహగల్ ఫౌండేషన్ సహకారంతో ఆనందన – కోకా–కోలా ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ’వాటర్ స్టీవార్డ్‌షిప్’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగమైన ప్రాజెక్ట్ ’జలధార’ ను ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రారంభించారు. తద్వారా అనంతపురంలో 5 చెక్ డ్యామ్స్‌ను కోడూరు– సుబ్బారావుపేట, ముద్దపల్లి– తిమ్మడిపల్లి , మధురేపల్లి – కందురుపర్తి నల్లపరెడ్డి పల్లి గ్రామాలలో 416 మిలియన్ లీటర్ల నీటి సేకరణ సామర్థ్యంతో నిర్మించారు.దీంతో భూగర్భజలాల పెంపుదల కారణంగా సాగు విస్తీర్ణంలో 35% పెరుగుదల నమోదయింది, తగ్గుతున్న నీటి కొరత... ఈ ప్రాంతంలో నీటి కొరత సమస్య కూడా పరిష్కారమవుతోంది. భూగర్భ జలాలు పెరగటంతో పంట దిగుబడిలో కూడా గణనీయమైన రీతిలో 75% పెరుగుదల నమోదయింది. దానితో పాటే భూసారమూ పెరిగింది. ఒక సంవత్సరంలో రైతులు బహుళ పంటలు పండించడానికి ఇది వీలు కల్పించింది. అదనంగా, 82% మంది రైతులు పంటల నాణ్యతలో గణనీయమైన మెరుగుదలను గమనించారు. ప్రాజెక్ట్ అమలులో భాగంగా 7 నీటి నిర్వహణ కమిటీలు ఏర్పాటు చేయడం ద్వారా నీటి నిర్వహణలో స్థానికుల ప్రమేయాన్ని కూడా పొందగలిగింది. ఇందులో 75 మంది పురుషులు, 17 మంది మహిళలు సహా 92 మంది సభ్యులు ఉన్నారు. నీటి–ఎద్దడి ఉన్న భూములలో భూగర్భ జలాలను పెంచటం, వాటర్షెడ్లను మెరుగుపరచడం ద్వారా కోకోకోలా ఫౌండేషన్ కృషి చేస్తోంది. ఆ కృషి ఫలితంగానే కంపెనీ వినియోగిస్తున్న నీటిలో 200% పైగా తిరిగి అందించగలిగింది. మంచి ఫలితాలు సాధించాం... అనంతపురంలో చెక్ డ్యామ్‌ల నిర్మాణంతో. భూమి నాణ్యత మెరుగుపరచి పంట దిగుబడిని, భూగర్భజల స్థాయిలను గణనీయంగా పెంచగలిగాం. ఫలితంగా, నేడు రైతులు విభిన్న పంటలను పండిస్తున్నారు మా నీటి నిర్వహణ కమిటీలు ఈ కార్యక్రమాలను కొనసాగించడానికి తగిన శిక్షణ పొందాయి. ఇదీచదవండి.. వేడెక్కిన ఏపీ రాజకీయం -
హన్నన్నా.. పెన్నాలో ఇన్ని నీళ్లా?
సాక్షి, అమరావతి: పెన్నా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా ఏటా 210.12 టీఎంసీల నీటి ప్రవాహం ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా తేల్చింది. 1985 నుంచి 2015 వరకు పెన్నా నదీ పరీవాహక ప్రాంతం (బేసిన్)లో వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది. ఏటా పెన్నా బేసిన్లో కురిసే వర్షపాతం పరిమాణం 1412.58 టీఎంసీలని లెక్కగట్టింది. వరద జలాలతో కలుపుకొంటే ఏటా 389.16 టీఎంసీల ప్రవాహం ఉంటుందని తేల్చింది. కానీ.. పెన్నాలో ఆ స్థాయిలో నీటి లభ్యత లేదని సాగునీటి రంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. బేసిన్లో 30 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యతను లెక్కగట్టడం శాస్త్రీయం కాదని చెబుతున్నారు. వందేళ్లు లేదా కనీసం 50 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా చేసే అధ్యయనానికే శాస్త్రీయత ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అప్పటికి, ఇప్పటికి ఇదీ తేడా.. పెన్నాలో నీటి లభ్యతపై 1993లో సీడబ్ల్యూసీ తొలిసారి అధ్యయనం చేసింది. 1944–45 సంవత్సరం నుంచి 1983–84 వరకు బేసిన్లో 40 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా అప్పట్లో నీటి లభ్యత లెక్కగట్టింది. వరద జలాలతో కలుపుకొంటే పెన్నాలో 223.18 టీఎంసీల లభ్యత ఉంటుందని తేల్చింది. పెన్నా బేసిన్ 55,213 చదరపు కిలోమీటర్లుగా పేర్కొంది. తాజాగా సీడబ్ల్యూసీ పెన్నా బేసిన్లో 1985–2015 మధ్య అంటే 30 ఏళ్లలో కురిసిన వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యత లెక్కగట్టింది. వరద జలాలతో కలిపితే 389.16 టీఎంసీల ప్రవాహం ఉంటుందని తేల్చింది. 75 శాతం లభ్యత ఆధారంగా చూస్తే నదిలో 210.12 టీఎంసీలు ఉంటుందని తేల్చింది. కానీ.. బేసిన్ మాత్రం 54,905 చదరపు కిలోమీటర్లకు తగ్గినట్లు గుర్తించింది. అంటే.. 1993తో పోల్చితే బేసిన్ విస్తీర్ణం 308 చదరపు కిలోమీటర్లు తగ్గింది. పెన్నా బేసిన్లో 1944–84తో పోల్చితే 1985–2015 మధ్య వర్షపాతం అధికంగా ఉండటంవల్లే నీటి లభ్యత పెరిగిందని సీడబ్ల్యూసీ పేర్కొంది. దీన్ని సాగునీటి రంగ నిపుణులు కొట్టిపారేస్తున్నారు. కేవలం 30 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాలను ఆధారంగా తీసుకోవడాన్ని తప్పుపడుతున్నారు. అధ్యయనం పరిధిని తగ్గించుకోవడం వల్లే నీటి లభ్యత పెరిగిందని, ఇది అశాస్త్రీయమని స్పష్టం చేస్తున్నారు. పెన్నా బేసిన్ ఇదీ.. కర్ణాటకలో వర్షాఛాయ ప్రాంతమైన చిక్‌బళ్లాపూర్ జిల్లా నంది కొండల్లోని చెన్నకేశవ పర్వత శ్రేణుల్లో పుట్టే పెన్నా నది.. రాష్ట్రంలో వర్షాభావ ప్రాంతాలైన శ్రీసత్యసాయి, అనంతపురం, వైఎస్సార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల మీదుగా 597 కిలోమీటర్లు ప్రవహించి.. ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఎడమ వైపు నుంచి జయమంగళ, కుందేరు, కుడి వైపు నుంచి సగిలేరు, చిత్రావతి, పాపాఘ్ని, చెయ్యేరు ఉప నదులు పెన్నాలో కలుస్తాయి. పెన్నా బేసిన్లో 400 800 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుంది. ఈ బేసిన్ విస్టీర్ణం 54,905 చదరపు కిలోమీటర్లని సీడబ్ల్యూసీ తాజాగా తేల్చింది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 1.67 శాతానికి సమానం. -
పలు రైళ్లు రద్దు.. దారి మళ్లింపు
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): వర్షాల కారణంగా హసనపర్తి–కాజీపేట సెక్షన్ మధ్యలో ట్రాక్‌లపై ప్రమాదకర స్ధాయిలో నీటి ప్రవాహం చేరుకోవడంతో ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను పూర్తిగాను, పాక్షికంగా రద్దు చేయడంతో పాటు మరి కొన్నింటిని అధికారులు దారి మళ్లించారు. సికింద్రాబాద్–సిర్పుర్ కాగజ్‌నగర్ (17233) రైలును ఈ నెల 27, సిర్పూర్ కాగజ్‌నగర్–సికింద్రాబాద్(17223) రైలును ఈ నెల 28న పూర్తిగా రద్దు చేశారు. సికింద్రాబాద్–ధనాపూర్ (12791)రైలును గురువారం కాజీపేట, విజయవాడ, దువ్వాడ, విజయనగరం మీదుగా దారి మళ్లించారు. చెన్నై సెంట్రల్–అహ్మదాబాద్ (12656) రైలును వరంగల్లు, సికింద్రాబాద్, వాడి, సోలాపూర్, మన్మాడ్ మీదుగా దారి మళ్లించారు. చైన్నె సెంట్రల్–మాత వైష్ణోదేవి కాత్ర రైలును గుంటూరు, సికింద్రాబాద్, మన్మాడ్ మీదుగా దారి మళ్లించారు. రామేశ్వరం–బెనారస్ (22535) రైలును విజయవాడ, దువ్వాడ, విజయనగరం మీదుగా దారి మళ్లించారు. హెల్ప్ డెస్క్‌ల ఏర్పాటు వర్షాల నేపథ్యంలో రైళ్ల సమాచారం తెలుసుకునేందుకు వీలుగా విజయవాడ, ఒంగోలు, తెనాలి, సామర్లకోట, ఏలూరు, రాజమండ్రి స్టేషన్లతో పాటు గూడురు స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్లు విజయవాడ 0866–2576924, గూడూరు 7815909300 స్టేషన్లలో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు గురువారం చెప్పారు. -
Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులన్నీ ఫుల్..!
-
ప్రకాశం బ్యారేజ్‌కి పోటెత్తుతున్న వరద ఉధృతి..!
-
కాలు జారితే అంతే.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..
అడ్డతీగల(అల్లూరి సీతారామరాజు జిల్లా): ప్రత్యామ్నాయం లేకపోవడంతో గత్యంతరం లేక అడ్డతీగల మండలంలోని పింజరికొండ గ్రామస్తులు అంత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఏలేరు వాగులో గల గోడపై నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. 400 మంది జనాభా ఉన్న ఈ గ్రామం వాగుకు అవతలి వైపు ఉంది. 2010 వరకూ వాగులో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకునే వారు. వాగుకు సమీపంలో చిన్నతరహా జలవిద్యుత్ కేంద్రం నిర్మించారు. అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేయడం కోసం నీటిని మళ్లించడానికి వాగుకు అడ్డంగా వియర్(అడ్డుగోడ) నిర్మించారు. ఇప్పుడా గోడమీద నుంచి పింజరికొండ గ్రామస్తులు రాకపోకలు సాగిస్తున్నారు. నిత్యం నీటి ప్రవాహం ఉండడంతో గోడ నాచుపట్టి ఉంటుంది. ప్రవాహ ఉధృతి అధికంగా ఉన్నప్పుడు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గోడపై నుంచి రాకపోకలు సాగించవలసి వస్తోంది. ఈ క్రమంలో ప్రమాదాలు చోటుచేసుకోవడం పరిపాటిగా మారింది. పలువురు మృత్యువాత పడ్డారు. వాగు దాటితే గాని బాహ్యప్రపంచానికి రాలేని పరిస్థితి వారిది. వాగు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో గల పాపంపేట చేరుకుంటేగాని వారికి వాహన సదుపాయం అందుబాటులోకి రాదు. ఏలేరు వాగుపై రోప్ బ్రిడ్జి అయినా నిర్మించాలని పింజిరికొండ వాసులు సంవత్సరాల తరబడి కోరుతూనే ఉన్నారు. (క్లిక్ చేయండి: పాపికొండలు.. షికారుకు సిద్ధం) -
శ్రీశైలంలో పది, సాగర్‌లో 22 గేట్లు ఎత్తివేత
దోమలపెంట(అచ్చంపేట)/గద్వాల రూరల్/నాగార్జునసాగర్: జోగుళాంబ గద్వాల జిల్లాలో జూరాల ప్రాజెక్టుకు 2,67, 000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 43 గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం పోటెత్తుతోంది. మొత్తం 3,76, 825 క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తోంది. జలాశయం నీటిమట్టం 884.5 అడుగులు కాగా, 212.9198 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శుక్రవారం ఆనకట్ట వద్ద పదిగేట్లను 15 మీటర్ల మేర ఎత్తి 3,77,160 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ఎగువ నుంచి మొత్తం 4,42,694 క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో సాగర్ ప్రాజెక్టు వద్ద 22 రేడియల్ క్రస్ట్‌గేట్ల ద్వారా 3,55,228 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. విద్యుదుత్పాదనకు, కుడి, ఎడమ కాల్వలు, వరదకాల్వలు, ఎస్ఎల్బీసీకి నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం నీటిమట్టం ప్రస్తుతం 589.50 అడుగులు ఉంది. -
నదుల్లో వరద ఉద్ధృతి.. శ్రీశైలానికి పెరిగిన ప్రవాహం
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్టు/విజయపురిసౌత్: పరివాహక ప్రాంతాల్లో (బేసిన్లో) విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, వంశధార, నాగావళి నదుల్లో వరద ఉద్ధృతి పెరిగింది. పెన్నానదిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి మంగళవారం సాయంత్రం 6 గంటలకు 3,00,847 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు 8 వేలు, హంద్రీ–నీవాకు 1,013, కల్వకుర్తికి 800 క్యూసెక్కులు తరలిస్తున్నారు. 884.7 అడుగుల్లో 213.38 టీఎంసీలను నిల్వచేస్తూ స్పిల్ వే తొమ్మిదిగేట్లను 10 అడుగులు ఎత్తి 2,51,433, కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 62,537 కలిపి 3,13,970 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు 16 గేట్లను 10 అడుగులు ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్లు కిందికి వదులుతున్నారు. పులిచింతలకు చేరుతున్న వరదను చేరుతున్నట్లుగా స్పిల్ వే, విద్యుత్ కేంద్రాల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. దీంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి వరద స్థిరంగా కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్‌లోకి 2,99,478 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 10,728 క్యూసెక్కులు విడుదల చేస్తూ.. 2,96,625 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉధృతి
-
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి
-
శ్రీశైలం ప్రాజెక్టులోకి పెరిగిన వరద
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం: శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కాస్త పెరిగింది. శనివారం సాయంత్రం 6 గంటలకు 87,852 క్యూసెక్కులు చేరుతోంది. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా 41,358 క్యూసెక్కులను దిగువకు వదులు తున్నారు. శ్రీశైలంలో 879.5 అడుగుల్లో 185.56 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి 29,080 క్యూసెక్కులు, తుంగభద్ర డ్యామ్ నుంచి 31,125 క్యూసెక్కులు దిగువకు వదులుతుండటంతో ఆదివారమూ శ్రీశైలంలోకి వరద ప్రవాహం కొనసాగనుంది. శ్రీశైలం నుంచి విడుదల చేసిన జలాలతో నాగార్జున సాగర్‌లో నీటి నిల్వ 554.9 అడుగుల్లో 220.70 టీఎంసీలకు చేరుకుంది. సాగర్‌కు దిగువన మూసీలో వరద ఉధృతి తగ్గడంతో పులిచింతల్లోకి 7,852 క్యూసెక్కులు వస్తోంది. నీటి నిల్వ 40.63 టీఎంసీలకు చేరింది. ఇక్కడి నుంచి 19,587 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. పులిచింతల నుంచి దిగువకు వదులుతున్న నీటికి పాలేరు, మున్నేరు ప్రవాహం తోడవడంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 27,542 క్యూసెక్కులు చేరుతోంది. ఇక్కడి నుంచి కృష్ణా డెల్టాకు 10,197 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 17,345 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. తగ్గిన గోదావరి వరద గోదావరిలో వరద ప్రవాహం మరింతగా తగ్గింది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద శనివారం రాత్రి నీటి మట్టం 8.80 అడుగులు ఉంది. బ్యారేజి నుంచి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు 9,800 క్యూసెక్కులు వదిలారు. 5,91,042 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచి పెట్టారు. భద్రాచలం వద్ద నీటి మట్టం శనివారం సాయంత్రం 6 గంటలకు 32.70 అడుగులకు చేరింది. పోలవరంలో 10.78 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 15.02 మీటర్ల నీటి మట్టాలు నమోదయ్యాయి. ఇదీ చూడండి: ఒక్క ఫొటో నా జీవితాన్నే మార్చేసింది -
శ్రీశైలం వద్ద కొనసాగుతున్న వరద ఉధృతి
-
ఎగువన శాంతం.. దిగువన మహోగ్రం
సాక్షి, హైదరాబాద్: పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో ఎగువ తెలంగాణలో గోదావరి నది శాంతించింది. శుక్రవారం రాత్రి 9 గంటల సమయానికి శ్రీరాంసాగర్‌లోకి వచ్చే వరద 96,265 క్యూసెక్కులకు తగ్గింది. మధ్యలో వాగుల చేరికతో ఎల్లంపల్లికి 2,94,429 క్యూసెక్కుల వరద వస్తోంది. అయితే ప్రాణహిత, కడెం, ఇంద్రావతి ఇతర నదుల్లో భారీగా ప్రవాహం ఉండటంతో.. లక్ష్మీ బ్యారేజీ వద్ద 23,29,903 క్యూసెక్కుల భారీ వరద కొనసాగుతోంది. సమ్మక్క బ్యారేజీ, సీతమ్మ సాగర్ల నుంచీ దాదాపు ఇదేస్థాయి ప్రవాహం దిగువకు వెళుతోంది. దీనికి అదనంగా మధ్యలో చేరుతున్న నీటితో భద్రాచలానికి భారీ వరద కొనసాగుతోంది. ప్రమాదకర స్థాయిలో ప్రవాహంతో భద్రాచలం జలదిగ్బంధంలో చిక్కుకుంది. శుక్రవారం రాత్రి 10 గంటలకు భద్రాచలం వద్ద 71 అడుగుల మట్టంతో 24,29,246 లక్షల క్యూసెక్కుల వరద ముందుకు వెళుతోంది. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ముంపు గోదావరి ఉగ్రరూపంతో జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పలు ప్రాంతాలు జల దిగ్భందంలో చిక్కుకున్నాయి. ఏటూరునాగారం మండల కేంద్రంలోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. మొత్తం 28 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 6,800 మందిని తరలించారు. తెలంగాణ–మహారాష్ట్రలను కలిపే 353(సీ) జాతీయ రహదారిపై మహారాష్ట్ర వైపు అప్రోచ్ రోడ్డుకు భారీ గండి పడింది. అర కిలోమీటర్ మేర జాతీయ రహ దారి కోతకు గురికావడంతో.. తెలంగాణ–మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచాయి. ములుగు జిల్లా ఏటూరునాగారంలోని కాలనీల్లో ప్రవహిస్తున్న వరద నీరు నీటిలోనే లక్ష్మీ పంపుహౌస్ కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన లక్ష్మి పంపుహౌజ్ పూర్తిగా నీటిలోనే మునిగిపోయి ఉంది. వేగంగా వరద రావడంతో పంపుహౌజ్‌లోని ఫోర్‌బే బ్రెస్ట్ వాల్ 9వ బ్లాక్ వద్ద గోడ కూలి అక్కడక్కడా గండ్లు పడినట్టు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం 108 మీటర్లకుపైగా వరద నీరు ఉందని, ఇది 100 మీటర్లకన్నా తగ్గితేనే.. పంపుహౌజ్‌లోని నీటిని ప్రత్యేక మోటార్లతో డీవాటరింగ్ (తోడటం) చేయడానికి వీలవుతుందని ఇంజనీర్లు చెప్తున్నారు. గోదావరి వరదతో మునిగిన పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు సమీపంలోని సరస్వతి పంపుహౌస్ చుట్టూ చేరిన నీరు తగ్గింది. దీనితో శుక్రవారం పంపుహౌజ్ నుంచి నీటిని తోడేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది. -
గోదారమ్మా శాంతించు.. ఇలా అయితే బ్రతికేదెలా.. 36 ఏళ్ల రికార్డు బ్రేక్
భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. 36 ఏళ్ల తర్వాత మొదటిసారి రికార్డు స్థాయిలో 70 అడుగులు దాటి వరద నీరు ప్రవహిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 70 అడుగులు దాటింది. ఇదిలా ఉండగా.. గత 50 ఏళ్లలో మూడు సార్లు మాత్రమే గోదావరి నీటి మట్టం 70 అడుగులు దాటింది. ఇక, ప్రస్తుతం గోదావరిలోకి 24 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో, అధికారులు భద్రాచలం గోదావరి కరకట్టను డేంజర్ జోన్‌గా ప్రకటించారు. ఇప్పటికే భద్రాచలంలో పలు కాలనీలు నీటమునిగాయి. రామాలయం ప్రాంతంలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. 2వేల కుటంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కాగా, గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. Godavari water level has touched a high of 70 ft at 2.30 pm. #Bhadrachalam #TelanganaFloods pic.twitter.com/8MqZ30vpAO — Inspired Ashu. (@Apniduniyama) July 15, 2022 ఎగువనున్న మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి, దాని ఉప నదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, కడెంవాగు ఉప్పొంగుతున్నాయి. దీంతో ఉప్పెనలా గోదావరి వరదతో విరుచుకుపడుతోంది. వరద ఉధృతి ధాటికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ధవళేశ్వరం వరకూ ఉన్న తొమ్మిది ప్రాజెక్టుల గేట్లను పూర్తిగా ఎత్తేశారు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన పార్వతి, లక్ష్మీ, సరస్వతి బ్యారేజ్‌లను గోదావరి వరద ముంచెత్తింది. లక్ష్మీ బ్యారేజ్ వద్దకు 28.30 లక్షల క్యూసెక్కులు చేరడంతో కాళేశ్వరం వద్ద వరద నీటిమట్టం 16.72 అడుగులకు చేరుకుంది. గోదావరి చరిత్రలో 1986లో రికార్డు స్థాయిలో 35,06,338 క్యూసెక్కులు ప్రవాహం వచ్చినప్పుడు కాళేశ్వరం వద్ద వరద నీటిమట్టం 15.75 అడుగులుగా నమోదైంది. ఇప్పుడు ఆ రికార్డు చెరిగిపోవడం గమనార్హం. ఇక ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం అత్యంత ప్రమాదకర స్థాయిని దాటిపోయింది. ఇది కూడా చదవండి: ఉగ్ర గోదారి 'హై అలర్ట్' -
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం
-
గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి
-
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కు పోటెత్తిన వరద
-
గోదావరికి పెరుగుతున్న వరద... మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
-
ఉదృతంగా ప్రవహిస్తున్న నరసింహులగూడం వాగు
-
శ్మశానంలో వర్షానికి నీటిలో తేలియాడిన మృతదేహం
టేకుమట్ల: ఒకే మృతదేహానికి రెండుసార్లు అంతిమ వీడ్కోలు పలికిన హృదయ విదారక సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని అంకుషాపూర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. అంకుషాపూర్ గ్రామానికి చెందిన గురుకుంట్ల భద్రమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆమె కుటుంబ సభ్యులు సమీపంలోని చలివాగు ఒడ్డుకు పూడ్చి అంతిమ సంస్కారాలు చేశారు. కాగా, రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చలివాగు ఉప్పొంగడంతో పూడ్చిన శవం నీటిలో తేలియాడుతూ మండలంలోని వెలిశాల శివారులో గల చెట్ల కొమ్మలకు చిక్కుకోవడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు శవాన్ని బైటికి తీసి అంకుషాపూర్ గ్రామానికి చెందిన గురుకుంట్ల భద్రమ్మగా గుర్తించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించి అక్కడే దహన సంస్కారాలు నిర్వహించినట్లు ఎస్సై రమణారెడ్డి తెలిపారు. (చదవండి: రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లెలు బంగారం సొంత అన్న చోరీ) చదవండి: రాజకీయ నాయకుడి వేధింపులకు మహిళ బలి -
ప్రకాశం బ్యారేజ్ నుంచి వరద నీరు దిగువకు విడుదల
-
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తు నిర్వహణ శాఖ
కృష్ణా: కృష్ణా నది వరద ప్రవాహం పెరుగుతున్నందున.. లోతట్టుప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణశాఖ తెలిపింది. విజయవాడలో 24 మంది సభ్యులతో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఏర్పాటు చేశారు. కాగా ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లో 2.57 లక్షలు, ఔట్ ఫ్లో 2.57 లక్షల క్యూసెక్కులుగా ఉంది. రేపు(మంగళవారం) సాయంత్రానికి వరద ఉద్ధృతి తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. ఇక శ్రీశైలం ఇన్ ఫ్లో 4.35 లక్షలు, ఔట్ ఫ్లో 4.68 లక్షల క్యూసెక్కులు. అలాగే సాగర్ ఇన్ ఫ్లో 3.72 లక్షలు, ఔట్ ఫ్లో 3.55 లక్షల క్యూసెక్కులు. కాగా పులిచింతల ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.13 లక్షల క్యూసెక్కులుగా ఉంది. -
సూర్యాపేట జిల్లా కేంద్రంలో వరద బీభత్సం
-
నిర్మల్ జిల్లాలో వరద బీభత్సం
-
పెద్దపల్లి: సరస్వతి బ్యారేజ్‌లోకి భారీగా వరద నీరు
-
వాగులో కొట్టుకుపోతూ బయటపడి.. ఒక్కసారిగా..
-
వాగులో కొట్టుకుపోతూ బయటపడి.. ఒక్కసారిగా..
సాక్షి, అనంతపురం: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గుత్తి మండలం కొజ్జేపల్లి వాగులో ద్విచక్ర వాహనంతో సహా కొట్టుకుపోతున్న వ్యక్తిని స్థానికులు కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చారు. అయితే బయటకు తీసుకురాగానే ఒక్కసారిగి కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. మృతుడు గొల్లలదొడ్డి చెర్లోపల్లికి చెందిన శ్రీరాములుగా గుర్తించారు. కాగా ఇదే వాగులో మరో లారీ, ఆటో కూడా చిక్కుకున్నాయి. అయితే స్థానికులు వెంటనే స్పందించడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. -
పక్షం రోజులు.. 127 టీఎంసీలు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఈ సారి భారీ వరద పోటెత్తింది. పక్షం రోజుల్లోనే ఏకంగా 127 టీఎంసీల మిగులు జలాలు వృథాగా గోదావరిలోకి వెళ్లిపోయాయి. ప్రాజెక్టు ఎగువన ఉన్న మహారాష్ట్రలోని సాగునీటి ప్రాజెక్టుల నుంచి 15 రోజులుగా రోజూ లక్ష నుంచి లక్షన్నర క్యూసెక్కుల వరద జలాలు తరలివస్తున్నాయి. దీంతో ఎస్సీరెస్పీ ప్రాజెక్టు వరద గేట్లను ఎత్తి అదే స్థాయిలో నీటిని నదిలోకి వదులుతున్నారు. ఈ ఏడాది వర్షాకాలం సీజన్ ప్రారంభమైన జూన్ 1 నుంచి ప్రాజెక్టులోకి సుమారు 234 టీఎంసీల నీరు వచ్చినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు నిండిపోగా, మిగిలిన జలాలను గోదావరిలోకి వదిలి పెడుతున్నారు. వరద కాలువ ద్వారా మిడ్‌మానేరు జలాశయానికి తరలిస్తున్నారు. అలాగే, కాకతీయ, సరస్వతి, లక్ష్మీకాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. కాగా, అక్టోబర్ 28 వరకు మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తే ఉంచుతారు. దీంతో అక్టోబర్‌లో కూడా ప్రాజెక్టుకు వరద జలాల రాక కొనసాగుతుందని అధికారులు తెలిపారు. మొదట 112 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులోకి భారీగా సిల్ట్ చేరడంతో నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలకు పడిపోయింది. ఐదేళ్లలో ఇన్‌ఫ్లో ఇలా.. ఇదిలా ఉండగా గత ఐదేళ్లలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వచ్చిన ప్రవాహాలను పరిశీలిస్తే.. 2014–15లో కేవలం 14.77 టీఎంసీలు మాత్రమే ఇన్‌ఫ్లో వచ్చింది. 2015–16లో మరీ తక్కువగా 4.42 టీఎంసీల ఇన్‌ఫ్లో మాత్రమే వచ్చి చేరింది. ఇక 2016–17లో 254 టీఎంసీలు రాగా, 2017–18లో 85 టీఎంసీల వరద మాత్రమే వచ్చింది. 2019–20లో 87 టీఎంసీల ఇన్‌ఫ్లో వచ్చింది. ఈసారి ఇప్పటికే 234 టీఎంసీల వరద జలాలు వచ్చాయి. రబీ పంటలకు భరోసా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలో ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఆయకట్టు ఉంది. స్టేజ్ –1 పరిధిలో 9.68 లక్షల ఆయకట్టు ఉండగా, స్టేజ్–2లో మరో ఐదు లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో ఖరీఫ్ పంటలతో పాటు రబీ పంటలకు కూడా సాగునీరందనుంది. దీంతో ఆయకట్టు రైతులకు భరోసా ఏర్పడింది. -
ఉరికొస్తూ... ఊపిరిలూదుతూ...
సాక్షి, హైదరాబాద్: విస్తారంగా వర్షాలు.. పరవళ్లు తొక్కుతున్న ప్రవాహాలు.. నిండుకుండల్లా ప్రాజెక్టులు.. ఇదీ ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తున్న తాజా దృశ్యం. ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహాలు బిరబిరా వస్తూ సాగునీటి ప్రాజెక్టులకు కొత్త ఊపిరిలూదాయి. ఇప్పటికే కృష్ణా బేసిన్లో ఆల్మట్టి నుంచి పులిచింతల వరకు అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయగా, గోదావరిలో సింగూరు, నిజాంసాగర్ మినహా అన్ని ప్రాజెక్టుల గేట్లు తెరుచుకుంటున్నాయి. ఇప్పటికే లోయర్ మానేరు, మిడ్‌మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తేశారు. రెండు, మూడు రోజుల్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లు తెరుచుకునే అవకాశాలున్నాయి. నిండేందుకు సిద్ధంగా ఎస్సారెస్పీ... ఎగువ నుంచి స్థిరంగా ప్రవాహాలు వస్తుండటంతో ఎస్సారెస్పీ జలకళ సంతరించుకుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 90.31 టీఎంసీలకుగానూ 78 టీఎంసీల మేర నీటి నిల్వలున్నాయి. ఆదివారం ఉదయం 52 వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు కొనసాగగా, అది మధ్యాహ్నానికి 18 వేల క్యూసెక్కులకు తగ్గింది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు అనుగుణంగా, నీటి ప్రవాహాల్లో హెచ్చుతగ్గులున్నాయి. 23 నుంచి బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి ఏర్పడుతున్న నేపథ్యంలో విస్తారంగా వానలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ ప్రవాహాలు పుంజుకుంటే రెండు, మూడు రోజుల్లో ప్రాజెక్టు నిండొచ్చని భావిస్తున్నారు. 90 టీఎంసీలకు గానూ 85 టీఎంసీల మేర నీరు చేరిన వెంటనే గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తామని ఇంజనీర్లు చెబుతున్నారు. బోసిపోయిన సింగూరు, నిజాంసాగర్... అన్ని ప్రాజెక్టులకు భిన్నంగా సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టులు దర్శనమిస్తున్నాయి. అవి పూర్తిగా బోసిపోయి కనిపిస్తున్నాయి. సింగూరులో 29.91 టీఎంసీలకు కేవలం 2.81 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. స్థానిక పరీవాహకం నుంచి 1,122 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఈ సీజన్లో ఇంతవరకు కేవలం 2.80 టీఎంసీల మేర మాత్రమే కొత్తనీరు వచ్చి చేరింది. నిజాంసాగర్‌లో 17.80 టీఎంసీలకు కేవలం 1.72 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం 2 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఈ సీజన్లో కొత్తగా వచ్చి చేరిన నీరు కేవలం ఒక టీఎంసీ మాత్రమే. ఈ రెండు ప్రాజెక్టుల్లో ప్రస్తుతం 4.50 టీఎంసీల లభ్యత ఉంటే అందులో కొత్తగా వచ్చింది 3.80 టీఎంసీలు. గత ఏడాదితో పోలిస్తే ప్రాజెక్టులో 4 టీఎంసీల మేర అధికంగా నిల్వ ఉంది. వచ్చే సెప్టెంబర్‌లో భారీ తుఫాన్లు వస్తే ఈ ప్రాజెక్టుల్లోకి భారీ ప్రవాహాలు వస్తాయేమోనని ఇంజనీర్లు ఆశాభావంతో ఉన్నారు. -
శ్రీనివాస్ ఘటనపై స్పందించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : కారుతో సహా వాగులో గల్లంతైన టీఆర్ఎస్ నేత జంగపల్లి శ్రీనివాస్ ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో ఫోన్లో మాట్లాడిన మంత్రి.. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జంగపల్లి శ్రీనివాస్, నిన్న రాత్రి ముగ్గురు స్నేహితులతో కలిసి వాహనంలో వెళ్తుండగా.. సిద్దిపేట జిల్లా దర్గాపల్లి వద్ద వాహనంతో సహా వాగులో పడిపోయారు. స్థానికులు వెంటనే గమనించి ముగ్గురిని బయటకు తీయగా... కారుతో పాటు శ్రీనివాస్ గల్లంతయ్యాడు. (చదవండి : మూసీలో చిక్కుకున్న యువకులు) విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్.. సోమవారం ఉదయాన్నే సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో సిద్ధిపేట ఆర్డీవో ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. -
కృష్ణమ్మ పరుగులు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరుగు లు పెడుతోంది. ఎగువ నుంచి శనివారం సాయంత్రం 98,975 క్యూసెక్కులు చేరుతుండగా రాత్రి 12 గంటలకు ఇది రెండు లక్షల క్యూసెక్కులకు పెరుగుతుందని అధికారవర్గాలు తెలిపాయి. ఈ దఫా వరదకు శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నిండవచ్చని అంచనా వేస్తున్నాయి. ► పశ్చిమ కనుమల్లో ప్రధానంగా కృష్ణా, ఉపనదుల పరీవాహక ప్రాంతాల్లో నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం సగటున 72 మి.మీ.ల వర్షపాతం పడింది. దాంతో కృష్ణా, ఉపనదుల్లో గంట గంటకూ వరద పెరుగుతోంది. ► ఆల్మట్టిలోకి వరద పెరుగుతుండటంతో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) సూచనల మేరకు డ్యామ్ నీటినిల్వలను ఖాళీ చేసి దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్‌లోనూ అదే పరిస్థితి. దాంతో జూరాలకు భారీగా వరద చేరుతోంది. జూరాల వరదను దిగువకు వదులుతున్నారు. ► శ్రీశైలం ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు జలాలు విడుదల చేస్తుండటంతో నాగార్జునసాగర్ నీటిమట్టం 558.20 అడుగులకు చేరుకుంది. ► అప్పర్ తుంగ, భద్ర డ్యామ్, సింగటలూరు బ్యారేజీ నుంచి భారీ వరదను దిగువకు వదులుతుండటంతో తుంగభద్రలోకి వరద ప్రవాహం పెరుగుతోంది. ► పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం, ఉపనదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు, కిన్నెరసాని నుంచి నీటి ప్రవాహం చేరుతుండటంతో గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 1.17 లక్షల క్యూసెక్కులు చేరుతుం డగా 7 వేల క్యూసెక్కులు డెల్టాకు, మిగిలిన 1.11 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. -
‘శ్రీశైలం’లోకి బిరబిరా కృష్ణమ్మ
సాక్షి, హైదరాబాద్ : శ్రీశైలం జలాశయంలోకి వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. శనివారం సాయంత్రం ఆరుగంటలకు 89,731 క్యూసెక్కులు వస్తుండటంతో నీటిమట్టం 838.8 అడుగులకు, నిల్వ 60.10 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు, నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు. ►పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాల వల్ల ఎగువన కృష్ణా నదిలో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ►ఆల్మట్టి డ్యాంలోకి 36,186 క్యూసెక్కులు చేరుతుండగా, విద్యుత్కేంద్రం ద్వారా 45 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ►నారాయణపూర్ డ్యాంలోకి 43, 570 క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్‌వే, విద్యుత్కేం ద్రం ద్వారా 45 వేల క్యూ.లను దిగువకు వదులుతున్నారు. ►జూరాల ప్రాజెక్టులోకి 86,280 క్యూసెక్కులు చేరతుండగా.. స్పిల్ వే ఏడు గేట్లు, విద్యుత్కేంద్రం ద్వారా 84 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ►జూరాల నుంచి వస్తున్న జలాలకు హంద్రీ, తుంగభద్ర జలాలు జతకలవడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 89,731 క్యూసెక్కులు చేరుతున్నాయి. ►పులిచింతలకు దిగువన కృష్ణా నదిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీలోకి 17,409 క్యూసెక్కులు చేరుతుండగా కృష్ణా డెల్టా కాలువలకు 4,502 క్యూసెక్కులు, సముద్రంలోకి 12,907 క్యూసెక్కులను వదులుతున్నారు. -
శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ఉధృతి
సాక్షి,కర్నూలు: ఎగువ పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. 49,895 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తున్నట్టు అధికారులు తెలిపారు. జురాల ప్రాజెక్టు నుంచి 48,795 క్యూసెక్కులు, హంద్రీనీవా నుంచి 1100 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 815.50 అడుగులుగా ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 37.6570 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. అదేవిధంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల జలాశయానికి 60వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 318.440 మీటర్లకు చేరింది. జూరాల నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ9.500 టీఎంసీలుగా ఉంది. దీంతో జూరాల జలాశయం నుంచి 55 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. చదవండి: శ్రీశైలం చేరిన కృష్ణమ్మ! -
రేపు జూరాలకు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత వాటర్ ఇయర్లో తొలిసారి ఎగువ ప్రాజెక్టుల నుంచి దిగువకు కృష్ణా నదీ ప్రవాహాలు మొదలయ్యాయి. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్‌కు నీటి ప్రవాహాలు పెరుగుతున్న దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం నారాయణపూర్ డ్యామ్ రెండు గేట్లను ఎత్తి నదిలోకి నీటిని వదిలిపెడుతోంది. ఈ నీరంతా దిగువన జూరాల వైపుగా తన ప్రయాణం మొదలు పెట్టగా, మంగళవారానికి నీరు జూరాలకు చేరే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. దిగువకు పరుగు... గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కర్ణాటక, మహారాష్ట్రలో వాగులు, వంకలన్నీ ఉప్పొంగుతున్నాయి. దీంతో ఆల్మట్టి ప్రాజెక్టులో వరద పెరిగింది. ఆదివారం ప్రాజెక్టులోకి 69,868 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో ప్రాజెక్టులో నిల్వ 129 టీఎంసీలకు 98 టీఎంసీలు చేరింది. ఇప్పటివరకు ప్రాజెక్టులోకి కొత్తగా 78 టీఎంసీల నీరు వచ్చింది. ప్రాజెక్టులో మరో 31 టీఎంసీల మేర ఖాళీ ఉన్నప్పటికీ ఎగువ నుంచి ప్రవాహాలు మరో వారంపాటు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రాజెక్టు నుంచి 36,130 క్యూసెక్కుల నీటిని పవర్‌హౌస్‌ల ద్వారా దిగువకు వదులుతున్నారు. దీంతో నారాయణపూర్‌లోకి ప్రవాహాలు మరింత పెరిగాయి. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 39,720 క్యూసెక్కుల నీరు వస్తోంది. అందులో నీటి నిల్వ 37.64 టీఎంసీలకుగాను 33.47 టీఎంసీలు ఉంది. మొత్తంగా ఆల్మట్టి, నారాయణపూర్‌లలో 35 టీఎంసీల మేర నిల్వలు ఖాళీగా ఉన్నప్పటికీ ఎగువ నుంచి ప్రవాహాలు కొనసాగే అవకాశాలు ఉండటంతో నారాయణపూర్ రెండు గేట్లను ఒక మీటర్ మేర ఎత్తి ఆదివారం ఉదయం 11,240 క్యూసెక్కుల నీటిని నదిలోకి వదిలారు. సాయంత్రానికి నీటి విడుదలను 26 వేల క్యూసెక్కులకు పెంచారు. ఈ నీరంతా కర్ణాటకలోనే ఉన్న గూగుల్, గిరిజాపూర్ బ్యారేజీలను దాటుకుంటూ మంగళవారం నాటికి జూరాలకు చేరే అవకాశం ఉంది. జూరాలకు ఇప్పటికే స్థానిక పరీవాహకం నుంచి 4,140 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో ఇక్కడ నిల్వ 9.66 టీఎంసీలకుగాను 8.10 టీఎంసీలు ఉన్నాయి. జూరాల నుంచి నెట్టెంపాడు, భీమా ద్వారా 1,445 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఎగువ నుంచి ప్రవాహాలు పెరిగే అవకాశాల నేపథ్యంలో సోమ లేదా మంగళవారం నుంచి పవర్‌హౌస్ ద్వారా నీటిని దిగువనున్న శ్రీశైలానికి వదిలే అవకాశం ఉందని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. ప్రవాహాలు మరింత ఉధృతంగా ఉంటే జూరాల గేట్లను ఎత్తే అవకాశం ఉంది. ఇక శ్రీశైలానికి 2,557 క్యూసెక్కుల ప్రవాహాలు వస్తుండగా నీటి నిల్వ 215 టీఎంసీలకుగాను 37.25 టీఎంసీలుగా ఉంది. నాగార్జున సాగర్‌కు 1,202 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 312 టీఎంసీలకుగాను 168.35 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గోదావరి బేసిన్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 11,102 క్యూసెక్కుల మేర ప్రవాహాలు పెరిగాయి. ప్రాజెక్టులో నీటి నిల్వ 90 టీఎంసీలకుగాను 33.60 టీఎంసీలుగా ఉంది. -
వారంలో దిగువకు కృష్ణమ్మ!
సాక్షి, హైదరాబాద్: ఎగువ మహారాష్ట్ర, కర్ణాటకల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలు దిగువ రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో కొత్త ఆశలు నింపుతున్నాయి. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు నిండుతుండటం దిగువన ఉన్న ప్రాజెక్టులకు ఊరటనిస్తోంది. ఆల్మట్టిలోకి రోజురోజుకూ ప్రవాహాలు పెరుగుతుండగా, నారాయణపూర్ దాదాపుగా నిండేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం కొనసాగుతున్న మాదిరే ఆల్మట్టి, నారాయణపూర్‌లకు ప్రవాహాలు కొనసాగితే మరోవారంలోనే జూరాలకు భారీ ప్రవాహాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నెల 20కి ముందే దిగువకు.. ఆల్మట్టి ప్రాజెక్టులోకి శుక్రవారం 50 వేల క్యూసెక్కుల ప్రవాహాలు నమోదుకాగా, శనివారం 73,791 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో ప్రాజెక్టుల నీటి నిల్వ 129 టీఎంసీలకుగాను 95 టీఎంసీలను దాటింది. దీంతో 21,130 క్యూసెక్కుల నీటిని పవర్‌హౌస్ ద్వారా దిగువన నారాయణపూర్‌కు వదిలేస్తున్నారు. ప్రాజెక్టులో మరో 35 టీఎంసీల నీరు చేరితే ప్రాజెక్టు నిండుకుండను తలపించనుంది. దీనికి మరో ఐదారు రోజులు పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత గేట్లెత్తి దిగువకు నీటివిడుదల చేయనున్నారు. నారాయణపూర్‌లోకి ఎగువ ప్రవాహానికి తోడు స్థానిక ప్రవాహాలు కలిపి 27,756 క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 37.64 టీఎంసీలకు గానూ 32 టీఎంసీల నిల్వలున్నాయి. ఎగువ ప్రవాహాలను దృష్టిలో పెట్టుకొని రెండు, మూడు టీఎంసీల నిల్వల మేర ఖాళీ పెట్టి దిగువకు నీటివిడుదల చేయనున్నారు. అయితే ఆల్మట్టిలో మరో 30 టీఎంసీల నీరు చేరాక దిగువ నారాయణపూర్ ద్వారా జూరాలకు నీటి విడుదల చేసే అవకాశాలున్నాయని, దీనికి మరో వారం పట్టవచ్చని, ఈ నెల 20కి ముందే దిగువకు నీటి విడుదల ఉండొచ్చని నీటిపారుదల శాఖ వర్గాలు అం చనా వేస్తున్నాయి. తుంగభద్రకు 34,374 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో మొత్తం 100 టీఎంసీలకుగానూ 20 టీఎంసీల నిల్వ ఉంది. జూరాలకు 1,037 క్యూసెక్కుల నీరు వస్తుండగా, నిల్వ 9.66 టీఎంసీలకుగానూ 7.78 టీఎంసీలుగా ఉంది. భీమా, నెట్టెంపాడుల ద్వారా 1,488 క్యూసెక్కుల మేర నీటిని పంపింగ్ చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజె క్టుకు సైతం స్థానికంగా 3,179 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో 215 టీఎంసీలకు గానూ 37.20 టీఎంసీల నిల్వ ఉంది. నాగార్జునసాగర్‌లోకి 1,668 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, పూర్తి నిల్వ 312 టీఎంసీలకు గాను 168.40 టీఎంసీలుగా ఉంది -
ఆల్మట్టికి పోటెత్తిన కృష్ణమ్మ
సాక్షి, హైదరాబాద్: కృష్ణాకు ఎగువన వర్షం, దిగువన హర్షం.. చినుకు చినుకుకు ఆశలు చిగురిస్తున్నాయి. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంటే పరీవాహకం పరవశిస్తోంది. ప్రవాహాలు పెరిగినకొద్దీ దిగువ ప్రాజెక్టుల్లో నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి. మహా రాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో కృష్ణా ఎగువన ఉన్న ఆల్మట్టికి రోజురోజుకూ వరద ఉధృతి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆల్మట్టి నుంచి విద్యుదుత్పత్తి ద్వారా దిగువకు నీటి విడుదలను కర్ణాటక మొదలు పెట్టింది. మరో 50 టీఎంసీలు చేరితే దిగువకు... పశ్చిమ కనుమల్లో 3, 4 రోజులుగా 20 సెంటీమీటర్లకుపైగా వర్షాలు కురుస్తుండటంతో ఆల్మట్టిలోకి ప్రవాహాలు పుంజుకుంటున్నా యి. గురువారం ప్రాజెక్టులోకి 49,636 క్యూ సెక్కుల ప్రవాహాలు రాగా, ఇవి సాయం త్రానికి 52 వేల క్యూసెక్కులకు పెరిగినట్లు కేంద్ర జలసంఘం అధికారులు చెబుతున్నా రు. ప్రస్తుతం ఆల్మట్టిలో 129 టీఎంసీలకు 85 టీఎంసీల నిల్వ ఉంది. ఈ సీజన్లో 60 టీఎంసీల కొత్త నీరు వచ్చి చేరింది. ఎగువ నుంచి ప్రవాహాలు ఇంకా పెరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో ఆల్మట్టిలో విద్యుదుత్పత్తిని కర్ణాటక ఆరంభించింది. విద్యుదుత్పత్తి ద్వారా 10,088 క్యూసెక్కుల నీటిని పవర్‌హౌస్‌ల ద్వారా విడుదల చేస్తోంది. మరో 45 టీఎంసీలు చేరితే గేట్లెత్తి ప్రాజెక్టు నుంచి దిగువకు ఎక్కువ పరిమాణంలో నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ఆల్మ ట్టి నుంచి నీటి విడుదలతో దిగువన నారాయణపూర్‌లోకి 10 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ఇక్కడ ప్రస్తుతం 37 టీఎంసీలకుగానూ 26.50 టీఎంసీల నీరునిల్వ ఉంది. మరో 5 టీఎంసీల నీరు చేరిన వెంటనే దిగువన జూరాల ప్రాజెక్టుకు నీటిని విడుద ల చేసే అవకాశం ఉంది. ప్రవాహాలు ఇదే రీతిన కొనసాగితే ఈ నెల మూడోవారం నుంచి జూరాలకు నీటిని విడుదల చేయొచ్చని నీటి పారుదల శాఖ అంచనా. ప్రస్తుతం జూరాలలో నీటి నిల్వ 9.66 టీఎంసీలకుగానూ 7.80 టీఎంసీలకు చేరింది. ఫలితంగా నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టుల పంపు ల ద్వారా 1,466 క్యూసెక్కుల నీటిని పం పింగ్ చేస్తున్నారు. తుంగభద్ర జలాశయానికి 16,211 క్యూసెక్కుల మేర నీరు వస్తుం డగా, నిల్వ 100 టీఎంసీలకుగానూ 14 టీ ఎంసీలకు చేరింది. ఉజ్జయిని నదిలోకి 4,587 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో ఇ క్కడ నిల్వ 117 టీఎంసీలకుగానూ 60 టీ ఎంసీలకు చేరింది. ఇక స్థానిక పరీవాహకం నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 669 క్యూసెక్కు ల ప్రవాహం వస్తోంది. అక్కడ నిల్వ 215 టీఎంసీలకుగానూ 36.50 టీఎంసీలు ఉం ది. నాగార్జునసాగర్‌లోకి 1,280 క్యూసెక్కు ల ప్రవాహాలు వస్తుండగా, నిల్వ 312 టీఎంసీలకు 168.54 టీఎంసీలు ఉంది. -
‘కొండపోచమ్మ’ కాల్వకు భారీ గండి
సాక్షి సిద్దిపేట/గజ్వేల్: కొండపోచమ్మ సాగర్ కాల్వల నిర్మాణంలో డొల్లతనం మరోసారి బయటపడింది. ఇటీవల గజ్వేల్ మండలం కొడకండ్ల హెడ్ రెగ్యులేటరీ వద్ద, మర్కుక్ పంప్‌హౌస్ వద్ద సిమెంట్ లైనింగ్ దెబ్బతినడం, కొండపాక మండలం ఎర్రవల్లి వద్ద కాల్వలు దెబ్బతిన్న ఘటనలు మరువకముందే తాజాగా మంగళవారం మర్కుక్ మండలం శివారు వెంకటాపూర్‌లో కాల్వకు భారీ గండి పడింది. దీంతో నీళ్లన్నీ పంట పొలాలు, ఇళ్లలోకి చేరాయి. ఈ హఠాత్పరిణామం వల్ల గ్రామస్తులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అలాగే.. 30 ఎకరాలకుపైగా పంట నష్టం వాటిల్లింది. వానాకాలం సమీపించే వరకు కాల్వల ద్వారా నీరు వదలాలనే ఉద్దేశంతో వేగంగా పనులు చేయడం.. పనుల్లో నాణ్యత లోపించడం.. సిమెంట్ లైనింగ్ సక్రమంగా చేయకపోవడం.. కాల్వల కోసం పోసిన కట్టలను గట్టిపడే వరకు తొక్కించకపోవడం, సరిగా చదును చేయకపోవడంతో కాల్వల నిర్మాణాల్లో నాణ్యత లోపించింది. దీంతో ఇప్పటివరకు మొత్తం మూడు చోట్ల గండ్లు పడ్డాయి. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నుంచి జగదేవ్‌పూర్ కాల్వకు రిజర్వాయర్ నుంచి 3.5 కిలోమీటర్ల కాల్వ మేడ్చల్ జిల్లా తుర్కపల్లి వద్ద కలుస్తుంది. ఇక్కడ జగదేవ్‌పూర్, తుర్కపల్లి కాల్వలు పాయలుగా విడిపోతాయి. జగదేవ్‌పూర్ కాల్వ శివారు వెంకటాపూర్ నుంచి తీగుల్ వైపు వెళ్తుంది. ఈ కాల్వలను జూన్ 24న ప్రారంభించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం 6.30 గంటలకు శివారు వెంకటాపూర్ వద్ద మొల్లోనికుంట సమీపంలోని కాల్వ ప్రదేశంలో భారీ గండి పడింది. దీంతో కాల్వ కింది భాగంలో ఉన్న కల్వర్టు ద్వారా మొల్లోని కుంటలోకి భారీ ప్రవాహం, మరో ప్రవాహం గ్రామంలోకి వెళ్లింది. దీని వల్ల 30 ఎకరాల్లో మిర్చి, టమాట, పత్తి, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. మరోవైపు గ్రామంలోని పలువురి ఇళ్లలోకి నీరు చేరింది. టీవీలు, వంట సామగ్రి, బియ్యం, బట్టలు, ఇతర విలువైన వస్తువులు తడిసిపోయాయి. పలు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఏం జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొన్నది. సమాచారం అందుకున్న నీటిపారుదల శాఖ ఈఎన్సీ హరేరామ్, ఎస్ఈ వేణు, ఈఈ బద్రినారాయణ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు నీటిపారుదల శాఖ అధికారులు ముందుగా కాల్వ ప్రవాహాన్ని ఆపడానికి రిజర్వాయర్ వద్ద గేట్లను మూసేశారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ప్రవాహం పెరగడం వల్లే గండి 295 క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన జగదేవ్‌పూర్ కాలువలో ప్రవాహం పెరగడం వల్లే భారీ గండి ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు. కాల్వ నుంచి నీటిని చెరువుల్లోకి పంపడం ఇటీవల మొదలైంది. కొత్త కావడం వల్ల నిజానికి ఈ కాలువలో 195 క్యూసెక్కులకు మించి ప్రవాహం ఉండకూడదని చెబుతున్నారు. కానీ సోమవారం రాత్రి నుంచి ఎక్కువ సామర్థ్యంలో నీటిని వదిలారని తెలిసింది. దీని వల్ల గండ్లు ఏర్పడి మొల్లోని కుంటలోకి కొంత, గ్రామంలోకి మరో 30 క్యూసెక్కులకు పైగా నీటి ప్రవాహం వచ్చినట్లు చెబుతున్నారు. రాత్రి పూట గనుక ఈ గండ్లు పడి ఉంటే నిద్రావస్థలో ఉన్న జనంపైకి నీరు వేగంగా వచ్చి.. ప్రాణ నష్టం సంభవించేదని పలువురు అభిప్రాయపడ్డారు. కాగా, నీటిపారుదల శాఖ ఈఎన్సీ దగ్గరుండి జేసీబీ, ఇతర యంత్రాలతో గండ్లను పూడ్చి వేయించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ఇలాంటివి సహజం: నీటిపారుదల శాఖ ఈఎన్సీ హరేరామ్ ప్రాజెక్టుల నిర్మాణం, కాల్వల ద్వారా చెరువుల్లోకి నీళ్లు పంపే సందర్భాల్లో గండ్లు పడటం సహజంగా జరుగుతుంటాయని, దీనిని నాణ్యత లోపం, ఇంజనీర్ల వైఫల్యం అని నిరు త్సాహపర్చవద్దని నీటిపారుదల శాఖ ఈఎన్సీ హరేరామ్ అన్నారు. మంగళవారం సాయంత్రం కొండపోచమ్మ సాగర్ జగదేవ్‌పూర్ కాల్వ గండి పడిన శివారు వెంకటాపూర్ వద్ద విలేకరులతో మాట్లాడారు. మేడిగడ్డలో 88 మీటర్ల ఎత్తు నుంచి 10 పంప్‌హౌస్‌లను దాటుకుంటూ కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ వరకు 618 మీటర్ల ఎత్తుకు విజయవంతంగా గోదావరి జలాలను తీసుకురాగలిగామని పేర్కొన్నారు. ఈ మహత్తర ప్రాజెక్టుల నిర్మాణంలో ఇంజనీర్లు రాత్రిపగలు అలుపెరగకుండా శ్రమించారని గుర్తు చేశారు. కొత్త ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేసే సందర్భంలో, కాల్వల ద్వారా చెరువులకు నీళ్లను పంపే సందర్భంలో సహజంగా ఇలాంటి చిన్నచిన్న లోపాలు బయటపడుతాయని పేర్కొన్నారు. తాము ప్రస్తుతం జగదేవ్‌పూర్ కాల్వలో నీటి ప్రవాహం ఏవిధంగా ఉందనే అంశంపైనే ట్రయల్ రన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. శివారు వెంకటాపూర్ వద్ద కాలువ పక్కన మట్టి వర్షానికి లూజుగా మారి సిమెంట్ లైనింగ్ దెబ్బతినడం చోటుచేసుకుందన్నారు. దీని వల్లే గండి ఏర్పడిందని చెప్పారు. పక్కనే బైపాస్ రోడ్డు ఉండటం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. ఈనెల 11న అర్ధరాత్రి ఎర్రవల్లి, కొడకండ్ల వద్ద కాలువలు దెబ్బతినడంలోనూ చిన్న లోపాలు బయటపడ్డాయని చెప్పారు. ఆ రోజు 220 మిల్లీమీటర్ల వర్షం కురవడం వల్ల నీటి ప్రవాహం పెరిగి అలా జరిగిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కొండపోచమ్మ సాగర్ కాల్వల ద్వారా నీటిని పంపే సమయంలో తాము పది, పన్నెండు చోట్ల చిన్నచిన్న సమస్యలు వస్తాయని ముందే ఊహించామని, కానీ ఒకటి, రెండు చిన్న సమస్యలతోనే బయట పడగలిగామని స్పష్టం చేశారు. దీన్ని పెద్దదిగా చూపి ప్రజలను భయాందోళనలకు గురిచేయవద్దని కోరారు. -
కొండ అంచులకు చేరిన నీరు
-
అద్భుత దృశ్యం.. గాలిలో చిక్కుకున్న నీరు..!
కోపెన్హాగన్: నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు అనే సామెత తెలిసే ఉంటుంది. అయితే, డెన్మార్క్‌లోని ఫారో ఐలాండ్స్‌లో మాత్రం దీనికి విరుద్ధమైన సన్నివేశమొకటి వెలుగు చూసింది. సముద్రపు అలల నుంచి నీరు అంతెత్తుతున్న కొండపైకి ప్రవహించింది. గురుత్వాకర్షణ బలానికి వ్యతిరేకంగా పనిచేసిన ఈ దృశ్యాన్ని జాకొబ్సేన్ అనే వ్యక్తి గత సోమవారం కెమెరాలో బంధించాడు. సుడిగాలితో పాటు కొండ అంచులకు చేరుతున్న నీటి ప్రవాహపు వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ విశేషంపై వాతావరణ నిపుణులు మాట్లాడుతూ.. ‘టోర్నడోలు ఏర్పడే క్రమంలో నలువైపులా ఒత్తిడికి గురైన గాలి భూమిపై ఉన్న చెత్త చెదారంతో గొట్టంలా మారి విధ్వంసం సృష్టిస్తుంది. అతి వేగంగా కదులుతూ సుమారు మేఘాలను తాకేటంత ఎత్తులో విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. తాజా ఘటన కూడా ఈ కోవలోకి చెందినదే. టోర్నడో మాదిరిగానే ఇక్కడ గాలి గొట్టం ఏర్పడింది. అయితే, దానిలో వస్తువులు, చెత్తా చెదారం బదులు నీరు చేరింది. పక్కనే ఎత్తయిన కొండ ఉండటంతో అదే వేగంతో నీరు పైకి ప్రవహించింది. సాధారణంగా నీటితో ఏర్పడే గాలి గొట్టాలను నీటి చిమ్ములు అంటాం. అవి కాస్త ఎత్తు వరకు కదిలి బలహీనమవుతాయి. ఫారో ఐలాండ్స్‌లో బయటపడిన నీటి ప్రవాహాం సంఘటన మాత్రం అద్భుతమైందే..!’అని అన్నారు. -
సరళాసాగర్‌కు గండి!
సాక్షి, నాగర్‌కర్నూల్/వనపర్తి: అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం కారణంగా సరళాసాగర్ ప్రాజెక్టుకు మంగళవారం ఉదయం భారీగా గండి పడింది. దీంతో 0.5 టీఎంసీల నీరు రామన్‌పాడు జలాశయానికి చేరింది. అక్కడ క్రస్టుగేట్లు ఎత్తడంతో ఊకచెట్టు వాగు నుంచి తిరిగి కృష్ణా నదిలోకి నీరు చేరింది. ఇటీవల భీమా, కేఎల్ఐ ప్రాజెక్టుల ద్వారా సరళాసాగర్‌లో గరిష్ట స్థాయి నీటిని నిల్వ చేశారు. అయితే ఆయకట్టుకు నీటి విడుదలలో జాప్యం, ప్రాజెక్టుపై అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా గండి పడింది. విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కలెక్టర్ శ్వేతా మహంతి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్పీ అపూర్వరావు తదితరులు ప్రాజెక్టు వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సీఎం ఆదేశాలతో కదిలిన యంత్రాంగం సరళాసాగర్‌కు గండి పడిన విషయాన్ని తెలుసుకున్న సీఎం కేసీఆర్.. ప్రాజెక్టును పరిశీలించాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మైనర్ ఇరిగేషన్ సీఈ అమీద్‌ఖాన్, ఉమ్మడి మహబూబ్‌నగర్ ప్రాజెక్టుల సీఈ అనంతరెడ్డి గండిపడిన ప్రాంతానికి వెళ్లి పునర్నిర్మాణానికి సర్వే చేపట్టారు. ప్రాజెక్టుకు మరమ్మతులు, స్థాయి పెంపుపై పూర్తిస్థాయి నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని అధికారులు తెలిపారు. ఆసియా ఖండంలోనే తొలి సైఫన్ సిస్టం.. వనపర్తి సంస్థానాన్ని పాలించిన చివరి రాజు, కేంద్ర మాజీ మంత్రి రాజారామేశ్వర్‌రావు తన తల్లి సరళాదేవి పేరున ఆసియా ఖండంలోనే తొలి ఆటోమేటిక్ సైఫన్ సిస్టంతో 1947లో ప్రాజె క్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సుమారు 35 లక్షల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును 1959 లో పూర్తి చేశారు. దీని కింద 4,200 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. 2009లో కురిసిన భారీ వర్షాలకు చివరిసారి సైఫన్లు తెరుచుకున్నా యి. తర్వాత ప్రాజెక్టు గరిష్ట స్థాయికి నీరు చేరుకోలేదు. ఈసారి భీమా, కేఎల్ఐ ప్రాజెక్టుల నుం చి వచ్చిన నీటి ద్వారా సరళాసాగర్ ప్రాజెక్టులో గరిష్ట స్థాయికి నీటిని నింపారు. ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్లే నీరు తక్కువగా.. లోనికొచ్చే నీరు ఎక్కువగా ఉండటం, కొన్నేళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో ఒక్కసారిగా గండి పడింది. 25 ఏళ్లుగా మరమ్మతులు లేవు.. 25 ఏళ్లుగా సరళాసాగర్ ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టలేదని రైతులు ఆరోపించారు. 10రోజుల క్రితమే ఈ ప్రాజెక్టు కట్ట బలహీనంగా ఉందని, వెంటనే మరమ్మతులు చేపట్టా లని నీటి పారుదల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదు. కాగా, ఈ నెల 24న ఆయకట్టుకు నీరివ్వాల్సి ఉండగా.. మండలంలోని ఓ ప్రజాప్రతినిధి అందుబాటులో లేరని అధికారులు గేట్లు తెరవలేదు. ప్రతిపక్ష పార్టీల నాయకులు, రైతులు గొడవ చేయటంతో ఆలస్యంగా 26న కాల్వలకు నీటి విడుదల చేశారు. అయితే సదరు ప్రజాప్రతినిధి ఒత్తిడితో 27న బంద్ చేసి 28 నుంచి ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల నుంచి సాగు నీరు వదిలారు. ఇలా మూడ్రోజుల జాప్యం కారణంగానే గండి పడిందని రైతులు చెబుతున్నారు. ఆయకట్టుకు సాగు నీరిస్తాం.. సరళాసాగర్ ప్రాజెక్టు నిర్దేశిత ఆయకట్టుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సాగునీరు అందిస్తామని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. కేఎల్ఐ పరిధిలోని కొమ్మిరెడ్డిపల్లి వాగు నుంచి ఈ ప్రాజెక్టులోకి వచ్చే నీటిని కుడి, ఎడమ, సమాంతర కాల్వలతో అనుసంధానం చేసి యాసంగి పంటలకు నీరిస్తామని తెలిపారు. -
35 ఏళ్లలో ఏడోసారి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదకు తోడు ఉజ్జయిని, తుంగభద్రల నుంచి కొనసాగుతున్న ప్రవాహాలతో ప్రాజెక్టులోకి 5.40లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ సీజన్లో ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టులోకి ఏకంగా 1,538 టీఎంసీలకు పైగా వరద రావడంగమనార్హం. గడిచిన 35ఏళ్లలో కేవలం ఏడుసార్లు మాత్రమే శ్రీశైలానికి 1,500 టీఎంసీలకు పైగా వరద వచ్చింది. చివరి సారిగా 2007–08లో 1,695 టీఎంసీల మేర వరద రాగా, మొత్తంగా 1994–95లో అధికంగా 2,039 టీఎంసీల మేర వరద వచ్చింది. ప్రస్తుతం ఎగువ ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి స్థిరంగా వరద కొనసాగుతుండటంతో శ్రీశైలానికి మరో పదిరోజుల పాటు వరద కొనసాగే అవకాశాలున్నాయని కేంద్ర జల సంఘం అంచనా వేస్తోంది. ఇక సాగర్‌లోకి ఉధృతంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టులోకి 4.93లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు ఇప్పటికే నిండి ఉండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. ప్రాజెక్టులోకి ఇప్పటికే 1,000 టీఎంసీలకు పైగా వరద రావడం గమనార్హం. ఎల్లంపల్లికి భారీ వరద: ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. స్థానికంగా కురుస్తున్న వర్షాలతో శుక్రవారం ఏకంగా 1.84లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. -
పోటెత్తుతున్న కృష్ణా
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలతో కృష్ణా నది మళ్లీ పోటెత్తుతోంది. గత పది రోజులుగా ప్రవాహాలు తగ్గిపోగా సోమవారం సాయంత్రానికి కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలకు 1.60 లక్షల క్యూసెక్కుల మేర వరద ప్రవాహాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఆ ప్రాజెక్టులు నిండటంతో వచి్చన నీటిని వచి్చనట్లుగా దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్ నుంచి 1.82 లక్షల క్యూసెక్కులను నదిలో వదులుతుండటంతో తుంగభద్ర జలాశయానికి వరద పెరుగుతోంది. 76,468 క్యూసెక్కుల వరద వస్తుండగా 86,166 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఇది మంగళవారానికి జూరాల, శ్రీశైలానికి చేరే అవకాశం ఉంది. సోమవారం సాయంత్రానికి జూరాలలోకి 44 వేలు, శ్రీశైలంలోకి 57,012, సాగర్‌లోకి 48,236 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. కృష్ణా బేసిన్లో ఎగువ మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన వర్షాలతో పదేళ్ల వరద రికార్డు లు బధ్దలయ్యాయి. ఓ పక్క ఎగువ కృష్ణా, మరోపక్క తుంగభద్ర, ఇంకోపక్క ఉజ్జయినీ నదులు ఉప్పొంగడంతో బేసిన్‌లోని శ్రీశైలం, సాగర్, జూరాల ప్రాజెక్టులు ఉప్పొంగాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు గడిచిన పదేళ్లలో 2009–10లో 1,218 టీఎంసీల మేర వరద రాగా ప్రస్తుతం ఏకంగా 1,420 టీఎంసీల మేర వరద వచి్చంది. ప్రాజెక్టు కింద రెండు తెలుగు రాష్ట్రాల నీటి వినియోగం సైతం 130 టీఎంసీలను దాటింది. ఇక జూరాలకు 2010–11లో గరిష్టంగా 787 టీఎంసీల వరద రాగా ఆ మార్కును ఎప్పుడో దాటిపోయింది. ఇక్కడ ఏకంగా 1,190 టీఎంసీల మేర వరద రాగా ప్రస్తుతం వరద స్థిరంగా కొనసాగుతుండటంతో అది మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక సాగర్‌కు సైతం ఈ ఏడాది 968 టీఎంసీల మేర వరద రాగా, అది ఇంకా కొనసాగనుంది. ఈ ప్రాజెక్టుల కింది ఆయకట్టుతో పాటు వీటిపై ఆధారపడి చేపట్టిన కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల కింద కనిష్టంగా 15 లక్షల ఎకరాల ఆయకట్టుకు రబీలోనూ నీరందించే అవకాశం ఏర్పడింది. అప్రమత్తంగా ఉండాలి: కృష్ణా నది పరీవాహకం, దాని ఉప నదుల పరిధిలో రానున్న 72 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున.. శ్రీశైలానికి భారీ వరద పోటెత్తవచ్చని ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర జల సంఘం రాష్ట్రాలకు సూచించింది. -
దివి సీమలో వర్ష బీభత్సం
సాక్షి, అవనిగడ్డ/గుంటూరు: కృష్ణా జిల్లా దివిసీమలో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. అవనిగడ్డలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకూ ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురిసింది. అత్యధికంగా 18.02 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పట్టణమంతా జల దిగ్బంధంలో చిక్కుకోగా.. జన జీవనం స్తంభించింది. పలు ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్టీసీ బస్టాండ్ అన్నీ పూర్తిగా నీటమునిగాయి. డ్రెయిన్లు పొంగి పొర్లడంతో రోడ్లు జలమయం అయ్యాయి. ప్రధాన రహదారిపై మధ్యాహ్నం వరకూ వర్షం నీరు తగ్గకపోవడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆర్టీసీ డిపోలో నాలుగు అడుగుల మేర నీరు చేరింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణం వర్షం నీటితో నిండిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాన డ్రెయిన్లు పొంగి ప్రవహించాయి. మోపిదేవిలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లాలోనూ కుండపోత గుంటూరు జిల్లా అంతటా కుండపోత వర్షాలు కురిశాయి. జిల్లాలోని క్రోసూరులో అత్యధికంగా 12.58 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు సరాసరి 2.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లా క్రోసూరులో చెరువు కట్ట పక్కనున్న చెంచు కాలనీ, బుడగ జంగాల కాలనీ నీటమునిగాయి. పెదకూరపాడు నియోజకవర్గంలో మిర్చి, పత్తి, పసుపు పంటల్లో భారీగా నీరు చేరింది. గుంటూరు రూరల్ మండలం గొర్లవారిపాలెం ప్రధాన రహదారిలో లో–లెవల్ చప్టాపై ఉధృతంగా వరద నీరు ప్రవహించింది. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. స్వర్ణభారతి నగర్, అడవి తక్కెళ్లపాడు, చౌడవరంలోని చండ్ర రాజేశ్వరరావు నగర్, లింగాయపాలెంలోని అల్లూరి సీతారామరాజు నగర్ కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. జిల్లా అంతటా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. -
క్రస్ట్గేట్లపై పాలధారలు..!
ఎగువనుంచి వరద ప్రవాహం పూర్తిగా తగ్గడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లను అధికారులు మూసివేశారు. జలాశయ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఎగిసి పడుతున్న అలలు క్రస్ట్ గేట్లను తాకుతున్నాయి. దీంతో వాటి పైనుంచి కృష్ణమ్మ పాలధారలుగా కిందికి దుముకుతున్న దృశ్యాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. నాగార్జునసాగర్: సాగర్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు ఆగాయి. కృష్ణాపరీవాహక ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటకలలోని పశ్చిమకనుమలలో కురిసిన భారీ వర్షాలకు కృష్ణాబేసిన్‌లోని జలాశయాలన్ని రెండు సార్లు గరిష్టస్థాయి నీటిమట్టాలకు చేరుకున్నాయి. అదనంగా వచ్చిన వరదనంతా అధికారులు దిగువకు విడుదల చేశారు. వర్షాకాలం అక్టోబర్ నెలాఖరు వరకు ఉంటుంది. వరుణుడు కరుణిస్తే మరోసారి గేట్లు ఎత్తే అవకాశాలు ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. ఆరేళ్ల క్రితం అక్టోబర్ మాసంలో స్థానికంగా కురిసిన వర్షాలకు వరదలు వచ్చి జలాశయం పూర్తిస్థాయిలో నిండటంతో క్రస్ట్‌గేట్లెత్తారు. నిండుకుండలా.. శ్రీశైలం నాగార్జునసాగర్ జలాశయాలు గరిష్టస్థాయి నీటిమట్టంతో నిండుకుండలా జలకళను సంతరించుకున్నాయి. సాగర్ జలాశయం ప్రస్తుత నీటిమట్టం 590అడుగులున్నది. 312.0450 టీఎంసీల నీరుంది. క్రస్ట్‌గేట్లమీదనుంచి అలలు దిగువకు దుముకుతూ ధవలకాంతులను పోలి కృష్ణమ్మ తెల్లని నురుగులతో అందాలను ఆరబోస్తోంది. ఎగువనగల శ్రీశైలం జలాశయం నుంచి గడిచిన 24గంటల్లో 1,22,377క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. దిగువకు 1,18,919 క్యూసెక్కులనీటిని విడుదల చేశారు. ప్రస్తుతం సాగర్‌కు 52,827 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా అంతే మోతాదులో విద్యుదుత్పాదన, పంటకాల్వలల ద్వారా నీటిని పంపుతున్నారు. శ్రీశైలం జలాశయం గరిష్టస్థాయి నీటిమట్టం 885.00అడుగులు కాగా ప్రస్తుతం 884.20 అడుగులున్నది. ఎగువనుంచి 98,000క్యూసెక్కులనీరు వచ్చి చేరుతుండగా విద్యుదుత్పాదన కేంద్రాలు పోతిరెడ్డిపాడు ద్వారా 94,578క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. -
ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద
సాక్షి,విజయవాడ : ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ కడలి వైపు పరుగులు పెడుతుంది. ప్రస్తుతం మూడు లక్షల క్యూసెక్కుల ఇన్‌ప్లో నీరు వస్తుండగా, అవుట్ ఫ్లో 2.50 లక్షల క్యుసెక్కులుగా నమోదైంది. సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాల మేరకు బ్యారేజీలోని డెబ్బై గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అపశ్రుతులు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగా, కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశాయానాకి వరద నీరు క్రమంగా తగ్గుముఖం పట్టింది. శ్రీశైలం ప్రాజెక్టులోని 6 క్రస్ట్ గేట్టను ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. పశ్చిమ గోదావరి పోలవరం వద్ద గోదావరి ఉధృత తగ్గి ప్రస్తుత నీటి మట్టం 11.38 మీటర్లుగా నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 19 గ్రామాలు ఇంకా జలదిగ్బందంలోనే కొనసాగుతున్నాయి. -
ప్రకాశం బ్యారేజ్‌కి పోటెత్తుతున్న వరద
సాక్షి, కృష్ణా: ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు... తెలుగు రాష్ట్రాల్లో జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో జిల్లాలోని విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌కి వరద నీళ్లు పోటెత్తుతున్నాయి. వరద నీటి ఇన్ ఫ్లో లక్షా ఇరవై రెండువేల క్యూసెక్కులు, అవుట్ ఫ్లో లక్షా నాలుగువేల క్యూసెక్కులుగా ఉండటంతో బ్యారేజ్‌లోని డెబ్భై గేట్లను అధికారులు ఒక్క అడుగుమేర ఎత్తి నీటిని దిగువకు వదిలారు. బుధవారం ఉదయానికి సుమారు నాలుగు లక్షల క్యూసెక్కుల వరద నీరు బ్యారేజ్‌లోకి రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఎగువ, దిగువ నది పరీవాహక ప్రాంతాలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ అధికారలను ఆదేశించారు. సమారు నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు వస్తే ఎగువప్రాంతంలో ఉన్న రావిరాళ, వేదాద్రి గ్రామాలతో పాటు పలు గ్రామాలు ముంపు గురై రాకపోకపోకలు స్తంభించనున్నాయి. అయితే రావిరాళ, వేదాద్రి గ్రామాలను ఖాళీ చేయించి పునరావాసాలకు తరలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో నాగార్జున సాగర్‌కు వరద నీటి ఉధృతి పెరగడంతో 24 క్రష్ట్ గేట్లు ఎత్తి, సుమారు పది అడుగుల వరకు నీటిని మంగళవారం అధికారులు దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం సాగర్‌కు ఇన్ ఫ్లో 4,13,239 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 4,13,239 క్యూసెక్కులు సమానంగా ఉన్నాయి. సాగర్ జలాశయ గరిష్ట నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589.80 అడుగులు. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీ లు కాగా ప్రస్తుతం 311.14 టీఎంసీలుగా నమోదైంది. కర్నూలు జిల్లా శ్రీశైలంలో గరిష్ట స్థాయి కి చేరుకున్న నీరు క్రష్ట్ గేట్లపై నుంచి ప్రవహిస్తున్నది. దీంతో స్థానికులు, అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం డ్యామ్‌లో నీటి సామర్థ్యం 884.8 అడుగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. శ్రీశైల జలాశయం నుంచి 6 గేట్లు తెరచి దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు అధికారులు నీటిని విడుదల చేశారు. ఇన్ ఫ్లో 3,33,157 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 4,23,373 క్యూసెక్కులుగా ఉంది. డ్యామ్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 215.8450 టీఎంసీలుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. -
గోదావరి ఉగ్రరూపం
-
పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉధృతి
-
పోలవరం వద్ద పెరుగుతున్న గోదావరి ఉధృతి
సాక్షి, పశ్చిమ గోదావరి : పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉధృతి పెరుగుతుంది. ఎగువ నుంచి వరదనీరు ఎక్కువగా ఉండటంతో కాఫర్ డ్యామ్‌కు వెళ్లే అప్రోచ్ రోడ్డు మునిగిపోయింది. అప్రోచ్ రోడ్డుపై నుంచి గోదావరి వరద నీరు ప్రవహిస్తుంది. ప్రాజెక్టు వద్ద 600 మీటర్ల వెడల్పు మేర గోదావరి నీరు ప్రవహిస్తుంది. అక్కడ మొత్తం గోదావరి వెడల్పు 2400 మీటర్లు కాగా, ఇప్పటికే 2200 మీటర్ల మేర నదిని కాఫర్ డ్యామ్ నిర్మాణంతో అధికారులు మూసివేశారు. దీంతో ఖాళీగా కొద్ది భాగం నుంచే వరద నీరు కిందకి వెళుతుంది. -
భారీ వర్షాలతో ఏపీలో పోంగుతున్న వాగులు, నదులు
-
నాగర్జునసాగర్‌కు పెరుగుతున్న వరద ఉధృతి
-
శ్రీశైలానికి తగ్గిన వరద ప్రవాహం
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు ఆగిపోవడంతో పాటు వస్తున్న ప్రవాహాన్ని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లో నిల్వ చేస్తుండటంతో శ్రీశైలంలోకి వచ్చే వరద ప్రవాహం తగ్గిపోయింది. సోమవారం ఉదయం శ్రీశైలం జలాశయంలోకి 55,431 క్యూసెక్కుల ప్రవాహం రాగా అది సాయంత్రానికి 37,196 క్యూసెక్కులకు తగ్గింది. శ్రీశైలం జలాశయం నుంచి కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు 11 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రసుత్తం శ్రీశైలం జలాశయంలో 157.88 టీఎంసీల నీరు నిల్వ ఉన్నాయి. తుంగభద్రలోనూ వరద ప్రవాహం తగ్గుతోంది. తుంగభద్ర జలాశయంలోకి 33,375 క్యూసెక్కులు చేరుతుండగా 26,475 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో 94.61 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. మంగళవారం నుంచి తుంగభద్ర నదిలో వరద మరింత తగ్గనుండటంతో శ్రీశైలంలోకి వచ్చే వరద ప్రవాహం కనిష్ట స్థాయికి చేరనుంది. -
గోదారమ్మకు ఏమైంది?
సాక్షి, అమరావతి: గోదావరిలో వరద ప్రవాహం నిలకడగా లేకపోవడంపై సాగునీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వందేళ్లలో ఎన్నడూ లేని రీతిలో నాలుగేళ్లుగా వరద ప్రవాహం తగ్గడంపై నివ్వెరపోతున్నారు. అక్టోబర్ మూడో వారం నుంచి ఫిబ్రవరి వరకు నదీలో కనీసం 75 నుంచి 80 టీఎంసీల లభ్యత ఉండేది. సీలేరు, డొంకరాయి జలాశయాల్లో నిల్వ ఉన్న నీటితోనే గోదావరి డెల్టాలో రబీ సాగుకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు.నాలుగేళ్లుగా గోదావరి డెల్టాలో ఖరీఫ్ పంటలకు ఎలాంటి ఇబ్బంది లేకున్నా.. రబీ పంటల సాగు సవాల్‌గా మారింది. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు గోదావరిలో 23 నుంచి 25 టీఎంసీల నీటిలభ్యత మాత్రమే ఉండడంతో డెల్టాలో పూర్తిస్థాయిలో పంటలు సాగుచేయలేని దుస్థితి నెలకొంది. పోలవరం పూర్తయితే తప్ప డెల్టాలో పూర్తిస్థాయిలో రబీ పంటల సాగుకు అవకాశం ఉండదని నిపుణులు చెబుతున్నారు. రుతుపవనాలు ప్రవేశించిన ఒకట్రెండు వారాల్లోనే పరివాహక ప్రాంతంలో వర్షాలు పడటం వల్ల గోదావరి నదిలో వరద ప్రారంభమవుతుంది. గోదావరి నదీ జలాలు ధవశేళ్వరం బ్యారేజీ మీదుగా ఏటా సగటున 2,500 నుంచి మూడువేల టీఎంసీలు సముద్రంలో కలిస్తే.. సింహభాగం జూలై నుంచి సెప్టెంబరు వరకు వచ్చే వరద కావడం గమనార్హం. గత నాలుగేళ్లలో 2016–17లో మినహా మిగతా మూడేళ్లలో వరద జలాలు పెద్దగా సముద్రంలో కలవలేదు. నదీ పరీవాహక ప్రాంతంలో సమృద్ధిగా ఏకరీతిలో వర్షాలు కురిస్తే.. వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ..ఊట ద్వారా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు గోదావరి డెల్టాలో రబీ సాగుకు అవసరమైన 83 టీఎంసీలు సహజసిద్ధంగా లభించేవి. సమృద్ధిగా వర్షాలు కురకపోవడం వల్ల అక్టోబర్ నుంచి సహజసిద్ధంగా లభించే జలాలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. నాలుగేళ్లలో ఏ ఒక్క ఏడాది 25 టీఎంసీలకు మించి నీటి లభ్యత లేకపోవడంలో రబీ పంటల సాగు సవాల్‌గా మారింది. సీలేరు, డొంకరాయి జలాశయాల్లోని జలాలతోపాటు డ్రెయిన్ల నుంచి నీటిని ఎత్తిపోసినా పంటలను కాపాడుకోలేని పరిస్థితి ఉంది. సంవత్సరం సముద్రంలో కలిసిన జలాలు(టీఎంసీల్లో) 2008–09 1,819.196 2009–10 742.865 2010–11 4,014.772 2011–12 1,538.065 2012–13 2,968.816 2013–14 5,827.475 2014–15 2,006.205 2015–16 1,611.490 2016–17 2,896.056 2017–18 1,024.978 -
కృష్ణమ్మ ఉరకలు
సాక్షి, హైదరాబాద్ : ఆదిలో దిగాలు పరిచిన కృష్ణమ్మ.. రెండున్నర నెలలు ఆలస్యంగానైనా ఉరకలెత్తుతోంది. కృష్ణా, తుంగభద్ర, బీమా, హంద్రీ పరీవాహకంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా పరీవాహకంలోని జలాశయాలకు వరద ప్రవాహం పెరుగుతోంది. శ్రీశైలం జలాశయానికి శుక్రవారం వరద ఉధృతి పెరిగింది. జలాశయంలోకి 1,83,076 క్యూసెక్కులు చేరుతున్నాయి. బీమా పరీవాహక ప్రాంతం నుంచి దిగువకు వదిలిన 87 వేల క్యూసె క్కులు శనివారం కృష్ణాకు చేరనుండటంతో శ్రీశైలం జలాశయానికి 2 లక్షల క్యూసెక్కులకుపైగా ప్రవాహం చేరుకునే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు అం చనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయం 4 గేట్లు ఎత్తి 1.12 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. కుడి గట్టు విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 107.. ఎడమ గట్టు కేంద్రం ద్వారా 150 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 47 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో.. నాగార్జునసాగర్‌లోకి 1,57,998 క్యూసెక్కుల ప్రవా హం చేరుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 11 వేల క్యూసెక్కులు, హంద్రీనీవా ద్వారా 1,310 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 2,054 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. గతేడాదికన్నా 49 టీఎంసీలు తక్కువ గతేడాది అక్టోబర్ 13 నాటికి శ్రీశైలం జలాశయంలోకి 342.976 టీఎంసీల ప్రవాహం రాగా.. ఈ ఏడాది 293.126 టీఎంసీలు వచ్చాయి. అంటే.. గతేడాదికన్నా 49.850 టీఎంసీలు తక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది. కానీ.. గతేడాది సెప్టెంబర్ ఆఖరు నాటికే కృష్ణాలో ప్రవాహం కనిష్టానికి చేరుకుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో నదికి గరిష్ట వరద ప్రవాహం వస్తోంది. మరో 20 రోజు లు వరద కొనసాగే అవకావం ఉండటంతో గతేడాదితో పోల్చితే ఈ ఏడాది నీటి లభ్యత పెరిగొచ్చని చెబుతున్నారు. గంటగంటకూ పెరుగుతున్న వరద కృష్ణా, బీమా, తుంగభద్ర, హంద్రీ నదుల నుంచి భారీగా నీటి ప్రవాహం వస్తుండటంతో శ్రీశైలం జలాశయంలోకి గంట గంటకూ వరద ఉధృతి పెరుగుతోంది. జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా.. ఇప్పటికే 884.4 అడుగుల్లో 212 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో 534.2 అడుగుల్లో 178.07టీఎంసీల నీరుంది. నాగార్జున సాగర్ నిండాలంటే ఇంకా 135 టీఎంసీలు అవసరం. కృష్ణా, ఉప నదుల నుంచి మరో 15–20 రోజులు ప్రవాహం వచ్చే అవకాశం ఉండటంతో 100 నుంచి 120 టీఎంసీల వరకు నీరొచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నాగార్జున సాగర్ దిగువన కురిసిన వర్షాలకు పులిచింతల ప్రాజెక్టులోకి వరద ప్రవాహం నిలకడగా సాగుతోంది. శుక్రవారం 5,121 క్యూసెక్కులు చేరడంతో.. పులిచింతలలో నీటి నిల్వ 13.47 టీఎంసీలకు చేరుకుంది. అది నిండేందుకు ఇంకా 32.30 టీఎంసీలు అవసరం. సింగూరు గేట్ల ఎత్తివేత పుల్కల్ (అందోల్): ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద ఉధృతితో శుక్రవారం సింగూరు ప్రాజెక్టు నుంచి మూడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. గురువారం రాత్రి నారాయణఖేడ్, జహీరాబాద్‌తో పాటు ఎగువ ప్రాంతంలో కురిసిన కుండపోత వర్షానికి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గురువారం సాయంత్రం వరకు నీటి ఇన్‌ఫ్లో తగ్గడంతో ఎత్తిన గేట్లను మూసివేశారు. శుక్రవారం ఉదయం మళ్లీ ఇన్‌ఫ్లో పెరగటంతో అధికారులు మూడు గేట్లను ఎత్తి 24,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మరోవైపు నిజాంసాగర్ ఆయకట్టు రైతులు నష్టపోకుండా ఉండేందుకు 9 టీఎంసీల నీటిని విడుదల చేయాలని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు సింగూరు నుంచి నిజాంసాగర్‌కు నీటిని విడుదల చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగానే నాలుగు రోజులుగా 1.50 టీఎంసీల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా, లోతట్టు గ్రామాల్లోని పంట పొలాలు పూర్తిగా నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
‘తుంగభద్ర’కు పోటెత్తిన వరద
- 31,303 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో - 67.750 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ హొసపేటె(కర్ణాటక): తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. జలాశయం ఎగువ ప్రాంతాలైన ఆగుంబె, శివమొగ్గ, తీర్థహళ్లి, మొరాళు, మంగళూరు, భద్రావతి తదితర చోట్ల వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దీంతో తుంగభద్ర డ్యాంకు వరద పెరుగుతోంది. శుక్రవారం సుమారు 31,303 క్యూసెక్కుల మేర డ్యాంలోకి నీరు చేరింది. వర్షాభావం నేపథ్యంలో డ్యాం చరిత్రలోనే ఈ ఏడాది జలాశయంలో అతి తక్కువ నీరు నిల్వ ఉంది. అయితే ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో నాలుగైదు రోజులుగా ఇన్‌ఫ్లో పెరుగుతోంది. ఇన్‌ఫ్లో ఇలాగే కొనసాగితే పదిరోజుల్లో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకొనే అవకాశం ఉంది. ప్రస్తుతం డ్యాంలోని నీటిమట్టం 1623.33 అడుగులకు చేరుకోగా, నీటి నిల్వ 67.750 టీఎంసీలకు చేరింది. వివిధ కాలువలకు 2264 క్యూసెక్కుల వరకు మండలి అ«ధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. గత ఏడాది ఇదే సమయానికి డ్యాంలో నీటిమట్టం 1617.06 అడుగులు, నీటి నిల్వ 50.630 టీఎంసీలు, ఇన్‌ఫ్లో 3800 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 10866 క్యూసెక్కులుగా ఉండేదని తుంగభద్ర బోర్డు అధికారులు తెలిపారు. -
హుసేన్ సాగర్‌లో పెరిగిన నీటిమట్టం
హైదరాబాద్: ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరంలోని హుసేన్ సాగర్ జలాశయం నీటిమట్టం పెరిగింది. హూస్సేన్ సాగర్‌లోకి ఇన్ ఫ్లో 1200 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 300 క్యూసెక్కులు ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి హుసేన్ సాగర్ లోకి వర్షపు నీరు ఎక్కువగా చేరుతోంది. హుసేన్ సాగర్ తూము గేట్లను ఇరిగేషన్ అధికారులు ఎత్తివేశారు. రోజంతా జల్లులు పడుతుండగా అప్పుడప్పుడు భారీ వర్షం కురుస్తుంది. పలు ప్రాంతాల్లో రహదారులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అబిడ్స్, జూబ్లిహిల్స్ వంటి పలుచోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. మలక్‌పేట, ఖైరతాబాద్, పంజాగుట్ట, దిల్సుఖ్నగర్ తదితర రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ కూడా స్తంభించింది. -
జూరాలకు జలకళ
8 క్రస్టుగేట్ల ఎత్తివేత లక్ష 18వేల క్యూసెక్కులు విడుదల శ్రీశైలానికి బిరబిరా కష్ణమ్మ జూరాల : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో శనివారం భారీగా వరదనీరు వచ్చి చేరింది. లక్షా 26వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో 8 క్రస్టుగేట్లను తెరచి 84,176 క్యూసెక్కుల వరద నీటిని స్పిల్‌వే ద్వారా విడుదల చేస్తున్నారు. అలాగే విద్యుదుత్పత్తి ద్వారా 32వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. మొత్తం 1,18,756 క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని శ్రీశైలం రిజర్వాయర్‌కు వదులుతున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.41 టీఎంసీల నీటినిల్వ కొనసాగిస్తున్నారు. కోయిల్‌సాగర్‌కు 630 క్యూసెక్కులు, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి 1500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రధాన కాలువలకు 450 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కష్ణానదిపై కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం పూర్తిస్థాయిలో నీటినిల్వను కొనసాగిస్తున్నారు. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో 29,057 క్యూసెక్కులు వస్తుండగా మూడు గేట్లను తెరచి 11,500 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 45వేల క్యూసెక్కులు, మొత్తం 56,500 క్యూసెక్కుల వరద నీటిని నారాయణపూర్‌కు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 32.28 టీఎంసీల నీటినిల్వ ఉంది. రిజర్వాయర్‌కు 52,340 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 9 గేట్లను తెరచి 61,560 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 6వేల క్యూసెక్కులు మొత్తం 67,560 క్యూసెక్కుల వరద నీటిని జూరాల రిజర్వాయర్‌కు విడుదల చేస్తున్నారు. -
‘హుస్సేన్ సాగర్’ను పరిశీలించిన కేటీఆర్
హైదరాబాద్: ప్రమాదస్థాయికి చేరిన హుస్సేన్ సాగర్‌ను మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ శుక్రవారం పరిశీలించారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదకు నగరం నడిబొడ్డులో ఉన్న హుస్సేన్ సాగర్ జలాశయం నిండుకుండను తలపిస్తున్న విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తో కలిసి ఆయన అక్కడ పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం(513 అడుగులు) కొనసాగుతుందని గుర్తించిన మంత్రి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోల గురించి అడిగి తెలుసుకున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కేటీఆర్ సూచించారు. ప్రస్తుతం జలాశయానికి ఇన్‌ఫ్లో 5,700 క్యూసెక్కులుగా ఉండగా.. కాలువల ద్వారా 5,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా గత మూడు రోజులుగా నగరాన్ని వాన ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. -
జూరాలకు 14వేల క్యూసెక్కులు
జూరాల : కృష్ణానది పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు బుధవారం 14వేల క్యూసెక్కుల వరద వచ్చింది. ఈ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటినిల్వ 9.65టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.41టీఎంసీలుగా ఉంది. ఈ ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాలువలకు 450క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 750క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీని నుంచి ఎత్తిపోతల పథకాలు నెట్టెంపాడుకు 1,500క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 630క్యూసెక్కులు, భీమా లిఫ్ట్–1కు 1,300క్యూసెక్కులు, లిఫ్ట్–2 ద్వారా 750క్యూసెక్కులను అధికారులు పంపింగ్ చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి ప్రాజెక్టు పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో వరద పెరిగింది. 56,319క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో ఈ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటినిల్వ 129.72టీఎంసీలు కాగా ప్రస్తుతం 122.83టీఎంసీలుగా ఉంది. విద్యుదుత్పత్తి ద్వారా 45వేల క్యూసెక్కుల నీటిని దిగువ నదిలోకి విడుదల చేస్తున్నారు. ఈ ఇన్‌ఫ్లో వరద శుక్రవారం నాటికి జూరాల ప్రాజెక్టుకు చేరుకునే అవకాశముంది. అలాగే నారాయణపూర్ ప్రాజెక్టుకూ ఇన్‌ఫ్లో పెరిగింది. ప్రస్తుతం 35,908క్యూసెక్కుల వరద వస్తుండగా నీటినిల్వ మట్టాన్ని పెంచుతూ ఆరువేల క్యూసెక్కులను విద్యుదుత్పత్తి ద్వారా జూరాల రిజర్వాయర్‌కు విడుదల చేస్తున్నారు. -
అపార్టుమెంటు సెల్లార్లోకి భారీగా చేరుతున్న నీరు
-
‘మంజీర’ మురిసింది
బోధన్ రూరల్ : రెండుమూడేళ్లుగా వర్షాలు లేక బోసిపోయిన మంజీర నది గురువారం ఉదయం బోధన్ మండలంలోని సాలూర గ్రామ శివార్లో నీటి ప్రవాహంతో కళకళలాడింది. ఉదయం నుంచి నదిలో నీటి ప్రవాహం పెరుగుతూ వస్తోందని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటి వరకు నీటి ప్రవాహం లేకపోవడంతో మంజీర నది ఇసుక, బండరాళ్లతో దర్శనమిచ్చిందని, నాలుగు రోజులుగా స్థానికంగా, ఎగువన కర్ణాటకలో కురుస్తున్న వర్షంతో నదిలో నీరు చేరిందని గ్రామస్తులు పేర్కొన్నారు. నీటి ప్రవాహాన్ని చూసేందుకు నదిపైన గల పాత,కొత్త వంతెనలపై జనాల సందడి నెలకొంది. -
గల్లంతైన ముగ్గురిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం
ప్రత్తిపాడు(గుంటూరు జిల్లా): గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెం గ్రామ శివారులోని వాగులో శనివారం రాత్రి గల్లంతైన ముగ్గురిలో ఇద్దరి మృతదేహాలు ఆదివారం ఉదయం లభ్యమయ్యాయి. మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రత్తిపాడు మండలం చినకోండ్రపాడు గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కూలిపనికి వెళ్లి వస్తూ వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తూ నీటి ప్రవాహం ఉధృతమై ముగ్గురూ గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. -
కృష్ణ పుష్కరాల్లో వెల్లివిరిసిన మత సామరస్యం
-
సాగర్, జూరాలకు కొనసాగుతున్న వరద
మహబూబ్‌నగర్/నల్లగొండ: జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 318.208 అడుగులకు చేరింది. అయితే ఇన్‌ఫ్లో 2,35,000 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 2,53,659 క్యూసెక్కుల నీటిని 13 గేట్లు ఎత్తి అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా నల్లగొండ జిల్లాలో నాగార్జున సాగర్‌కు స్వల్పంగా వరద పెరిగింది. దీని పూర్తిస్థాయి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 506.70 అడుగులకు చేరింది. ఇందులో ఇన్‌ఫ్లో 32, 713 క్యూసెక్కులు నీరు చేరుతుండగా, ఔట్‌ఫ్లో 13,619 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. -
నీటి ఉధృతికి కొట్టుకుపోయిన ఘాట్
-
నీటి ఉధృతికి కొట్టుకుపోయిన ఘాట్
నల్గొండ: నల్గగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ డ్యాం దిగువన నిర్మించిన పుష్కరఘాట్ మంగళవారం రాత్రి నీటి ఉధృతికి కొట్టుకుపోయింది. సాగర్ డ్యాం నుంచి పుష్కర ఘాట్ల కోసం నీటిని విడుదల చేశారు. దీంతో డ్యాం దిగువన శివాలయం వద్ద పుష్కర ఘాట్ కొంత మేర కూలిపోయింది. అదే విధంగా ఘాట్ కోసం ఏర్పాటు చేసిన కంచె కూడా కొట్టుకుపోయింది. -
జూరాలకు కొనసాగుతున్న వరద
జూరాల: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 1.6లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. సోమవారం ఎనిమిది క్రస్టుగేట్లు ఎత్తి 1,14,121 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 47వేల క్యూసెక్కులు విడుదల చేశారు. మొత్తం 1,62,786 క్యూసెక్కుల వరదను జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. జూరాల రిజర్వాయర్ సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.71 టీఎంసీల నీటినిల్వను కొనసాగిస్తున్నారు. కుడి ప్రధాన కాలువ ద్వారా 250 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సమాంతర కాలువ ద్వారా 1300 క్యూసెక్కులు వదులుతున్నారు. భీమా లిఫ్ట్–2 ద్వారా 1500 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్–1 ద్వారా 1300 క్యూసెక్కులను వినియోగిస్తున్నారు. -
గోదావరి పరవళ్లు
3,93,277 క్యూసెక్కుల మిగులు జలాల విడుదల ధవళేశ్వరం : ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నీటి ఉధృతి పెరిగింది. భద్రాచలంలో గురువారం మధ్యాహ్నం వరకూ నీటి ఉధృతి పెరుగుతూ 33 అడుగులకు చేరింది. అక్కడ నుంచి నిలకడగా కొనసాగుతోంది. అంత్య పుష్కరాల నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులూ లేకుండా బ్యారేజ్ నుంచి ఎప్పటికప్పుడు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గురువారం రాత్రి బ్యారేజ్ వద్ద 9 అడుగుల నీటిమట్టం నెలకొంది. బ్యారేజ్‌లోని మొత్తం 175 గేట్లను మీటరు మేర ఎత్తి 3,93,277 క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేశారు. తూర్పు డెల్టాకు 3,300 క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 2 వేల క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 5,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 6.71 మీటర్లు, పేరూరులో 9.10 మీటర్లు, దుమ్ముగూడెంలో 9.50 మీటర్లు, కూనవరంలో 11.62 మీటర్లు, కుంటలో 8.75 మీటర్లు, కొయిదాలో 15.49 మీటర్లు, పోలవరంలో 10.01 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జ్ వద్ద 14.23 మీటర్ల వద్ద నీటిమట్టాలు నెలకొన్నాయి. -
జూరాలకు తగ్గిన ఇన్‌ఫ్లో
ధరూరు: ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో శనివారం తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టుకు ఉదయం 32,270 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరగా రాత్రి 7.30గంటల వరకు 25వేల క్యూసెక్కులకు తగ్గింది. రాత్రి 8గంటల వరకు జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.400 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టులో 9.418 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా 500 క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా 300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సమాంతర కాలువ ద్వారా 1500 క్యూసెక్కులు వదులుతున్నారు. నెట్టెంపాడు లిఫ్ట్ ద్వారా 1500 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ లిఫ్టు ద్వారా 630 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి అనంతరం 16వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి మొత్తం 20,430 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. కొనసాగుతున్న విద్యుదుత్పత్తి జెన్కో జలవిద్యుత్ కేంద్రంలోని ఐదు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేస్తున్న జెన్కో అధికారులు తెలిపారు. ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టడంతో దశల వారిగా ఒక్కో యూనిట్‌ను నిలుపుదల చేస్తూ వచ్చారు. చివరకు రాత్రి 8గంటల వరకు 1, 2 యూనిట్ల విద్యుదుత్పత్తి నిమిత్తం 16వేల క్యూసెక్కుల నీటిని వినియోగించుకొని పూర్తి స్థాయిలో 78 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు జెన్కో అధికారులు చెప్పారు. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసినట్లు తెలిపారు. ఇదిలాఉండగా ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు నీటిమట్టం 36.54 టీఎంసీలుగా ఉంది. ఈ ప్రాజెక్టుకు 4829 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా విద్యుదుత్పత్తి, కెనాల్స్ ద్వారా 4681 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు నీటిమట్టం 128.19 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టుకు 26,889 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 5836 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నట్లు పీజేపీ అధికారులు చెప్పారు. -
గోదావరి వరద తగ్గింది
రాజమండ్రి: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. శుక్రవారం ఉదయానికి బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.8 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చిరికను ఉపసంహరించారు. 8.77 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేశారు. -
గోదావరి ఉధృతి త్వరలో 3వ ప్రమాద హెచ్చరిక
-
గోదావరి ఉధృతి.. త్వరలో 3వ ప్రమాద హెచ్చరిక
భద్రాచలం(ఖమ్మం జిల్లా): ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నదిలో నీటిమట్టం శరవేగంగా పెరుగుతోంది. మంగళవారం ఉదయం 51.04 అడుగులకు నీటి మట్టం చేరింది. 53 అడుగులకు నీటిమట్టం చేరితే అధికారులు 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. భారీ వర్షాలవల్ల రహదారులపై నీళ్లు చేరడంతో భద్రాచలం- వెంకటాపురం, భద్రాచలం- దుమ్ముగూడెం మధ్య రాకపోకలు తెగిపోయాయి. అలాగే వాజేడు, చర్ల, వెంకటాపురం, తురుబాక, రేగుపల్లి తదితర గ్రామాల్లో రోడ్లు నీట మునగటమేకాక, గ్రామాలను సైతం నీళ్లు చుట్టుముట్టాయి. లెక్కలేనన్ని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఇప్పటికే అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తల్పేరుకు పోటెత్తిన వరద.. 13 గేట్లు ఎత్తివేత చర్ల: ఖమ్మం జిల్లా చర్ల మండలంలో ఉన్న తల్పేరుకు వదర పోటెత్తింది. ఫలితంగా మంగళవారం ఉదయం 13 గేట్లు ఎత్తివేశారు. ఇరిగేషన్ అధికారులు 14,500 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలివేశారు. భారీ వర్షాలు కురుస్తున్నందువల్ల పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాకపోకలు బంద్ కావడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తల్పేరుకు వస్తున్న ఇన్‌ఫ్లోను జాగ్రత్తగా గమనిస్తున్నారు. -
భద్రాచలం వద్ద పెరిగిన గోదావరి నీటిమట్టం
-
భద్రాచలం వద్ద పెరిగిన గోదావరి నీటిమట్టం
► భారీగా వస్తున్న వరదనీరు భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ఎగువన ఉన్న ప్రాణహిత, ఇంద్రావతి నదుల నుంచి భారీ ఎత్తున వరదనీరు వచ్చి చేరుతుండడంతో సోమవారం ఉదయానికి నీటిమట్టం 43 అడుగులకు చేరింది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేశారు. రామన్నగూడెం పుష్కరఘాట్‌లో గోదావరి నీటిమట్టం 9.7 మీటర్లకు చేరింది. దాంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు. నీటి ఉధృతిని అధికారులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. -
గుంటూరు చానల్‌కు గండి
► నంబూరులో వంతెన నిర్మాణ పనుల వద్ద ఘటన ► గుంటూరు నగరానికి నెల రోజులు సరిపడా నీరు మురుగు చెరువుపాలు.. నంబూరు (పెదకాకాని) : నంబూరు వద్ద గుంటూరు చానల్ (కాలువ)కు గండి పడింది. మంగళవారం రాత్రంతా కృష్ణా నది నుంచి చానల్‌కు వచ్చిన నీరు గ్రామంలోకి చేరి మురుగు చెరువు పాలయ్యాయి. నంబూరు గ్రామంలోకి వెళ్లేందుకు గుంటూరు చానల్‌పై నిర్మించిన వంతెన దాటాల్సి ఉంటుంది. ఈ వంతెన శిథిలావస్థకు చేరుకుంది. దీంతో వంతెన నిర్మాణం, రోడ్డు విస్తరణకు రూ.2 కోట్లు ఆర్డీఎస్ నిధులు మంజూరయ్యాయి. వాటిలో సుమారు రూ.76 లక్షలతో 24 రోజుల క్రితం కాంట్రాక్టర్ వంతెన నిర్మాణం పనులు ప్రారంభించారు. సుమారు 20 వేల మంది జనాభా ఉన్న గ్రామంలో వంతెన నిర్మించేటప్పుడు ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలుగకుండా తాత్కాలికంగా రోడ్డు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే కాంట్రాక్టర్ మొదట్లో తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేయకుండానే పనులు చేపట్టారు. ఈ విషయం వివాదంగా మారడంతో అస్తవ్యస్తంగా తాత్కాలిక రోడ్డు నిర్మించారు. ప్రజలు ఈ పనులపై ప్రశ్నించిన ప్రతిసారీ పోలీసులను రప్పించి వెళ్లగొట్టడం, ఎవరైనా పనుల తీరుపై మాట్లాడితే అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. నీటి ప్రవాహంతో విద్యుత్ స్తంభం, కేబుల్ వైర్లు, పైపులైన్లకు దెబ్బ.. గుంటూరు చానల్‌పై వంతెన నిర్మాణం పనులతో కాలువ నీటిని పక్కకు మళ్లించారు. నాశిరకం పనులతో నీరు మళ్లించిన కాలువ కట్టకు గండి పడి నీరు గ్రామంలోని చెరువుకు చేరింది. కాలువ కట్ట కోతకు గురికావడంతో విద్యుత్ స్తంభం ఒరిగిపోయింది. బీఎస్ఎన్ఎల్ కేబుల్ వైర్లు, పైపులైన్ దెబ్బతిన్నాయి. కాలువకు గండి పడటం వల్ల గ్రామంలోని చెరువులో సుమారు రూ.18 లక్షల విలువైన చేపలు చెల్లాచెదురయ్యాయని చేపల పెంపకందారుడు బట్టు శివరామకృష్ణ తెలిపారు. -
గోదారి ఎడారి
► కోల్‌బెల్ట్‌లో ఇక నీటి కటకటే ► గోదావరి నదిలో నిలిచిన ప్రవాహం ► ఎల్లంపల్లి నుంచి దిగువకు నీరు బంద్ ► విద్యుత్ కేంద్రాలకూ తప్పని తిప్పలు గోదావరిఖని : గోదావరి నదిలో నీటి ప్రవాహం తగ్గిపోయింది. ఎండలు పూర్తిగా ముదరకముందే నదిలో నీటిఛాయలు కనిపించకుండా పోతున్నాయి. హైదరాబాద్‌కు నీటిని తరలించే ఉద్దేశంతో ఎల్లంపల్లి నుంచి దిగువకు నీటి విడుదల నిలిపివేయగా, ఇప్పుడు పాయ కూడా పారడం లేదు. గోదావరిఖని, యైటింక్లయిన్‌కాలనీ, సెంటినరీకాలనీల ప్రజలకు, సింగరేణి, తెలంగాణ జెన్కో విద్యుత్ కర్మాగారాలకు నీటి తిప్పలు ఏర్పడనున్నాయి. సాధారణంగా గోదావరి నదిలో నీటి ప్రవాహంతో సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసిన 26 ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీల ద్వారా గోదావరిఖనిలోని 7,300 క్వార్టర్లు, యైటింక్లయిన్‌కాలనీలోని 4,500 క్వార్టర్లు, సెంటినరీకాలనీలోని 2,500 క్వార్టర్లకు నీటి సరఫరా జరుగుతుంది. పట్టణంలోని దాదాపు 25 వేల పైచిలుకు ప్రైవేటు గృహాలకు కూడా సింగరేణి నీరే అందుతుంది. ఈ మూడు ప్రాంతాల్లో తాగునీటికోసం నిత్యం 70 లక్షల గ్యాలన్ల నీరు సరఫరా చేస్తున్నారు. తాజాగా నదిలో నీటి ప్రవాహం తగ్గిపోవడంతో సింగరేణి యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో మునిగిపోయింది. గతంలో 2010 నుంచి 2013 వరకు నదిలో నీటి ప్రవాహం పూర్తిగా తగ్గి నది ఎడారిని తలపించింది. దీంతో యాజమాన్యం రోజు విడిచి రోజు నీరు అందించేందుకు నదిలో 40 బోర్లు వేసి ప్రతీ బోరు ద్వారా రోజుకు వచ్చిన లక్ష గ్యాలన్ల నీటిని మూడు ప్రాంతాలకు అందించారు. దీనికితోడు సింగరేణి భూగర్భగనుల్లో ఊటగా వచ్చిన నీటిని కూడా ఉపరితలానికి తరలించి ఫైవింక్లయిన్ వద్ద గల ఫిల్టర్‌బెడ్‌లో శుద్ధి చేసి కాలనీలకు సరఫరా చేశారు. ఈ ఏడాది కూడా నీటికి ఇబ్బంది ఏర్పడనుండడంతో ఇప్పటికే బోర్లను గోదావరి నది ఒడ్డున గల ఇంటెక్వెల్ వద్దకు అధికారులు చేర్చారు. రామగుండం కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లకు గాను 16 వేల నల్లా కనెక్షన్లుండగా రోజు విడిచి రోజు 10 మిలియన్ గ్యాలన్ల నీటిని అందిస్తున్నారు. నది ఒడ్డున గల కార్పొరేషన్ ఇంటెక్వెల్ వద్ద ఇప్పటికే నీటి కోసం కాలువ తీయగా... రాబోయే రోజుల్లో అవసరమైన చర్యలకోసం నిధుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. హైదరాబాద్‌కు నీటిని తరలించాకే... ఎల్లంపల్లి బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 836.5 మీటర్ల మేర నీరు నిల్వ ఉంది. నీటి నిల్వ 835 మీటర్ల దిగువకు పడిపోతే హైదరాబాద్‌కు నీటిని తరలించే అవకాశం ఉండదు. అందువల్ల నీటి పారుదలశాఖ అధికారుల ఆదేశం మేరకు ఎల్లంపల్లి నుంచి దిగువకు నీటిని వదలకుండా బంద్ చేసి ప్రస్తుతం హైదరాబాద్‌కే తరలిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో దిగువన నీటి ప్రవాహం లేకుండా పోయింది. విద్యుత్ పరిశ్రమలకు ఇబ్బందే తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో రామగుండం వద్ద 62.5 మెగావాట్ల విద్యుత్ కేంద్రం నడుస్తుండగా ఇందుకు అవసరమైన నీటిని గోదావరి నది నుంచి తీసుకుంటున్నారు. ప్రస్తుతం నదిలో నీటిలభ్యత లేకపోవడంతో ప్లాంట్ నిర్వహణ కష్టసాధ్యమయ్యేలా ఉంది. సింగరేణి ఆధ్వర్యంలో గోదావరిఖనిలో నడుస్తున్న పవర్‌హౌస్‌కు నది నుంచి ‘రా వాటర్’ సరఫరా చేస్తారు. నదిలో నీరు లేకపోవడంతో ఇంటెక్వెల్ వద్ద 22 మీటర్ల లోతులో ఉన్న పంప్‌లకు కూడా నీరు అందక ఈ నెల 3 నుంచి పవర్‌హౌస్‌కు నీటి సరఫరా కావడం లేదు. దీంతో కాలనీల ప్రజలకు తాగునీటి కోసం సరఫరా చేసే నీటిలో నుంచి 3 లక్షల గ్యాలన్ల నీరు, జీడీకే 1వ గనిలో ఊటగా వచ్చిన మరో లక్ష గ్యాలన్ల నీటిని అందిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద ఇటీవల 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌కు సింక్రనైజేషన్ చేయగా... మరో మూడు నెలల వరకు ఇక్కడ మెయింటనెన్స్ పనులు చేస్తారు. ప్రాణహిత నుంచి ఇంకా లైన్ వేయకపోవడంతో ప్రస్తుతం సమీపంలో ఉన్న చెట్పల్లి-సుందిళ్ల సరిహద్దులోని గోదావరి నది నుంచి నీటిని వినియోగిస్తున్నారు. నదిలో నీటి ప్రవాహం లేని కారణంగా ఈ విద్యుత్ కేంద్రానికి కూడా ఇబ్బందులు త ప్పేలా లేవు. -
ముగ్గురిని రక్షించి.. తాను గల్లంతై..
ద్విచక్ర వాహనంపై వెళుతూ అదుపు తప్పి వంకలో పడ్డ ఇద్దరు చిన్నారులు, ఓ వ్యక్తి వారిని రక్షించి తూములో పడి ప్రవాహంలో కొట్టుకుపోయిన 65 ఏళ్ల వృద్ధుడు పోలీసుల ముమ్మర గాలింపు పూతలపట్టు: ముగ్గురిని ప్రమాదం నుంచి రక్షించడం కోసం ఓ వృద్ధు డు తన ప్రాణాలను పణంగా పెట్టి న ఘటన పూతలపట్టు మండలంలోని యం.బండపల్లె వంకలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పూ తలపట్టు, పెనుమూరు పోలీసుల కథనం మేరకు.. జీడీ నెల్లూరు మండలం కొట్రకోణ గ్రామానికి చెందిన కె. కృష్ణయ్య(65) కొంత కాలంగా పెనుమూరు మండలం కలికిరి గ్రామంలోని తన కూతురు వద్ద ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం స్వగ్రామానికి వెళ్లేందుకు యం.బండపల్లె నుంచి తూపల్లె మీదుగా వెళ్లే వంతెనను దాటుతున్నాడు. ఈ సమయంలో ఓ కుటుంబంలోని ఇద్దరు చిన్నారులు, ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంలో వంతెనను దాటుతుండగా అదుపుతప్పి నీటిలో పడ్డారు. వెంటనే కృష్ణయ్య వారిని కాపాడాడు. ఇదే క్రమంలో ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న తూములో పడ్డాడు. ఎన్టీఆర్ జలాశయానికి కేవలం 200 మీటర్లు దూరంలో ఘటనాస్థలం ఉండడం, నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో వరదనీటిలో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పూతలపట్టు ఎస్ఐ మురళీమోహన్ సంఘటనా స్థలం వద్దకు వెళ్లి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన కృష్ణయ్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి కావడంతో ఎంత వెదికినా కృష్ణయ్యజాడ దొరకలేదు. దీంతో పోలీసులు వెనుదిరిగారు. శనివారం ఉదయం మళ్లీ గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. స్థానికులు కృష్ణయ్య సాహసాన్ని.. పరోపకార గుణాన్ని తెలుసుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు.